అనంతపురం

చిత్తశుద్ధితో రాష్ట్భ్రావృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం సిటీ, మే 22 : రాష్ట్భ్రావృద్ధికి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని, రాష్ట్రంలో ప్రజలను మోసం చేసింది తెలుగుదేశం ప్రభుత్వమే అని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు సొముఘట్ట విష్ణువర్ధన్‌రెడ్డి విమర్శించారు. మంగళవారం స్థానిక బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వివిధ సంక్షేమ పథకాలకు కేంద్రం రూ.వేల కోట్ల నిధులు విడుదల చేసిందన్నారు. అలాగే రాష్ట్రంలో కేంద్రీయ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయడం, పొలవరానికి రూ.వేలకోట్ల రూపాయలు కేంద్రం విడుదల చేసిందన్నారు. రాష్ట్భ్రావృద్ధికి ప్రధాని నరేంద్రమోదీ చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారన్నారు. అయితే వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీలు కలసిపోయాని మాట్లాడటం ముఖ్యమంత్రి చంద్రబాబుకు తగదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ఒక సభలో తెలుగుదేశం అధినేత పాల్గొనడం చూస్తే ఆంధ్రాప్రజలను మోసం చేయడంలో ఇంతకన్నా మరొకటి లేదన్నారు. కాగా రాయలసీమ అభివృద్ధిని అడ్డుకోవడంతో టీడీపీ మొదటగా ఉంటుందన్నారు. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని, రెండవ రాజధానాని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే జిల్లాలో సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాట చేస్తామని కేంద్రం నిర్ణయిస్తే అడ్డుకుంది టీడీపీ ప్రభుత్వమేనని ఆరోపించారు. జిల్లాలో ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీ, కియా కార్లు కంపెనీ ఏర్పాటు కేంద్ర ప్రభుత్వ చలువే అన్నారు. అభివృద్ధి విషయంలో బీజేపీ అన్ని ప్రాంతాల వారికి సహకరిస్తోందన్నారు. అనంతరం జరిగిన జిల్లా పథాధికారుల సమావేశంలో విష్ణువర్ధన్‌రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు అంకాల్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో పార్టీని గ్రామ గ్రామ బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. అందుకు జిల్లాలోని నియోజకవర్గాలలో బైకు ర్యాలీ ద్వారా ప్రజలకు తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు లలిత్‌కుమార్, సందిరెడ్డి శ్రీనివాసులు, ఆదిలక్షమ్మ, రూప, శ్రీనివాసులు, మల్లారెడ్డి, ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు.

బీజేపీ, వైకాపా కుట్రలను తిప్పికొట్టండి
* ఎంపీ నిమ్మల, ఎమ్మెల్యే బీకే
అమరాపురం, మే 22 : రాష్ట్రంలో బీజేపీ, వైకాపా పార్టీల కుట్రలను తిప్పికొట్టాలని హిందూపురం పార్లమెంటు సభ్యులు నిమ్మల కిష్టప్ప, టీడీపీ జిల్లా అధ్యక్షులు, పెనుకొండ ఎమ్మెల్యే బీకే పార్థసారథి, ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మంగళవారం ఎమ్మెల్యే ఈరన్న అధ్యక్షతన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో జరిగిన మినీ మహానాడులో వారు మాట్లాడుతూ, గత కాంగ్రెస్ హయాంలో ప్రతి సంక్షేమ పథకంలోనూ అవినీతి చోటు చేసుకొందని, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో కోట్లాది రూపాయల కొల్లగొట్టి ప్రజల సొమ్మును దోచుకున్నారన్నారు. రాష్ట్రానికి హోదా వస్తేనే అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని, బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా అన్యాయం చేస్తోందన్నారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఎన్ని కుయుక్తులు చేసినా ముఖ్యమంత్రి చంద్రబాబును ఎదుర్కోలేరన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలు దక్కుతాయని ధీమా వ్యక్తం చేశారు.ప్రధాని నరేంద్రమోదీ కుయుక్తులతో కర్నాటకలో అధికారంలోకి రావడానికి ప్రయత్నించారన్నారు. కాగా నియోజకవర్గంలోని అన్ని చెరువులకు త్వరలోనే హంద్రీనీవా ద్వారా కృష్ణాజలాలను అందిస్తామన్నారు. తొలుత పట్టణంలో ద్విచక్ర వాహనాల ర్యాలీ చేపట్టారు. అదే విధంగా వీ.అగ్రహారం, కే.శివరం, ఆలదపల్లి గ్రామాలకు చెందిన పలువురు వైకాపా వర్గీయులు టీడీపీలోకి చేరగా పార్టీ కండువాలను వేసి ఆహ్వానించారు. కార్యక్రమంలో జడ్పీటీసీలు రత్నమ్మ, శ్రీనివాసమూర్తి, వీఎం పాండురంగప్ప, నాయకులు రామక్రిష్ణ యాదవ్, శివరుద్రప్ప, కృష్ణమూర్తి, ఉగ్రనరసింహప్ప, కాంతరాజు తదితరులు పాల్గొన్నారు.