అనంతపురం

ఎస్కేయూ ఇన్‌చార్జి వీసీగా శుభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం కల్చరల్, ఏప్రిల్ 25: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ఇన్‌చార్జి వీసీగా ప్రొఫెసర్ ఎంసీఎస్.శుభను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం రెక్టార్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న శుభను వీసీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో నేడు బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలిపారు.
పలువురికి డీఎస్పీ కౌనె్సలింగ్
హిందూపురం రూరల్, ఏప్రిల్ 25 : హిందూపురం రూరల్, పట్టణ పరిధిలో హత్య కేసుల్లో నిందితులుగా కొనసాగుతున్న పలువురికి పెనుకొండ డీఎస్పీ కరీముల్లా షరీఫ్ ఆధ్వర్యంలో కౌనె్సలింగ్ ఇచ్చారు. ప్రస్తుతం నేరస్తుల జీవన విధానం, నడవడిక తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్తులో ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడకుండా మంచి ప్రవర్తనతో మెలగాలని సూచించారు. వివిధ కారణాల వల్ల నేరస్తులుగా మారాయని, ఇకపై ఇలాంటి వాటి జోలికి వెళ్లకుండా ప్రశాంత జీవనం సాగించాలన్నారు.
బీకే ఇంట పెళ్లి సందడి
* హాజరైన ఉప ముఖ్యమంత్రులు, మంత్రులు
అనంతపురం కల్చరల్, ఏప్రిల్ 25: తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు, పెనుకొండ ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు సభ్యులు బీకే.పార్థసారథి కూతురు వివాహ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బళ్లారి రోడ్డులో గల ఎంవైఆర్ ఫంక్షన్ హాలులో బుధవారం జరిగిన వివాహ వేడుకలకు ఫంక్షన్ హాలును అత్యంత సుందరంగా అలంకరించారు. భారీ ఏర్పాట్లు చేశారు. రంగరంగ వైభవంగా జరిగిన వివాహంతో ఒక్కటైన వధూవరులు సంధ్య, ఈరప్పను పలువురు ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు హాజరై ఆశీర్వదించారు. ఈ వేడుకలకు ఉప ముఖ్యమంత్రులు కేఈ.కృష్ణమూర్తి, నిమ్మకాయల చినరాజప్ప, మంత్రులు గంటా శ్రీనివాసరావు, దేవినేని ఉమామహేశ్వరరావు, పత్తిపాటి పుల్లారావు, జవహర్, కాలవ శ్రీనివాసులు, పరిటాల సునీత, చీఫ్ విప్ పల్లె రఘునాథరెడ్డి, ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శమంతకమణి, తిప్పేస్వామి, జడ్పీ చైర్మన్ పూల నాగరాజు, నగర మేయర్ స్వరూప, ఎమ్మెల్యే ప్రభాకర చౌదరి, వరదాపురం సూరి, జేసీ.ప్రభాకర్‌రెడ్డి, ఈరన్న, పీసీసీ అధ్యక్షులు రఘువీరారెడ్డి, శివరామిరెడ్డి, కలెక్టర్ వీరపాండ్యన్, పలువురు అధికారులు, ప్రజా ప్రతినిధులు, అభిమానులు, బంధువులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.