అనంతపురం

ఎస్‌కేయూ అక్రమాలపై విచారణ జరగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం అర్బన్, మే 27: ఎస్‌కేయూ అక్రమాలపై విచారణ జరపాలని ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా ఇష్టానుసారంగా అక్రమ నియామకాలు జరిపారన్నారు. దీనిపై విద్యార్థులు ప్రశ్నిస్తే వారిపై నిరంకుశ వైఖరి చాటుతున్నారన్నారు. విద్యార్థుల జీవితాలతో ఆడుకొంటూ వసతి గృహాల్లో నుంచి ఖాళీ చేయించారని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. అధికారుల నిర్లక్ష్య వైఖరి వల్ల గత మూడేళ్లలో రూ.100 కోట్ల ఆదాయాన్ని కోల్పోయామన్నారు. వీసీ, రిజిస్ట్రార్ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా యూనివర్శిటీలో చర్యలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. కనీసం తాగునీటి వసతులు లేని దైన్యం అక్కడ నెలకొన్నదని ఆయన తన అసహనాన్ని వ్యక్తం చేశారు. వీరిపై రాష్ట్ర అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
పీవీకేకే ఇంజనీరింగ్ కాలేజిలో ప్రాంగణ నియామకాలు
అనంతపురం సిటీ, మే 27: పీవీకేకే ఇంజనీరింగ్ కాలేజిలో ఈ నెల 29వ తేదీన ప్రపంచ ప్రఖ్యాత సాఫ్ట్‌వేర్ కంపెనీ ఐబీఎం ఆధ్వర్యంలో ప్రాంగణ నియామకాలు నిర్వహించనున్నట్లు కాలేజి ప్రిన్సిపాల్ డా.బండి రమేష్‌బాబు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రాంగణ నియామకాలలో బి.టెక్‌లో సిఎస్‌ఈ, ఈసిఈ, ఐటీ బ్రాంచ్‌లలో 65 శాతం మార్కులతో 2017-18వ సంవత్సరంలో ఉత్తీర్ణులైన వారు అర్హులని, వీరందరూ 29వ తేదీ ఉదయం 9 గంటలకు తమ బయోడేటా, మార్కుల జాబితాలతో హాజరుకావచ్చునని తెలిపారు.
30న ఫ్యాప్టో ధర్నా విజయవంతం చేయండి
అనంతపురం సిటీ, మే 27: ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యలపై ఈ నెల 30వ తేదీన ఫ్యాఫ్టో ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు నిర్వహించే ధర్నాను విజయవంతం చేయాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి.నరసింహులు, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బికె.ముత్యాలప్ప, కోనంకి అశోక్‌కుమార్‌లు ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. జిల్లాలోని సబ్ కమిటీ సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు, రాష్ట్ర కౌన్సిలర్లు, మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యాయులు పాల్గొని ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.