అనంతపురం

కొలిక్కి రాని సీఎఫ్‌ఎంఎస్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందూపురం టౌన్, ఏప్రిల్ 25 : ఖజానా శాఖలో అక్రమాలను అడ్డుకోవడానికి పారదర్శకతను పెంచడానికి అంటూ రాష్ట్ర ప్రభుత్వం చెల్లింపుల కోసం తీసుకొచ్చిన సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్‌ఎంఎస్) రెండు నెలలు గడిచినా ఓ కొలిక్కి రావడం లేదు. ప్రభుత్వం ఇదో గొప్ప మార్పు అని ప్రచారం చేస్తున్నా క్షేత్రస్థాయిలో ఉద్యోగులు ఊసూరుమంటున్నారు. రెండు నెలల వేతనాలు నిలిచిపోయినట్లయింది. దీనికి తోడు అన్ని బిల్లులు రెండు నెలలుగా చెల్లింపులు లేక మురిగిపోతున్నాయి. దీంతో గుత్తేదారులు సైతం లబోదిబోమంటున్నారు. మార్చి నెలలో ఖజానా శాఖలో సీఎఫ్‌ఎంఎస్ విధానాన్ని తీసుకొచ్చారు. ఈ విధానంలో ఆన్‌లైన్‌లో ఉద్యోగుల వేతనాలతో సహా ప్రతి బిల్లును తయారుచేసి సంబంధిత అధికారి సంబంధిత డీడీఓలు బయోమెట్రిక్ విధానంలో వేలిముద్ర వేయాల్సి ఉంటుంది. అయితే నెల రోజులు గడిచిపోయినా ఇప్పటికీ బిల్లుల తయారీ పూర్తి కావడం లేదు. రోజురోజుకు సాంకేతిక సమస్యలు పుట్టుకొస్తున్నాయి. దీనికి తోడు సీఎఫ్‌ఎంఎస్ విధానంపై కింది స్థాయి సిబ్బందికి, అధికారులకు పూర్తిస్థాయిలో శిక్షణ ఇవ్వలేదు. ఉద్యోగులు సాంకేతికంగా నూతన విధానాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. వీటన్నింటి కారణంగా బిల్లుల తయారీ పూర్తిగా నిలిచిపోయింది. మున్సిపాలిటీతోపాటు వివిధ శాఖల ఉద్యోగులకు మార్చి నెల వేతనాలు నేటికీ అందలేదు. మరో వారం రోజుల్లో ఏప్రిల్ నెల సైతం ముగియనుంది. ఈ నెలకు సంబంధించి బిల్లులను ఇప్పటికే తయారు చేసి ఆన్‌లైన్‌లో పెట్టాల్సి ఉంది. మార్చి నెలకే గతి లేదని, ఏప్రిల్ నెల బిల్లులు ఎక్కడని వివిధ శాఖల ఉద్యోగులు, సిబ్బంది వాపోతున్నారు. ఒక్క హిందూపురం మున్సిపాలిటీలోనే 450 మంది రెగ్యులర్ ఉద్యోగులు, 350 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరికి నెలకు దాదాపు రూ.2 కోట్లు వేతనాలు అందాల్సి ఉంది. ఇప్పటి దాకా మార్చి నెల వేతనం అందకపోవడంతో లబోదిబోమంటున్నారు. మున్సిపల్ ఉపాధ్యాయులయితే ఏకంగా కార్యాలయం వద్ద ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టి మున్సిపల్ కమిషనర్ చాంబర్‌ను ముట్టడించారు. నూతన విధానంలో బిల్లుల తయారీకి సంబంధిత శాఖల డీడీఓలు కిందామీదా పడుతున్నారు. అయితే సాంకేతిక సమస్యలను అర్థం చేసుకోలేక