అనంతపురం

సత్యసాయి ట్రస్టు సేవలకు నిధుల కొరత లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుట్టపర్తి, ఏప్రిల్ 24 : భగవాన్ సత్యసాయిబాబా నెలకొల్పిన మహత్తరమైన సత్యసాయి ట్రస్టు సేవా కార్యక్రమాల నిర్వహణకు నిధుల కొరత ఏ మాత్రం లేదని ట్రస్టు సభ్యులు ఆర్‌జే రత్నాకర్ వెల్లడించారు. సత్యసాయి 8వ ఆరాధనోత్సవాలను ప్రత్యేక పూజలు నిర్వహించి ట్రస్టు సభ్యులతో కలిసి ఆయన కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా ప్రశాంతి నిలయంలో ఆరాధన ఉత్సవాలను భక్తి భావంతో నిర్వహించి బాబా సంకల్ప సిద్ధిని ప్రాప్తించాలని వేడుకున్నారు. అనంతరం హిల్‌వ్యూ స్టేడియంలో అన్నదాన, వస్తద్రాన, నారాయణ సేవ కార్యక్రమాలను పూజలు నిర్వహించి ప్రారంభించారు. 50వేల మందికి పైగా అన్నార్థులు, సాయి భక్తులు హాజరయ్యారు. ప్రతి ఒక్కరికీ అన్న, వస్త్ర, ప్రసాదాలు అందేంతవరకు దగ్గరుండి ఏర్పాట్లును పర్యవేక్షించారు. అనంతరం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ సత్యసాయి బాబా స్థాపించిన సేవా ట్రస్టుకు గతంలో విదేశాల నుండి విరివిగా నిధులు సమకూరేవన్నారు. 2011 సంవత్సరంలో ఆయన శివైఖ్యం చెందిన తరువాత భక్తులలో ట్రస్టు నిర్వహణ సభ్యులలో ఆందోళన చోటు చేసుకుందన్నారు. ట్రస్టుకు ప్రస్తుతం మన దేశంలోని సత్యసాయి భక్తుల నుండే విరివిగా విరాళాలు అందుతున్నాయన్నారు. విద్య, వైద్య, తాగునీరు పథకాలు కొనసాగిస్తూనే సామాజిక సేవలు విస్తృతపరుస్తున్నామన్నారు. పుట్టపర్తి, బుక్కపట్నం, కొత్తచెరువు ఈ మూడు మండలాలకు బాబా శివైఖ్యం అనంతరం వంద కోట్ల రూపాయలకు పైగా వెచ్చించి తాగునీరు అందించామన్నారు. రూ.8 కోట్లుకు పైగా ఖర్చు చేసి పరిసర గ్రామాల రోగులకు అనుగుణంగా జనరల్ ఆసుపత్రిని నిర్మించామన్నారు. పర్యావరణాన్ని కాపాడుతూ సత్యసాయి సంస్థలకే కాక పరిసర గ్రామాలకు సైతం 3 మెగావాట్లకు పెంచి సోలార్ విద్యుత్‌ను అందించాలన్న ఆలోచనతో ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా కొత్త రక్తం సాయి సేవా స్పూర్తితో ముందుకు నడిచేందుకు రావడం జరుగుతోందన్నారు. సత్యసాయి అనుగ్రహ ఆశీస్సులు యావత్ మానవాళిపై వుండాలని ఆకాంక్షిస్తూ ఆరాధనోత్సవాలను నిర్వహించడం జరిగిందన్నారు.