అనంతపురం

అహంకారం వీడండి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మవరం, మే 24 : ఎన్ని జన్మలెత్తినా కార్యకర్తల రుణం తీర్చుకోలేం.. వారు లేనిదే మనం లేం.. పార్టీ లేదు.. ప్రతి నాయకుడు ఒళ్లు దగ్గర పెట్టుకుని, అహంకారం వీడి పని చేయాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు జిల్లా నేతలకు ఘాటైన హెచ్చరిక చేశారు. పుట్టపర్తిలో ఎమ్మెల్యే, చీఫ్‌విప్ పల్లె రఘునాథ్‌రెడ్డి అధ్యక్షతన గురువారం నిర్వహించిన జిల్లా మినీ మహానాడు ఎంతో అట్టహాసంగా జరిగింది. ముందుగా పుట్టపర్తిలో హనుమాన్ సర్కిల్ నుంచి గోకులం, ఎనుములపల్లి గణేష్‌సర్కిల్, సత్యసాయి వినాశ్రయం మీదుగా పెద్ద ఎత్తున ద్విచక్ర వాహనాల ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నాయకుల వ్యవహార శైలిపై తీవ్రంగా దేవినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఛీప్‌విప్ పల్లె రఘునాథరెడ్డి మధ్యలో కలుగజేసుకునేందుకు యత్నించినా, కాసేపు ఉండన్నా ఇంకా తిట్టాల్సింది చాలా ఉందంటూ హెచ్చరికలు జారీ చేశారు. పదవులు ఇచ్చిన పార్టీ పనుల కంటే సొంత పనుల్లోనే ఎక్కువ బిజీ అయ్యారని తీవ్రం స్వరంతో అన్నారు. ప్రతి నాయకుడు కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగానే పని చేయాలన్నారు. పార్టీ మహా పర్వదినమైన మహానాడుకే హాజరుకాకుండా నేతలంతా బిజీబిజీగా పనులపై వెళ్తే ఏమిటంటూ వేదికపైనే తీవ్ర స్వరంతో హెచ్చరించారు. ‘పార్టీదే తుది నిర్ణయం. ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలన్నా అధినేత ఆదేశాల మేరకే ఉంటుంది. వీటికి తోడు కార్యకర్తల నుంచే నాయకుడు పుట్టుకొస్తాడు. కార్యకర్తల మనోభావాలు దెబ్బతినకుండా పని చేయాలి’ అన్నారు. దీంతో ఒక్కసారిగా వేదికపై ఉన్న నేతలు, సభలో ఉన్న నాయకులు కంగుతిన్నారు. మంత్రి పరిటాల సునీత మాట్లాడుతూ ప్రతి టీడీపీ కార్యకర్తకూ, పరిటాల కుటుంబ అభిమానులకు అండగా ఉంటామన్నారు. కులమతాలకు అతీతంగా అన్నివర్గాలకు సంక్షేమ ఫలాలను అందించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుదేనన్నారు. కుటిల స్వార్థ రాజకీయాలతో అందలం ఎక్కాలన్న కొందరు స్వార్థపరులను తిప్పి కొట్టాలన్నారు. తిరిగి 2019 సంవత్సరంలో చంద్రబాబును ముఖ్యమంత్రి చేసి రాష్ట్రాన్ని అభివృద్ది చేసుకుందామన్నారు. మంత్రి కాలవ శ్రీనివాసులు మాట్లాడుతూ ఎన్నికల సమరానికి ప్రతి కార్యకర్త, నాయకుడు సంసిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. బడుగు, బలహీన వర్గాలకు అండగా వున్న టీడీపీని తిరిగి అధికారంలోకి తీసుకురావడం ప్రతి ఒక్కరి విధి అన్నారు. అవినీతి కేసుల్లో కూరుకుపోయిన వై ఎస్ జగన్, విజయసాయిరెడ్డిలకు చంద్రబాబును విమర్శించే స్థాయి లేదన్నారు. దేశ ప్రధానిని ఎదురించి, బీజేపీ వ్యతిరేక పార్టీలను ఒక వేదికపైకి తీసుకువచ్చేందుకు చంద్రబాబు సన్నద్ధంగా ఉన్నారన్నారు. దేశంలో రాజకీయ పరిణామాలు కొత్త మలుపు తిరగడం ఖాయమన్నారు.