అనంతపురం

ప్రకటనలకే పరిమితమైన హెచ్చరికలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందూపురం టౌన్, మే 24 : పట్టణంలో మే 1వ తేదీ నుండి పందుల సంచారం ఉండరాదని, పట్టణంలో పందులు ఉంటే వాటిని తరలించడంతోపాటు యజమానులపై కఠినచర్యలు తీసుకొంటామని గత నెలలో మున్సిపల్ కమిషనర్ భాగ్యలక్ష్మి హెచ్చరికలు జారీ చేశారు. పందుల పెంపకందార్లతో చర్చలు జరిపారు. ఏప్రిల్ నెలాఖరు చివరి గడువుగా విధించారు. మే 1వతేదీ నుండి కఠినచర్యలు ఉంటాయని హెచ్చరించారు. అయితే హెచ్చరికలు జారీ చేసి సమావేశాలు నిర్వహించి నెల రోజులు గడిచిపోయింది. పట్టణంలోని పందుల తరలింపు ప్రకటనలకే పరిమితమయింది. పందుల సంచారం కాలనీల్లో మాట దేవుడెరుగు పట్టణ ప్రధాన రహదారుల్లో సైతం విచ్చల విడిగా సంచారం జరుగుతోంది. పందుల తరలింపు నాలుగేళ్లుగా ఇదే తంతుగా సాగుతోంది. పాలకవర్గం ఏర్పడిన మొదట్లో కొంతకాలం హడావుడి చేశారు. ఆ తర్వాత ఏడాది క్రితం అప్పట్లో మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్ పందులను నియంత్రించేందుకు కఠినచర్యలు చేపట్టారు. యజమానుల నుండి తీవ్ర ఒత్తిళ్లు వచ్చినా చివరకు పందుల పెంపకందార్ల జిల్లా సంఘం నాయకులు కమిషనర్‌పై కేసులు పెట్టినా వెనక్కు తగ్గలేదు. తమిళనాడు నుండి పందులు పట్టేవారిని పిలిపించి పట్టణం నుండి పందులను బయటకు తరలించేలా చర్యలు తీసుకున్నారు. పందుల తరలింపు వాహనాలను పెంపకందార్లు అడ్డుకున్నా లెక్కచేయలేదు. అయితే ఆ తర్వాత పందుల తరలింపు మున్సిపల్ అధికారులు మరచిపోవడంతో పెంపకందార్లు సాధారణ స్థితికి చేరుకున్నారు. పట్టణంలోని పాండురంగనగర్, డీబీ కాలనీ, ముక్కడిపేట, త్యాగరాజనగర్, శాంతినగర్, మోడల్ కాలనీ, నానెప్పనగర్, పరిగి రోడ్డు, సూగూరు, బాలాజీనగర్ తదితర ప్రాంతాల్లో పందుల సంచారం తీవ్రంగా ఉంటోంది. అయితే కేరళలో ఇటీవల నిఫా వైరస్ తీవ్రతరం కావడంతో పట్టణ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ వైరస్ గబ్బిలాలు, పందుల నుండి మనుషులకు సోకుతుందని సమాచార మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతుండటంతో ప్రజలకు పందులంటే భయం నెలకొంది. దీంతో పందులను తరలించాలంటూ అధికారులపై ఒత్తిళ్లు చేస్తున్నారు. అయితే పందుల తరలింపుకు అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. దీనికి తోడు మున్సిపల్ ఛైర్‌పర్సన్ రావిళ్ళ లక్ష్మి ప్రతి గురువారం నిర్వహిస్తున్న డయల్ యువర్ ఛైర్‌పర్సన్‌లో కూడా పందుల సంచారాన్ని అరికట్టాలని అధికంగా ఫిర్యాదులు అందుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు పందులు తరలించకపోతే పట్టణ ప్రజల్లో ఆందోళనలు తగ్గే అవకాశాలు కనిపించడం లేదు.