అనంతపురం

ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం కల్చరల్, మార్చి 22: ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో పెట్టి, వర్గీకరణ బిల్లుకు చట్టబద్దత కల్పించాలని ఏపీ ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు లింగమయ్య డిమాండ్ చేశారు. ఈమేరకు గురువారం కలెక్టరేట్ ఎదుట ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీలను ఏబీసీడీ వర్గీకరణ చేపట్టి, మాదిగలు, మాదిగ ఉప కులాలకు తగిన న్యాయం చేయాలన్నారు. అదేవిధంగా మాదిగలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుచేయాలని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాదిగలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలుచేయాలని, రాష్ట్రానికి హోదా కోసం పోరాటం చేస్తున్న విధంగానే వర్గీకరణ కోసం ఉద్యమించాలన్నారు.