అమరావతిలోని నిఫుణులను ఫోన్ ద్వారా సంప్రదిస్తున్నారు. అయితే నేటికీ సమస్యలు కొలిక్కి రాలేదు. మున్సిపాలిటీలో బిల్లులను ఆన్‌లైన్ పద్ధతిలో సిద్ధం చేసి అప్‌లోడ్ చేసినా మున్సిపల్ కమిషనర్ బయోమెట్రిక్ వేలిముద్ర పడటం లేదు. బిల్లుల చెల్లింపును వేగవంతం చేయడానికి సెలవు రోజుల్లో కూడా మున్సిపల్ కమిషనర్, సిబ్బంది పనిచేసినా సాంకేతిక కారణాలతో ప్రయోజనం లేకుండాపోయింది. తమ చేతుల్లో లేని వ్యవస్థ ద్వారా ఇబ్బందులు పడుతుంటే కింది స్థాయి ఉద్యోగులు అర్థం చేసుకోవడం లేదని ఉన్నతాధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హిందూపురం ఉప ఖజానా కార్యాలయ పరిధిలో వివిధ శాఖలకు సంబంధించి 600 మందికి పైబడి రెగ్యులర్ ఉద్యోగులకే వేతనాలు చెల్లింపు జరగలేదు. అన్ని శాఖల్లోనూ ఔట్ సోర్సింగ్ సిబ్బందికి వేతనాలు నిలిచిపోయాయి. సీఎఫ్‌ఎంఎస్ విధానం ఓ కొలిక్కి వస్తేనే బిల్లుల చెల్లింపు జరుగుతుందని ఖజానా శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఉద్యోగుల వేతనాల పరిస్థితి ఈ విధంగా ఉంటే గుత్తేదారుల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఫిబ్రవరి, మార్చి మాసాల్లో ఖజానాలో ఆంక్షలు ఉండటంతో వారి బిల్లులు చెల్లింపు జరగలేదు. ఏప్రిల్ అయినా వస్తాయనుకొంటే ఆ పరిస్థితి కనిపించడం లేదు. హిందూపురం మున్సిపాలిటీలో అయితే కోట్లాది రూపాయల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. చివరకు విద్యుత్, ఫోన్, డీజల్ బిల్లుల చెల్లింపు నిలిచిపోయాయి. రోజువారీ ఖర్చులకు సైతం చెల్లింపులు జరగడం లేదు. హిందూపురం పట్టణానికి నీటిని తీసుకొచ్చే రూ.194 కోట్ల పథకం పనులు ఓ వైపు శరవేగంగా సాగుతుండగా వీటికి సంబంధించిన రూ.10 కోట్ల చెక్కు నేటికీ చెల్లింపు కాలేదు. అమృత్, 14వ ఆర్థిక సంఘం, ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిధులు, సాధారణ నిధులు ఇలా వివిధ పథకాల కింద చేపట్టిన పనులు ఫిబ్రవరి నాటికే పూర్తయినా నేటికీ గుత్తేదారులకు ఒక్క రూపాయి జమ కావడం లేదు. మున్సిపాలిటీ ఇచ్చిన చెక్కులు సైతం చెల్లకపోవడంతో కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. ప్రజాప్రతినిధుల ద్వారా అధికారులపై ఒత్తిళ్లు తీసుకువస్తున్నారు. మరో వైపు అధికారులు అదిగో, ఇదిగో అంటూ నెల రోజులు గడిపేశారు. సాంకేతిక సమస్యలు కొలిక్కి వస్తే తప్ప వేతనాలు, బిల్లుల చెల్లింపు జరిగే అవకాశం కనిపించడం లేదు.
