అనంతపురం

టీడీపీ ఆధ్వర్యంలో జాతీయ రహదారి దిగ్బంధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం కల్చరల్, మార్చి 22: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండ్‌తో నగరంలోని 44వ నెంబర్ జాతీయ రహదారిపై టీడీపీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. గురువారం రవి పెట్రోల్ బంక్ ముందు జాతీయ రహదారిపై బైఠాయించి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ విభజన హామీలను అమలుచేయకుండా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను మోసగిస్తోందన్నారు. హోదాకు మించిన ప్రయోజనాలు కలిగేలా ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని పేర్కొని నాలుగేళ్లు గడుస్తున్నా ఎటువంటి హామీలు అమలు చేయలేదన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, లేనిపక్షంలో బీజేపీకి రాష్ట్రంలో పుట్టగతులుండవన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే దాకా టీడీపీ కేంద్రంపై పోరాటాన్ని కొనసాగిస్తుందన్నారు.

రాయసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలి
అనంతపురం సిటీ, మార్చి 22: రాయలసీమలో హైకోర్టు ఏర్పాటుచేయాలని రాయలసీమ విమోచన సమితి, రాయలసీమ ప్రజా సమితి నాయకులు డిమాండ్ చేశారు. గురువారం నగరంలోని పాతూరు పద్మావతి ఫంక్షన్ హాల్‌లో ఆర్‌వీఎస్, ఆర్‌పీఎస్ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్‌వీఎస్ కన్వీనర్ రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ రాయలసీమకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. శ్రీ్భగ్ ఒప్పందాన్ని అమలుచేయకుండా మోసం చేస్తున్నారని తెలిపారు. ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా రాయలసీమకు 400 టీఎంసీల నికర జలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గుంతకల్లులో రైల్వే జోన్, కియా మోటార్స్‌లో జిల్లా వాసులకే ఉద్యోగాలు ఇవ్వాలని, ఎయిమ్స్ హాస్పిటల్, సెంట్రల్ యూనివర్సిటీ, విభజన హామీలను తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.