అనంతపురం

అన్ని చెరువులకు కృష్ణాజలాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, ఏప్రిల్ 25 : జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ చెరువులన్నీ కృష్ణా జలాలతో కళకళలాడుతున్నాయని, త్వరలో మడకశిర నియోజకవర్గానికి నీరిందిస్తామని జిల్లా ఇన్‌చార్జి, జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. ఇందుకోసం జల వనరుల శాఖ అధికారులు కృషి చేయాలని ఆదేశించారు. బుధవారం స్థానిక కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో జల వనరుల శాఖ ఆధ్వర్యంలో నీరు-చెట్టు, తాగునీరు, డ్వామా పనుల పురోగతి, జిల్లా అభివృద్ధిపై మంత్రి కాలవ శ్రీనివాసులు, శాసనమండలి చీఫ్‌విప్ పయ్యావుల కేశవ్, జడ్పీ చైర్మన్ పూల నాగరాజు, కలెక్టర్ జీ.వీరపాండ్యన్‌తో కలిసి జిల్లా అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో నీరు-చెట్టు మంచి ఫలితాలు సాధిస్తోందన్నారు. జిల్లాను ప్రగతి పథంలో నడిపించడానికి జల వనరుల శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇందులో భాగంగా ప్రతి ప్రాజెక్టు విషయాన్ని ప్రజలకు తెలియజేయాలని, అలాగే పోలవరం పనులు ఎలా అమలవుతున్నాయో మండల స్థాయి అధికారులు, మేధావులు, జిల్లా జర్నలిస్టులు, మహిళా సంఘాల ప్రతినిధులు ప్రాజెక్టుల్ని సందర్శించడానికి రానూపోనూ బస్సు సౌకర్యాన్ని కల్పించాలని, జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల మేరకు నిర్వహించాలని జల వనరుల శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. త్వరలో జిల్లా అధికారుల ఆధ్వర్యంలో నీరు-ప్రగతి పురోగతిపై భారీ వర్క్‌షాప్ ఉంటుందని, ముఖ్యమంత్రి చంద్రబాబు రానున్నారని తెలిపారు. జిల్లాలో నీటి ఎద్దడి నివారణకు ముందస్తు ప్రణాళికలు రూపొందించి అందించినట్లయితే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు చేయడానికి కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. జిల్లాలో ఇప్పటికీ 63 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు. హంద్రీ నీవా ద్వారా 27 టీఎంసీలు, హెచ్చెల్సీ ద్వారా 18, వర్షం ద్వారా మరో 18 టీ ఎంసీల నీరు నిల్వ ఉందన్నారు. దీంతో జిల్లాలోని 349 చెరువుల్లో సమృద్ధిగా నీరు ఉందన్నారు, వీటి ద్వారా భూగర్భ జలాలు పెరిగాయన్నారు. జిల్లాలో వివిధ ప్రాజెక్టు పనులను రూ.500 కోట్లతో చేపడుతున్నామన్నారు. త్వరలో తన పర్యటన మడకశిరలో ఉంటుందని, మడకశిర ప్రాంతంలో ఎక్కడా తాగునీటి సమస్య రాకుండా చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖ అధికారులను మంత్రి దేవినేని ఆదేశించారు. మంత్రి కాలవ శ్రీనివాసులు మాట్లాడుతూ రాయదుర్గం ప్రాంతం నిరుపయోగమైన ప్రాంతమని, అయితే ముఖ్యమంత్రి హామీ మేరకు తుంగభద్ర నీటి ద్వారా, ప్రకృతి వర్షం ద్వారా నీటిని వినియోగించుకుని రైతులు వరి పంటలు పండించుకుంటున్నారన్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ త్వరలో పోలవరం సందర్శించడానికి మండల స్థాయిలో బృందాలు ఏర్పాటు చేసి కార్యక్రమాలు చేపడుతామన్నారు. అలాగే జిల్లాలో 84వేల ఫారంపాండ్లు పూర్తి చేశామన్నారు. జల వనరుల శాఖ ఆధ్వర్యంలో జల సంరక్షణకు జ్లిలో చెరువుల పునరుద్ధరణ, 1826 ఇంకుడు గుంతలు, 133 రాక్‌ఫిల్ డ్యామ్‌లు, 1,938 ట్యాంక్ ఫీడర్లు, చానెళ్లు 1145, నీటి ఎద్దటి నివారణకు మార్చి 31 నాటికి బకాయి ఉన్న రూ.8 కోట్లు విడుదల చేశామని చెప్పారు. ఇంకా తాగునీటి సమస్య నివారణకు అవసరమైన నిధుల కోసం మంత్రి దేవినేనికి నివేదిక అందిస్తానని చెప్పారు.