అనంతపురం

నీటి సమస్య పరిష్కారానికి చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందూపురం టౌన్, మార్చి 23 : జిల్లాలోని మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ప్రస్తుత వేసవి కాలంలో నీటి సమస్య తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ప్రజారోగ్య విభాగం ఎస్‌ఇ శ్రీనాథ్‌రెడ్డి తెలిపారు. ముఖ్యంగా పైపులైన్లు లీకేజీ కాకుండా ఎప్పటికప్పుడు మరమ్మత్తులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని సూచించినట్లు తెలిపారు. శుక్రవారం ఇక్కడికి విచ్చేసిన ఆయన తొలుత మున్సిపల్ కమిషనర్ భాగ్యలక్ష్మితో సమావేశమై పట్టణంలో నిర్మాణమవుతున్న కూరగాయల మార్కెట్, రూ.194 కోట్లతో అమలవుతున్న గొల్లపల్లి తాగునీటి పథకం తదితర అంశాలపై చర్చించారు. అనంతరం ముద్దిరెడ్డిపల్లి, చిన్న మార్కెట్ కూడలి తదితర ప్రాంతాల్లో పర్యటించి నీటి సమస్య పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై ఇంజనీరింగ్ విభాగం అధికారులకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా విలేఖరులతో ఎస్‌ఇ మాట్లాడుతూ వేసవిని దృష్టిలో ఉంచుకుని జిల్లాలోని వివిధ మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో నీటి సమస్య పరిష్కారానికి రూ.7.6కోట్లతో ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి పంపినట్లు తెలిపారు. నూతనంగా పైపులైన్లు వేయడం, పైపులైన్‌ల మరమ్మతులు, బోర్ల ఫ్లషింగ్, డీపెనింగ్, ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాకు ఆయా మొత్తాలను ఉపయోగించుకోవాల్సి ఉంటుందన్నారు. ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు గుత్తి, హిందూపురంలో ఒకింత నీటి సమస్య అధికంగా ఉందన్నారు. గుంటూరులో చోటు చేసుకున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకుని జిల్లాలో ఎక్కడా పైపులైన్లు లీకేజీలకు గురి కాకుండా ఎప్పటికప్పుడు మరమ్మతులు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించామన్నారు. మేనెలాఖరు నాటికి గొల్లపల్లి రిజర్వాయర్ నుండి హిందూపురానికి తాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రూ.194 కోట్లలో కాంట్రాక్టర్ ఇప్పటికే రూ.94 కోట్ల పనులు పూర్తి చేసి బిల్లులు సమర్పించగా రూ.24 కోట్లను చెల్లించామని, మిగిలిన మొత్తాన్ని కూడా దశల వారీగా చెల్లించనున్నట్లు తెలిపారు. అలాగే 52 కిలోమీటర్ల మేర ఉన్న ఈ తాగునీటి పథకం మధ్యలో నాలుగు జీఎల్‌బీఆర్‌లు నిర్మించాల్సి ఉండగా ప్రస్తుతం మూడు పనులు ప్రారంభమయ్యాయన్నారు. రైల్వేక్రాసింగ్ వద్ద పైపులైన్ ఏర్పాటు కోసం సంబంధిత అధికారులకు అనుమతి కోరామన్నారు. స్థానిక ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వీలైనంత త్వరగా తాగునీటి పథకాన్ని పూర్తి చేయించేందుకు కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. ఇకపోతే పట్టణంలో రూ.23 కోట్లతో మార్కెట్ నిర్మాణానికి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.