అనంతపురం

అరకొరగా ఎరువుల సరఫరా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, మార్చి 23 : జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరంలో ఖరీఫ్, రబీ సీజన్‌లకు సంబంధించి ఎరువుల సరఫరా సగానికి పడిపోయింది. ఖరీఫ్, రబీ సీజన్లలో జిల్లా వ్యాప్తంగా పండ్ల తోటలు, కూరగాయలు, ఆకుకూరల పంటలు అధికంగా సాగవుతున్నాయి. ఖరీఫ్‌లో వర్షాధార వేరుశనగ పంటతో పాటు ఇతరత్రా పంటలు కూడా బోర్లు, బావుల కింద రైతులు సాగు చేయడం రివాజు. ఈ క్రమంలో వివిధ రకాల ఎరువులు రెండు సీజన్లలోనూ వాడుతుంటారు. జిల్లాకు 2017-18 ఖరీఫ్, రబీలకు డిస్ట్రిక్ట్ ఫర్టిలైజర్ ప్లాన్ మేరకు 2,26,746 మెట్రిక్ టన్నులు అవసరమని అంచనా వేశారు. అయితే దశల వారీగా ఇప్పటి వరకు 1,24,522 మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా అయ్యాయి. దీంతో తగినన్ని ఎరువులు అందుబాటులో లేక రైతులు ఇబ్బంది పడ్డారు. మరోవైపు రసాయన ఎరువుల వాడకంపై రైతుల్లో అవగాహన కల్పిస్తున్న నేపథ్యంలో ఎరువుల వాడకం తగ్గిందన్న అభిప్రాయాన్ని సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులు అంటున్నారు. అయితే అనధికారికంగా ఎరువుల విక్రయం ఉండటం వల్ల అధికారిక గణాంకాల్లో ఎరువుల సరఫరా తక్కువగా నమోదైనట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో అధికారికంగా సరఫరా అయిన ఎరువుల కొనుగోలులో అధిక ధరలు కూడా వెచ్చించాల్సి వచ్చిందని రైతుల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి. ఫర్టిలైజర్ ప్లాన్ మేరకు 2017-18 ఆర్థిక సంవత్సరానికి యూరియా 48,334 మెట్రిక్ టన్నులు లక్ష్యం కాగా, సరఫరా అయింది 40,380 మెట్రిక్ టన్నులే. ఎం ఓపీ 22,100కు గానూ 10,276.8 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ 1,10,045 లక్ష్యం కాగా 54,592.9 మెట్రిక్ టన్నులు, ఎస్ ఎస్‌పీ 6,495కు గానూ 3559 మెట్రిక్ టన్నులు, ఇతరత్రా ఎరువులు 1,771కి గానూ 5.5 మెట్రిక్ టన్నులు మాత్రమే జిల్లాకు చేరాయి. అవసరమైనంత మేరకు ఎమ్మార్పీ ధరలకు ఎరువులు లభ్యం కాలేదని, వివిధ కంపెనీలు ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం మేరకు కాకుండా సొంతంగా కూడా సరఫరా చేసుకోవడం వల్ల ఫర్టిలైజర్ ప్లాన్ మేరకు ఎరువులు సరఫరా కాలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వచ్చే ఏడాది అయినా తగినన్ని ఎరువులు అందుబాటులో ఉంటాయా అన్న సందేహాలు రైతులు వ్యక్తం చేస్తున్నారు