అనంతపురం

సామాజిక చైతన్యం పెంపొందించే రచనలు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం కల్చరల్, మే 20: సామాజిక చైతన్యాన్ని పెంపొందించే రచనలు చేయాలని, ఆదిశగా యువకవులు ముందుకు రావాలని జడ్పీ చైర్మన్ పూలనాగరాజు పేర్కొన్నారు. జడ్పీహాలులో జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన జాతీయ యువకవి సమ్మేళనంలో జడ్పీ చైర్మన్ పూల నాగరాజు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. జిల్లాపరిషత్, జనే్న వైష్ణవి భాషా సాహిత్య వేదిక, తెలుగు భాషా వికాస ఉద్యమం సహకారంతో జరిగిన కార్యక్రమానికి వివిధ రాష్ట్రాలు, జిల్లాల నుండి సాహితీవేత్తలు, కవులు, రచయితలు హాజరయ్యారు. కేంద్ర సాహిత్య అకాడమి యువ పురస్కార గ్రహీతలు డా.వేంపల్లి గంగాధర్, వేంపల్లి షరీఫ్, అప్పిరెడ్డి హరినాథ్‌రెడ్డి, పింగలి చైతన్య, మెర్సీ మార్గరెట్‌లు హాజరయ్యారు. ఈసందర్భంగా జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ సమాజంలో మార్పుకోసం యువకవులు రచనలు సాగించాలని, దురాచారాలు, మూఢాచారాలను ఖండించడంతో పాటు సమాజంలో నేడు జరుగుతున్న అకృత్యాలు, బాలికలపై, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను రూపుమాపి, నైతిక విలువలను పెంపొందించేందుకు కృషి చేయాలన్నారు. ఈకార్యక్రమంలో అనేక మంది కవులు తమ కవితలను చదివి వినిపించారు. పలువురి కవితలు ఆహుతులను అలరించగా, పలువురి కవితలు ఆలోచనను రేకెత్తించేవిధంగా ఉన్నాయి. ఈసందర్భంగా పలువురు కవులను సత్కరించి, ప్రశంసాపత్రం, మొమెంటో అందచేశారు. జిరసం జిల్లా అధ్యక్షులు జి.బాలసుబ్రమణ్యం అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి జెనే్న ఆనంద్‌కుమార్, ఉపాధ్యక్షులు జగర్లమూడి శ్యామసుందశాస్ర్తీ, సింగమనేని నారాయణ, ఆచార్య దేవకి, రాజారామ్, కొత్తపల్లి సురేష్, గసల నారాయణస్వామి, గుత్తాహరి, ఆశావాది ప్రసన్నరామ, మధురశ్రీ, ఆకుల రఘురామయ్య, వెంకటరమణ, రియాజుద్దీన్, జూటూరి షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.