జల సంరక్షణకు కృషి
* గుంతకల్లు వద్ద రిజర్వాయర్ * వారంలో బీటీపీ, పేరూరుకు టెండర్లు
* త్వరలో హంద్రీనీవా వెడల్పు పనులు పూర్తి * జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు

అనంతపురం, ఏప్రిల్ 25 : రాష్ట్రంలో జల సంరక్షణకు ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని, ఇందులో భాగంగానే గడిచిన మూడేళ్లలో రూ.11,110 కోట్లు ఖర్చు చేసినట్లు జిల్లా ఇన్‌చార్జి, జల వనరుల శాఖ దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. బుధవారం నగరంలో విలేఖరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ జిల్లాలో సాగు, తాగునీటికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. నీటి ఎద్దడి నివారణకు, వరద నీటిని వినియోగించుకోవడానికి వీలుగా నాటి చీఫ్ ఇంజినీర్ కృష్ణయ్య ఆకాంక్ష మేరకు ఆయన సూచించిన ప్రాంతంలో గుంతకల్లు వద్ద రిజర్వాయర్ ఏర్పాటు చేస్తామన్నారు. ఇందుకోసం డీపీఆర్ తయారు చేయడానికి రూ.8.21 కోట్లు మంజూరుకు ముఖ్యమంత్రి అంగీకారం తెలిపారన్నారు. ఇక పీఏబీఆర్ ఆధునీకరణ పనులు పూర్తి చేసి నీటిని తరలిస్తే 11 టీఎంసీలు నిల్వ చేయవచ్చన్నారు. పీఏబీఆర్‌లో నుంచి క్లియరెన్స్ కోసం రూ.164 కోట్లు ఇవ్వడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అంగీకరించారన్నారు. అలాగే భైరవానితిప్ప, పేరూరు ప్రాజెక్టులకు టెండర్ల ప్రక్రియ కొనసాగుతోందని, ఈవారంలో పూర్తవుతాయన్నారు. 2019 సంక్రాంతి పర్వదినం లక్ష్యంగా పెట్టుకుని ఈ ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు. మే 14వ తేదీ నాటికి గొల్లపల్లి నుంచి మడకశిర, హిందూపురం చెరువులకు నీరందిస్తామని, అదేనెల మూడోవారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా నీటిని విడుదల చేస్తామన్నారు. అలాగే మారాల రిజర్వాయర్, అడవిపల్లి, చెర్లోపల్లికి కూడా త్వరితగతిన పనులు పూర్తి చేసి అడ్డంకులు తొలగించి నీటిని కాలువల్లో పారిస్తామన్నారు. హంద్రీనీవా వెడల్పు పనులు ఇప్పటికే 55 శాతం వరకు పూర్తి అయ్యాయన్నారు. జూన్, జూలై నాటికి ముచ్చుమర్రి నుంచి కర్నూలు జిల్లా మల్యాలకు నీటిని తెచ్చుకోవాల్సి ఉందని, ఆ లోపు కాలువ వెడల్పు పనులు పూర్తి చేస్తామన్నారు. ముఖ్యంగా మడకశిర, హిందూపురం, మారాలకు ఈ సీజన్‌లోనే కాలువల్లో నీటిని పారిస్తామన్నారు. వచ్చే 10 రోజుల్లో తాను జిల్లాకు వస్తానని, మడకశిరలో పర్యటిస్తానని, పనులు వేగవంతం చేయకుంటే చర్యలు తప్పవని కాంట్రాక్టర్లకు మంత్రి దేవినేని హెచ్చరించారు. హంద్రీనీవా ద్వారా నీరందించడంతో జిల్లాలో 18 మీటర్లకు పైగా భూగర్భ జలాలు పెరిగాయన్నారు. ముఖ్యంగా బుక్కపట్నం చెరువుకు నీరందించడంతో ఆ ప్రాంతంలోని బోర్లలో భూగర్భ జలాలు సుమారు 60 మీటర్లు పెరిగిందన్నారు. రాయలసీమలో ముఖ్యంగా అనంతపురం జిల్లాలో నీటిని సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఉద్యాన పంటలు బ్రహ్మాండంగా పండుతూ హార్టికల్చర్ హబ్‌గా జిల్లా తయారవుతోందన్నారు. పులివెందుల నియోజకవర్గం లింగాల రాష్ట్రంలోనే అత్యధికంగా ఆదాయం పొందుతున్న మండలంగా పొందుతోందన్నారు. ఇదంతా నీరు-చెట్టు వల్లే సాధ్యమైందన్నారు. జిల్లాలో సాగునీటి పనులు వేగవంతం చేయాలని, అదే విధంగా నీటి ఎద్దడి నివారణకు నిధులు మంజూరుకు సంబంధిత శాఖాధికారులకు ఆదేశాలిచ్చామని మంత్రి దేవినేని తెలిపారు. చెరువుల్లో పూడికతీత పనులు వేగవంతం చేయాలన్నారు. మంత్రి కాలవ శ్రీనివాసులు మాట్లాడుతూ జిల్లాలో అనేక చెరువుల్లో నీరు నిల్వ ఉండటం వల్ల ధర్మవరం నియోజకవర్గం, అనంతపురం జిల్లారూపు రేఖలు మారుతాయన్నారు. జిల్లాలో దక్షిణ మండలాల్లో తాగునీటి సమస్య నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు.