అనంతపురం

బయటపడ్డ విభేదాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మవరం, మే 24 : జిల్లా టీడీపీలో కొంతకాలంగా ఉన్న విభేదాలు గురువారం పుట్టపర్తి వేదికగా జరిగిన జిల్లా మినీ మహానాడులో మరోసారి బయటపడ్డాయి. మహానాడుకు కొందరు నేతలు చుట్టపు చూపుగా వచ్చి వెళ్తే, అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ప్రభాకర్‌రెడ్డి, ప్రభాకరచౌదరి సభకే హాజరుకాలేదు. అలాగే మరికొన్ని నియోజకవర్గాల నేతలు గైర్హాజరయ్యారు. మినీ మహానాడు సభ ప్రారంభమైన రెండు గంటలకు నాయకులు రావడం, వచ్చిన నాయకులు ఇలా వచ్చి అలా వెళ్లిపోవడం పయ్యావుల కేశవ ప్రసంగం ముగిసిన వెంటనే అనారోగ్యమంటూ వెనుదిరిగారు. అలాగే మంత్రి పరిటాల సునీత ప్రసంగం ముగియగానే సొంత పనిపై పని ఉందంటూ, అదే తరహాలో ఎంఎల్‌సీ తిప్పేస్వామి వెళ్లిపోయారు. అంతేకాక ఇప్పటికే భగభగమంటున్న కదిరి కందికుంట వెంకటప్రసాద్ సైతం సభ మధ్యలోనే తన కోరికల చిట్టాను రాసి ఇన్‌చార్జి మంత్రికి ఇచ్చి వెళ్లిపోవడం గమనార్హం. వీటికితోడు సభ ప్రారంభం ముందు ర్యాలీలోనే పుట్టపర్తికి కాబోయే ఎమ్మెల్యే నిమ్మల కిష్టప్ప అంటూ కొందరు కార్యకర్తలు నినాదాలు చేయడం, తదుపరి ఎంపీ నిమ్మల కిష్టప్ప ప్రసంగించే సమయంలో సైతం కాబోయే ఎమ్మెల్యే అంటూ కొందరు సభా వేదిక ముందు నినాదాలు చేశారు. అంతేగాకుండా వివిధ నియోజకవర్గాల నుంచి అనుకున్న స్థాయిలో మహానాడుకు జనసమీకరణ చేయకపోవడంతోపాటు ఊహించిన రీతిలో నాయకులు, కార్యకర్తలు హాజరు కాకపోవడంతో మంత్రి ఆదినుంచే అసంతృప్తి చెందారు.