అనంతపురం

బీజేపీ చేతిలో జగన్, పవన్ కీలుబొమ్మలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెనుకొండ, మే 21: కేంద్ర ప్రభుత్వం బీజేపీ చేతిలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌లు కీలుబొమ్మలుగా మారారని రాష్ట్ర మంత్రులు దేవినేని ఉమామహేశ్వర్‌రావు, కాలవ శ్రీనివాస్, పరిటాల సునీత విమర్శించారు. సోమవారం రొద్దం మండలం తురకలాపట్నంలో జరిగిన నీరు-ప్రగతి బహిరంగ సభలో మంత్రి దేవినేని మాట్లాడుతూ, ప్రతిపక్షనేతగా ఉన్న జగన్మోహన్‌రెడ్డి శాసనసభకు రాకుండా ముఖ్యమంత్రి కావాలని కోరుకోవడం దారుణమన్నారు. అవినీతి కేసుల్లో 16 నెలలు జైలులో ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రికి అర్హుడా అంటూ ప్రశ్నించారు. జగన్ కేసుల నుండి తప్పించుకునేందుకు బీజేపీతో కుమ్మక్కై కర్నాటక ఎన్నికల్లో ప్రచారం చేశారన్నారు. అదే విధంగా రాష్టప్రతి ఎన్నికల్లో మద్దతు ఇవ్వడం జరిగిందన్నారు. గోదావరి నదిలో పడవ మునిగి అనేక మంది మృతి చెందితే ఓదార్చేందుకు కూడా రాని ఆయన ముఖ్యమంత్రి ఎలా అవుతారని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ మెడలు వంచి ప్రత్యేక హోదా సాధించి తీరుతామన్నారు. సర్పంచ్ కూడా కాని పవన్‌కల్యాణ్ ముఖ్యమంత్రి ఎలా అవుతారని ఎద్దేవా చేశారు. మంత్రి పరిటాల సునీత మాట్లాడుతూ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి ప్రజల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. మహిళల సంక్షేమం కోసం చంద్రన్న బీమా, చంద్రన్న పెళ్ళికానుక, తల్లీ,బిడ్డ ఎక్స్‌ప్రెస్ వంటి పథకాలు ప్రవేశపెట్టారన్నారు. మంత్రి కాలవ శ్రీనివాస్ మాట్లాడుతూ, జగన్ రాష్ట్భ్రావృద్ధిని అడ్డుకుంటున్నారని విమర్శించారు. ఆయన కేసుల నుండి బయటపడేందుకు బీజేపీతో కుమ్మక్కైనట్లు పేర్కొన్నారు. ప్రత్యేక హోదా కోసం జగన్ చిత్తశుద్ధితో పోరాటం చేయడం లేదన్నారు. టీడీపీ ఎంపీలు ప్రధాని ఇంటి ముందు దీక్ష చేయడం టీడీపీకి ప్రత్యేక హోదాపై ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. కర్నాటక ఎన్నికల్లో తెలుగోడి పౌరుషం ఎమిటో నిరూపించారన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో దొంగల పార్టీలను ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.