అనంతపురం

గత ప్రభుత్వ హయాంలో కోట్ల రూపాయల దుర్వినియోగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం కల్చరల్, మార్చి 22: గత ప్రభుత్వం తప్పిదాల వల్ల గృహ నిర్మాణ పథకంలో రూ. 4150 కోట్ల దుర్వినియోగమైందని, అందుకు బాధ్యులైన వారు ఆస్తులు కూడబెట్టుకున్నారని, బాధిత పేదలకు మాత్రం సొంతిల్లు లేకుండా పోయిందని అర్బన్ ఎమ్మెల్యే ప్రభాకర చౌదరి పేర్కొన్నారు. పేద ప్రజల సొంతింటి నిర్మాణాలపై ఎమ్మెల్యే గురువారం అసెంబ్లీలో మాట్లాడారు. స్వాతంత్య్రానంతరం దశాబ్దాల తరబడి అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఎటువంటి న్యాయం చేయలేదన్నారు. 1983లో దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు రాజకీయ ప్రభంజనం సృష్టించి అధికారంలోకి వచ్చారన్నారు. పేదవాడి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కూడు, గూడు, గుడ్డ అనే నినాదంతో అనేక పథకాలు ప్రవేశపెట్టారన్నారు. ఆయన స్ఫూర్తితోనే గుడిసెలు లేని రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్టీఆర్ గృహ పథకం ప్రవేశపెట్టారన్నారు. పేదవాడి సొంతింటి కల నెరవేర్చేందుకు చంద్రబాబు చొరవ అభినందనీయమన్నారు. అయితే గత పాలకులు గృహ నిర్మాణంలో 14 లక్షల ఇళ్లు నిర్మించామని చెప్పుకున్నారని, అయితే గ్రామాల్లో అనేకమంది పేదవారి పేర్లతో రుణాలు పెండింగ్‌లో ఉన్నాయే కానీ వారికి మాత్రం ఏ ఇళ్లు నిర్మించలేదన్నారు. గత ప్రభుత్వం వల్ల రూ. 4150 కోట్లు దుర్వినియోగమైందన్నారు. దీనికి బాధ్యులు ఎవరని ఎమ్మెల్యే ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా ఎన్టీఆర్ గృహ నిర్మాణం విషయంలో పారదర్శకంగా ఉండేలా టీడీపీ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం శుభపరిణామమన్నారు.