అనంతపురం

బడి, గుడి స్థలాల కబ్జారాయుళ్ల విమర్శించేది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కదిరి, మే 21: మున్సిపాల్టీలో రిజర్వ్ స్థలాలుగా కేటాయించిన బడి, గుడి స్థలాలను కబ్జాచేసి, అమ్ముకుని అదే స్థలంలో ఇళ్లు నిర్మించిన వారిని పక్కన కూర్చోబెట్టుకుని టీడీపీ నాయకులపై విమర్శలు చేసే అర్హత వైసీపీ నాయకులకు లేదని కదిరి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి కందికుంట వెంకటప్రసాద్ విమర్శించారు. సోమవారం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీడీపీ నాయకులు 150 ఎకరాల వరకు ప్రభుత్వ స్థలాలను కబ్జా చేశారని వైకాపా సమన్వయకర్త డా.పీవీ సిద్దారెడ్డి విమర్శించారని, మారుతి నగర్‌లో బడి, గుడికి కేటాయించిన రిజర్వ్ స్థలాన్ని అమ్ముకోవడంతో పాటు అదే స్థలంలో ఇళ్లు నిర్మించుకున్న ఘనత వైసీపీ నాయకులదేనన్నారు. కబ్జా చేసి నిర్మించిన ఇంటిని తొలగించాలని కోర్టుకు కూడా వెళ్లారని, త్వరలో కబ్జా చేసిన ఇంటిని అధికారులే కూల్చి వేస్తారన్నారు. అప్పట్లో రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ స్థలం కబ్జాకు గురైన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వ స్థలాలను టీడీపీ నాయకులు కబ్జా చేయాలని చూసివుంటే హిందూపురం రోడ్డులో ఆర్డీఓ కార్యాలయం, డీఎస్పీ కార్యాలయం, బంజారాలకు, గాండ్ల సంక్షేమ సంఘం కమ్యూనిటీ భవనానికి స్థలం ఇచ్చేవారం కాదన్నారు. సీపీఎం కాలనీకి కూడా టీడీపీ హయాంలోనే పట్టాలు వచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మున్సిపల్ స్థలాలను అమ్ముకున్నవారిని పక్కన కూర్చోబెట్టుకుని టీడీపీ నాయకులు కబ్జాలకు పాల్పడుతున్నారని విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు.
చలో విజయవాడ పోస్టర్ల విడుదల
గాండ్లపెంట, మే 21: చలో విజయవాడ పోస్టర్లను ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు సోమవారం పోస్టర్లు విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి బడా సుబ్బిరెడ్డి మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం దేశ ప్రజలకు ఎన్నో వాగ్దానాలు చేసి గద్దెనెక్కిందని, అయితే దేశంలోని ప్రజలకు నిరుద్యోగ సమస్య రూపుమాపుతామని చెప్పి తప్పించుకుందన్నారు. రోజురోజుకూ దళితులు, మైనార్టీలపై దాడులు జరుగుతున్నాయని, మహిళలపై అత్యాచారాలు ఎక్కువయ్యాయన్నారు. అలాగే ఉపాధిహామీలో 250 రోజులు పని కల్పించి కనీస వేతనం రూ. 500లు ఇవ్వాలని, నిరుద్యోగభృతి కల్పించాలని, సాగులో వున్న వారికి భూమి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇలాంటి డిమాండ్లపై ఈనెల 23న చలో విజయవాడ కార్యక్రమం తలపెట్టినట్లు పేర్కొన్నారు. అక్కడ బహిరంగ సభ నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. మండల నాయకులు రాజారెడ్డి, ఖాదర్‌బాషా, గంగన్న పలువురు పాల్గొన్నారు.