అనంతపురం

అక్కడ అత్తార్... ఇక్కడ కందికుంట..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కదిరి, మే 22 : ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాషా, నియోజకవర్గ ఇన్‌చార్జి కందికుంట వెంకటప్రసాద్ మంగళవారం నియోజకవర్గంలో వేర్వేరుగా మినీ మహానాడు కార్యక్రమాలు నిర్వహించారు. ఎమ్మెల్యే తన రెసిడెన్సీలో, కందికుంట ప్రభుత్వ షాదీమహాల్‌లో నిర్వహించారు. అత్తార్ రెసిడెన్సీలో ముందుగా ఎమ్మెల్యే టీడీపీ జెండా ఆవిష్కరించి, ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీతోనే అన్నివర్గాల అభివృద్ధి సాధ్యమన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇష్టానుసారంగా విడగొట్టి, అప్పుల ఊబిలోకి నూకిన రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు అభివృద్ధి బాట పట్టించారన్నారు. టీడీపీ ప్రభుత్వంలో మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అన్నివిధాలా అభివృద్ధి చెందారన్నారు. ప్రతిపక్ష నాయకుడు జగన్, జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌లు కల్లబొల్లి మాటలు చెప్పి ప్రజలను మభ్యపెడుతున్నారని, ఇదంతా ప్రజలు నమ్మవద్దన్నారు. అనంతరం నియోజకవర్గంలోని సమస్యలను తీర్మానం చేసి జిల్లా మహానాడుకు పంపారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ గుడిసె దేవానంద్, సీనియర్ నాయకులు ఎస్ ఎం డీ ఇస్మాయిల్, తాతం అరవిందబాబు, జడ్పీ కో ఆప్షన్ సభ్యులు అబ్దుల్ రవూఫ్, నాయకులు కాటం శంకర, అంగార్ రఫిక్, గవ్వల శ్రీనివాసులు, ఆల్ఫా ముస్త్ఫా, నాగభూషణం నాయుడు, అన్నబాబా, పాలకొండం నాయుడు, జైనుల్లా, హైదర్‌వలీ, ఇంతియాజ్, సోంపాళ్యం నాగభూషణ, తలుపుల సర్పంచ్ ఫయాజ్, అంజినప్ప నాయుడు, గవ్వల శ్రీనివాసులు, జేకే, అత్తార్ మహబూబ్‌బాషా, కిరణ్ షౌఖత్, కౌన్సిలర్లు శివశంకర్ నాయక్, చంద్రశేఖర్, నవాబుకోట శంకర, తాతా శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
కందికుంట గెలుపుతోనే నియోజకవర్గ అభివృద్ధి..
రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉండడం ఎంత అవసరమో నియోజకవర్గానికి కందికుంట గెలుపు అంత అవసరమని టీడీపీ ప్రజాప్రతినిధులు, కన్వీనర్లు, నాయకులు ముక్తకంఠంతో పిలుపునిచ్చారు. మదనపల్లి రోడ్డులో ఉన్న ప్రభుత్వ మైనార్టీ ఫంక్షన్ హాల్‌లో నియోజకవర్గ ఇన్‌చార్జి కందికుంట ఆధ్వర్యంలో నిర్వహించిన మహానాడులో కందికుంట మాట్లాడుతూ నియోజకవర్గంలో రెండేళ్లుగా కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల అభివృద్ధి కుంటు పడిందన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నప్పటికీ ఒక బస్సుకు ఇద్దరు డ్రైవర్లు అన్నట్లుగా తాను అభివృద్ధి వైపు నియోజకవర్గాన్ని తీసుకెళ్తుంటే కొత్తగా వచ్చిన డ్రైవర్ స్టీరింగ్‌ను పక్కకు లాగడంవల్ల అభివృద్ధి కుంటు పడిందన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడ్డానన్నారు. అయితే తాను ఎమ్మెల్యే అని చెప్పుకోవడమేతప్ప ప్రభుత్వంపై వైసీపీ నాయకులు విమర్శలు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. కష్టనష్టాల్లో కార్యకర్తలకు అండగా ఉండి, ప్రజలకు భరోసా ఇచ్చేవాడే నాయకుడు అన్న విషయాన్ని తెలుసుకోవాలన్నారు. చంద్రబాబు రాష్ట్భ్రావృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తుంటే ప్రతిపక్ష జగన్ విమర్శలు చేస్తున్నారన్నారు. తమ వెంట నాలుగేళ్లు ఉండి ప్రభుత్వానికి సూచనలు ఇస్తూ వచ్చిన జనసేన అధినేత పవన్ ఉన్నఫలంగా బీజేపీతో కుమ్మక్కై టీడీపీ ప్రభుత్వంపై, చంద్రబాబు, నారా లోకేష్‌పై విమర్శలు చేస్తున్నారన్నారు. ఇదంతా బీజేపీ ఆడిస్తున్న తెర వెనుక నాటకం అన్నారు. మరో బీజేపీ నేత కదిరికి బతకడానికి వచ్చి టీవీల్లో సొల్లుకబుర్లు చెబుతున్నారని, కదిరిలో కూర్చొని మాట్లాడితే అతని బండారం తెలుస్తుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ షేక్ సురియాబాను, జడ్పీటీసీ మేకల ప్రమీల, టీడీపీ పట్టణ అధ్యక్షుడు అహ్మద్‌అలీ, రూరల్ కన్వీనర్ చెన్నకేశవులు, మండల కన్వీనర్లు రామకృష్ణారెడ్డి, దాదెం శివారెడ్డి, శంకర్ నాయుడు, రాజారెడ్డి, నాయకులు షేక్ బాబ్‌జాన్, బాబావలీ, సీఏ ఇస్మాయిల్, డీకే ఫారుక్‌తోపాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.