అనంతపురం

చంద్రబాబుతోనే రాష్ట్ర అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గార్లదినె్న, మే 20: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని స్ర్తిశిశుసంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని అమృతాస్కూల్ ప్రాంగణంలో స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌యామినీ బాల ఆధ్వర్యంలో మినీ మహానాడు నిర్వహించారు. మంత్రి సునీతాతోపాటు రాష్ట్ర పరిశీలకులు కెఇ ప్రభాకర్, నియోజకవర్గం పరిశీలకులు ముక్తీయార్, ఎమ్మెల్సీ శమంతకమణి, టిడీపి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆలం నరసానాయుడు, జడ్పీ చైర్మన్ పూలనాగరాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సునితా మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరిగి ప్రభుత్వం లోటు బడ్జెట్‌లో ఉన్నప్పటికి ఇచ్చిన హామీల మేరకు రైతులకు 1.50 లక్షల రుణమాఫీ చేశామన్నారు. అదేవిధంగా డ్వాక్రా మహిళలకు రూ. 10వేలను పసుపు, కుంకుమ కింద పంపిణీ చేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 90 లక్షల మందికి రేషన్‌కార్డులు, పెన్షన్లు పార్టీలకు అతీతంగా పంపిణీ చేసిన ఘనత చంద్రబాబుదేనన్నారు. ఇప్పటి వరకు అర్హులుగా ఉండి పెన్షన్ రానివారికి జూన్ 2న 3.42 లక్షల పెన్షన్లు ప్రభుత్వం మంజూరు చేసేందుకు సిద్దంగా ఉందన్నారు. ముఖ్యంగా జిల్లాలోని అన్ని చెరువులకు సాగునీటిని నింపడం జరిగిందన్నారు. అనంతపురం జిల్లా టీడీపీకి కంచుకోటగా ఉంది. టీడీపీ నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అఖండ విజయంతో గెలిపించాలన్నారు. అదేవిధంగా ఎమ్మెల్సీ శమంతకమణి మాట్లాడుతూ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ప్రతి పేదవానికి చేరాలంటే టీడీపీ ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు. సీఎం చంద్రబాబు మేనిపెస్టోలోలేని సంక్షేమ పథకాలైన చంద్రన్న భీమా, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల ద్వారా దళిత కాలనీల్లో అభివృద్ది చేయడంతోపాటు మహిళలకు వెలుగు పథకం ద్వారా పావులా వడ్డీకే రుణాలు అందజేస్తుందన్నారు. నియోజకవర్గంలోని పెండింగ్‌లోనున్న కోటంక, మర్తాడు, సిద్దరాపురం చెరువులకు ఎత్తిపోతల పథకం ద్వారా హంద్రీనీవా నీటిని తరలించేందుకు ప్రతిపాదనలు పంపామన్నారు. ఎమ్మెల్యే యామీనీబాల మాట్లాడుతూ నియోజవర్గానికి తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారం కోసం త్వరలో పనులను ప్రారంభిస్తామన్నారు. నియోజకవర్గంలోని చెరువులకు సాగునీరు ఇచ్చిన ఘనత చంద్రబాబుదేనన్నారు. నార్పల మండలం నడిమిదొడ్డి వద్ద రిజర్వాయర్ నిర్మించడానికి ప్రభుత్వానికి నివేదికలు పంపామన్నారు. అదేవిధంగా మున్ముందు మరిన్ని సంక్షేమ పథకాలు అమలు కావాలంటే చంద్రబాబు మరోక్కసారి సిఎంను చేయాల్సి బాధ్యత మనందరిపై ఉందన్నారు. 2019 ప్రతి నాయకుడు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా టీడీపి నాయకులు ముంటిమడుగు కేశవరెడ్డి, శ్రీనివాసరెడ్డి, మండల టీడీపి నాయకులు గేట్ కృష్ణరెడ్డి, గార్లదినె్న, శింగనమల, నార్పల, బుక్కరాయసముద్రం, ఎల్లనూరు, పుట్లూరు మండలాల కన్వీనర్లు, ఎంపిటిసిలు, జెడ్పిటిసిలు, సర్పంచ్‌లు, కార్యకర్తలు, జన్మభూమి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.