అనంతపురం

టీడీపీ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాడిపత్రి, ఏప్రిల్ 24: ఆంధ్రప్రదేశ్‌లో అవినీతిమయమైన పాలనందిస్తున్న తెలుగుదేశం ప్రభుత్వాన్ని వెంటనే బర్తరఫ్ చేయాలని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు జంగంరెడ్డి అంకాల్‌రెడ్డి డిమాండ్ చేశారు. స్థానిక ప్యారడైజ్ హోటల్‌లో మంగళవారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రాలో అవినీతి తాండవిస్తోందని, అన్ని రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని, అవినీతిమయమైన తెలుగుదేశం ప్రభుత్వాన్ని వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఏమి చేయలేదని ఆరోపణలు చేస్తున్నారని, మిత్రపక్షంగా బీజేపీ లేకుండా టీడీపీ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటుచేసుకోలేదన్నారు. చంద్రబాబుకు ధైర్యముంటే ముందస్తు ఎన్నికలు ప్రకటించి సత్తా చాటుకోవాలని డిమాండ్ చేశారు. కర్ణాటకలోని తెలుగువారు బీజేపీకి వ్యతిరేకంగా ఓట్లు వేయాలని టీడీపీ చెబుతుందని, పరోక్షంగా కాంగ్రెస్‌కు ఓటు వేయాలంటున్నారని, ఏపీలో టీడీపీ, కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకునేందుకు సంకేతాలు ఇస్తుందని, ఇందంతా చూస్తున్న ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పంచాయతీ రాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేశాడని, ప్రజల ద్వారా ఎన్నికైన సర్పంచ్‌ల అధికారాలను దొడ్డిదారిన రాజ్యాంగానికి వ్యతిరేకంగా జన్మభూమి కమిటీల పేరుతో టీడీపీ కార్యకర్తలు లబ్ది పొందేలా చేస్తున్నారని ఆరోపించారు. చంద్రన్న బాటలో పూర్తిగా కేంద్ర నిధులతోనే సిమెంటు రోడ్లు వేస్తున్నారనే విషయం ప్రజలు గమనించాలన్నారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అంబటి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో టీడీపీ అవినీతి ప్రభుత్వం నడుపుతుందని, ట్రేడింగ్ వ్యవస్థ నడుస్తుందన్నారు. 4 సంవత్సరాల పాలనలో 400 రకాల అవినీతికి పాల్పడి రికార్డు సృష్టించిన ముఖ్యమంత్రి చంద్రబాబును వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. పోలవరం, పట్టిసీమ, అమరావతి, ఇసుక, గనులలో ప్రభుత్వం అవినీతికి పాల్పడినందున రాష్ట్ర ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయడంలో తప్పేముందని ప్రశ్నించారు. రాష్ట్రంలో అమృత్ పథకం కింద 36 మునిసిపాలిటీలు ఎంపికైనాయని, క్రేంద్ర ప్రభుత్వం గ్రేడింగ్ పద్ధతిన 730 కోట్లు మంజూరు చేయగా, డబ్బులు దారి మళ్లించి అమరావతికి తీసుకెళ్ళారని ఆరోపించారు. తాడిపత్రి మునిసిపాలిటీకి 176 కోట్లు అమృత్ పథకం కింద నిధులు మంజూరు కాగా కేవలం 20 కోట్లు నిధులు మాత్రమే ఖర్చు చేశారన్నారు. జడ్‌ఆర్‌యూసీసీ మెంబర్ ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ గ్రామ స్వరాజ్యంతోనే దేశ స్వరాజ్యం సాధ్యమని, గ్రామాలు అభివృద్ది చెందితే దేశం అభివృద్ది చెందుతుందని 74వ రాజ్యాంగ సవరణ చేసి గ్రామ వికాసానికి బీజేపి పాటుబడిందన్నారు. గ్రామ స్వరాజ్యంపై కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదన్నారు. దేశ చరిత్రలో పంచాయతీలకు బీజేపీ భారీగా నిధులిచ్చిందని, టీడీపీ ఆ నిధులను పక్కదారి పట్టించిందన్నారు. పోలవరానికి చంద్రబాబు పర్యవేక్షకుడు మాత్రమేనని, పోలవరం నిర్మించేది కేంద్ర ప్రభుత్వమేనని తెలిపారు.