అనంతపురం

ప్రజల ఆనందాన్ని చూడటమే ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెనుకొండ, మే 21: అనంతపురం జిల్లా ప్రజల్లో ఆనందాన్ని చూడటమే తన ధ్యేయమని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. సోమవారం పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండల పరిధిలోని తురకలాపట్నం బహిరంగ సభలో ప్రసంగించారు. ప్రపంచంలోనే అతి తక్కువ వర్షపాతం కలిగిన జిల్లాల్లో ఒకటైన అనంతపురం జిల్లాను అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. గత నాలుగేళ్ళ క్రితమే జిల్లాలో కరవు పారదోలేందుకు కంకణం కట్టుకున్నట్లు తెలిపారు. దశల వారీగా ప్రణాళికలు రూపొందిస్తూ అహర్నిశలూ శ్రమించి విజయం సాధించినట్లు తెలిపారు. కరవు ప్రాంతంలో భూగర్భజలాలు పెంపొందించేందుకు పంట సంజీవని కింద 7.50 లక్షల నీటి కుంటలు తవ్వడం, చెక్‌డ్యాంల నిర్మాణం, చెరువుల్లో పూడికతీత, వంకల పునరుద్ధరణ వంటి పనులు పెద్దఎత్తున చేపట్టడం జరిగిందన్నారు. దీని వల్ల భూగర్భజలాలు 6.73 మీటర్లకు పెరిగాయన్నారు. తెలుగుదేశం పార్టీకి అనంత జిల్లా వాసులు కంచుకోటగా నిలుస్తూ వస్తున్నారని, గత అసెంబ్లీ ఎన్నికల్లో 12 స్థానాల్లో ఘన విజయాన్ని చేకూర్చారని, మీరు నాపై ఉంచిన అభిమానానికి రుణం తీర్చుకునేందుకు నిరంతరం కృషి చేస్తానని సీఎం పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో జిల్లాలో అన్ని స్థానాల్లో గెలిపిస్తారన్న ఆశాభావాన్ని చంద్రబాబు వ్యక్తం చేశారు. జిల్లాను సస్యశ్యామలం చేసి ప్రతి చెరువుకు నీరు అందించేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు అన్ని చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోనే అనంతపురం జిల్లాను ఆదర్శంగా నిలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. జిల్లాలో ఇప్పటికే నీటి ప్రాజెక్టుల కోసం రూ.5,250 కోట్లు ఖర్చు చేశామన్నారు. మరో రూ.4500 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. అదే విధంగా మడకశిర బ్రాంచీ కెనాల్‌కు రూ.420 కోట్లు వ్యయం చేయనున్నట్లు తెలిపారు. జిల్లాలో వ్యవసాయాభివృద్ధి చేపట్టేందుకు బిందు, తుంపర సేద్యం ద్వారా పెద్ద ఎత్తున రైతులకు సబ్సిడీతో పరికరాలు అందిస్తున్నామన్నారు. రైతుల ఆదాయం పెంచేందుకు నీరు-ప్రగతి వంటి పథకాన్ని తీసుకువచ్చినట్లు తెలిపారు. జిల్లాకు గోదావరి జలాలను తీసుకువచ్చేందుకు పట్టిసీమను పూర్తి చేసినట్లు చెప్పారు. హంద్రీనీవాను పూర్తి చేయడం వల్ల రాయలసీమకు 140 టీఎంసీల నీరు వచ్చినట్లు సీఎం తెలిపారు. జిల్లాకు హంద్రీనీవా ద్వారా 26 టీఎంసీల నీరు వచ్చాయని, దీని వల్ల కాలువలు, చెరువుల్లో నీరు ప్రవహిస్తుండటంతో వ్యవసాయ బోర్లలో భూగర్భజలాలు పెరుగుతున్నట్లు తెలిపారు. గత నాలుగేళ్ళలో 5 లక్షల ఎకరాల్లో డ్రిప్ ఇరిగేషన్‌ను అభివృద్ధి చేసినట్లు చెప్పారు. మరో రెండేళ్ళలో మరో 5 లక్షల ఎకరాల్లో అభివృద్ధి చేయనున్నామన్నారు. బైరవానితిప్ప, పేరూరు ప్రాజెక్టుల పనులకు త్వరలోనే టెండర్లు పిలవనున్నామన్నారు. జిల్లాలో పెద్దఎత్తున విండ్, సోలార్ ఎనర్జీ ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిపారు. దీని వల్ల రైతులకు 7 గంటల పాటు ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో లేపాక్షి నాలెడ్జ్, సైన్స్ సిటీల పేరిట కాంగ్రెస్ పాలనలో పెద్దఎత్తున కుంభకోణాలు జరిగినట్లు విమర్శించారు. రూ.13 వేల కోట్లతో కియా కార్ల పరిశ్రమ, మరో రూ.4,500 కోట్లతో కియా అనుబంధ సంస్థలు రానున్నట్లు తెలిపారు. దీని వల్ల పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు.