అనంతపురం

బడుగు, బలహీన వర్గాలను మోసం చేస్తున్న ప్రభుత్వాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం సిటీ, ఏప్రిల్ 24: దేశ వ్యాప్తంగా బడుగు, బలహీన, దళిత, గిరిజన, మైనార్టీలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయని రిజర్వేషన్ల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు జి.నాగరాజు ఆరోపించారు. మంగళవారం స్థానిక ఆర్‌పీఎస్ కార్యాలయంలో విలేఖర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో బలహీన వర్గాలను టీడీపీ చిన్నచూపుచూస్తోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3 శాతం ఉన్న కమ్మలకు రాష్ట్రంలో సీఎం, ఇతర మంత్రిత్వ శాఖలను అప్పగించారని, 55 శాతంపైన వున్న బీసీలకు 8 మంత్రి పదవులను కట్టబెట్టి, ఆ మంత్రి పదవులను అలంకరించిన మంత్రులు నామమాత్రంగా పెట్టారన్నారు. రాష్ట్రంలో 3 విడతలగా చేస్తామన్న రైతు రుణమాఫీ ఇంతవరకు రైతులకు అందలేదన్నారు. టీటీడీలో లేని పోస్టు ఎస్‌వీబీసీ ఛైర్మెన్ పదవిని సృష్టించి అగ్రకులాల వారికి కట్టబెట్టారని, కానీ బడుగు, బలహీన వర్గాలను కేవలం ఓటుబ్యాంకుగానే చూస్తున్న టీడీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని హెచ్చరించారు. రాష్ట్రంలో చంద్రబాబు వ్యవహార శైలి మార్చుకోవాలని డిమాండ్ చేశారు, లేనిపక్షంలో ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. దేశంలో రిజర్వేషన్లపై నరేంద్రమోదీ అనుసరిస్తున్న తీరును ఆయన తప్పుబట్టారు. మోదీకి రాబోవు కాలంలో ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

రోడ్డు భద్రతపై విద్యార్థులకు అవగాహన
* ట్రాఫిక్ డీఎస్పీ జి. రామకృష్ణయ్య
అనంతపురం అర్బన్, ఏప్రిల్ 24: ఈ నెల 29న రోడ్డు భద్రతా వారోత్సవాలను పురస్కరించుకొని నగర ట్రాఫిక్ డీఎస్పీ జి. రామకృష్ణయ్య మంగళవారం రైల్వే స్టేషన్ సమీపంలోని శ్రీ సాయిరంగ కేంద్రంలోని డీఎస్‌సీ అభ్యర్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని విద్యార్థులకు ఆయన సూచించారు. నియమాలను పాటిస్తే ప్రమాదాలకు అడ్డుకట్ట వేయవచ్చునన్నారు. రోడ్డు భద్రతా నియమాలను ఉల్లంఘించటం వల్ల ప్రమాదాలు చోటు చేసుకొంటున్నాయన్నారు. ఈ ప్రమాదాల్లో గాయపడి జీవితకాలం వైకల్యంతోపాటు విలువైన ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. దీనివల్ల తల్లిదండ్రులకు పుట్టెడు శోకాన్ని మిగులుస్తున్నారన్నారు. ఈ సందర్భంగా గతంలో జరిగిన రోడ్డు ప్రమాదాలపై జరిగిన తీరుపై తీసిన లఘ చిత్రాలను స్క్రీన్‌పై చూపించి అవగాహన కల్పించారు. రోడ్డు భద్రతా నియమాలను పాటించి పోలీసులకు సహకరించాలన్నారు.