అనంతపురం

సిఫాయి అమరనాథ్ మృతి బాధాకరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పామిడి, ఏప్రిల్ 24 : అరుణాచల్‌ప్రదేశ్ చెప్పకోవ గ్రామ సమీపంలోని ఫారెస్టు ఏరియాలో ఈనెల 22న వేకువజామున ఆపరేషన్ జరుగుతున్న క్రమంలో వాహనం టైర్‌ఫంక్షరై నదిలో పడిపోయి సిఫాయి బోయ అమరనాథ్ మృతి బాధాకరమని కలెక్టర్ వీరపాండ్యన్, ఎస్పీ అశోక్‌కుమార్ అన్నారు. ఈమేరకు అమర్‌నాథ్ అంత్యక్రియలు మంగళవారం మండల పరిధిలోని వంకరాజుకాల్వ గ్రామంలో అధికారిక లాంచనాలతో జరిగాయి. మెడ్రాస్ రెజిమెంట్ 20 మెట్రిన్ యూనిట్ నాయబ్ సుభేదార్ జే.ఆధినారాయణ బెటాలియన్‌తో ప్రత్యేక వాహనంలో అమర్‌నాథ్ మృతదేహాన్ని గ్రామానికి తీసుకురావడంతో ఒక్కసారిగా గంభీర వాతావరణం నెలకొంది. అప్పటికే స్నేహితులు, బంధువులు, సమీప ప్రజల భారీగా గ్రామానికి చేరుకున్నారు. బంధువులు, స్నేహితుల ఆర్థనాదాలు పలువురిని కంటతడి పెట్టించాయి. కలెక్టర్ వీరపాండియన్, ఎస్పీ అశోక్‌కుమార్, జాయింట్ కలెక్టర్ రమామణి, ఆర్డీఓ మలోల, తహశీల్దార్ రమణారెడ్డి, సీఐ నరేంద్రరెడ్డి, ఎస్‌ఐ రవిశంకర్‌రెడ్డి మృతదేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మృతుని కుటుంబానికి ప్రభుత్వాల నుంచి అందాల్సిన పరిహారం త్వరతగతిన అందించేందుకు చర్యలు తీసుకోవడంతోపాటు ఎల్లవేళలా అండగా ఉంటామన్నారు. అనంతరం పోలీసులు గాల్లోకి మూడు రౌండ్ల కాల్పులు జరిపి అంత్యక్రియలు నిర్వహించారు. కాగా అమర్‌నాథ్ మెడ్రాస్ రెజిమెంట్ 20 మెట్రిన్ యూనిట్‌లో సిఫాయిగా విధులు నిర్వహిస్తున్నాడు. అరుణాచల్‌ప్రదేశ్ చెప్పకోవ ఫారెస్టు ఏరియాలో ఆదివారం వేకువజామున వర్షంలో ఆఫరేషన్ జరుగుతున్న క్రమంలో 18 మంది ప్రయానిస్తున్న వాహనం టైర్‌ఫంక్షరై అదుపుతప్పి సమీపంలోని నదియా నదిలో పడిపోయింది.