అనంతపురం

గాలీవాన బీభత్సం అపార నష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాండ్లపెంట, మే 20: అకాల వర్షం కారణంగా అపార నష్టం వాటిల్లింది. శనివారం రాత్రి కురిసిన వర్ష బీభత్సం, ఈదురు గాలుల కారణంగా మండలవ్యాప్తంగా పలుచోట్ల ఇళ్లపై చెట్లు కూలడం, అదేవిధంగా రేకుల షెడ్డులు గాలికి ఎగిరిపోయాయి. మండలకేంద్రంలో మహబూబ్‌బీ మిషన్ పైకప్పు ఎగిరిపోయి పక్కనున్న నర్సరీలపై పడిపోవడంతో నర్సిరీలో భారీ నష్టం వాటిల్లిందని, వీటిపై ఆధారపడి జీవిస్తున్నామని, దీంతో లక్ష రూపాయలు నష్టం వాటిల్లిందని నర్సరీ యజమాని ఆంజినేయులు వాపోయారు. అదేవిధంగా రైతు రవి వ్యవసాయ బోర్ల వద్ద నిర్మించుకున్న రేకు షెడ్డు కూలిపోయింది. మండలవ్యాప్తంగా గాలీవాన బీభత్సంతో పలుచోట్ల మామిడి కాయలు కుప్పలు కుప్పలుగా నేలరాలి రైతులు తీవ్రంగా నష్టపోయామని రైతులు హైదర్‌వలీ, ఓబుళరెడ్డి, చంద్ర తదితరులు వాపోయారు. అదేవిధంగా గాలివానల కారణంగా విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. దీంతో మండల వ్యాప్తంగా వున్న అన్ని గ్రామాలు అంధకారమైంది. అపరామైన నష్టాన్ని అంచనా వేసి మామిడి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
ఘనంగా టంగుటూరి వర్ధంతి
కదిరి టౌన్, మే 20: స్వాతంత్య్ర సమరయోధుడు టంగుటూరి ప్రకాశం పంతులు 61వ వర్ధంతి సందర్భంగా ఆదివారం టవర్ క్లాక్ వద్ద ఆయన చిత్ర పటానికి జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. నియోజకవర్గ జనసేన అధ్యక్షులు భైరవప్రసాద్ మాట్లాడుతూ ఆంధ్ర, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి అయిన టంగుటూరి ప్రకాశం పంతులు విద్యార్థి దశలోనే దేశం కోసం అనేక పోరాటాలు నిర్వహించారని, తెలుగువారి గుండె ధైర్యాన్ని, ఆత్మ గౌరవాన్ని దేశానికి చాటి చెప్పారని, అంతేకాకుండా ఉద్యమాలు, సత్యాగ్రహాలు నిర్వహించారన్నారు. తొలి ముఖ్యమంత్రిగా 14 సాగునీటి ప్రాజెక్టులు కేంద్ర ప్రభుత్వం సహకారంతో పూర్తి చేశారని, మద్యపాన నిషేదం, దళితులను ఆలయాల్లో ప్రవేశం తదితర అభివృద్ధి కార్యక్రమాలు చేశారని కొనియాడారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మొదలుపెట్టిన ప్రజా పోరాట యాత్ర దిగ్విజయంగా పోరాడాలని శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. జనసేన పార్టీ నాయకులు చంద్రమోహన్, మహేష్, మను, విజయ్, నిరంజన్, లోకేష్, మనోహర్, ప్రేమ్‌కుమార్, రవీంద్ర, నాగార్జున పాల్గొన్నారు.