అనంతపురం

టీడీపీకి స్వతంత్రంగా పోటీ చేసే దమ్ముందా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాడిపత్రి, మే 27: సారస్వతిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ స్వతంత్రంగా ఇప్పటి వరకు పోటీ చేసి ఒక్కసారైనా గెలుపొందిందా, టీడీపీకి స్వతంత్రంగా పోటీ చేసి గెలుపొందే దమ్ముందాంటు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు జంగంరెడ్డి అంకాల్‌రెడ్డి ప్రశ్నించారు. స్థానిక ప్యారడైజ్ హోటల్‌లో ఆదివారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో అంకాల్‌రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రాలో బీజేపీని అడ్రస్ లేకుండా చేస్తాం, నామరూపాలు లేకుండా చేస్తామని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఉత్తరకుమార ప్రగల్భాలు పలుకుతూ, బీజేపీ రాష్ట్రానికి మోసం చేసిందని పనిగట్టుకొని ప్రచారం చేస్తున్నారని, రాష్ట్రానికి బీజేపి చేసిన మోసం ఏమిటో రాష్ట్ర ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. 1999, 2014లలో బీజేపీతో కలిసి ఎన్నికల బరిలో దిగినందునే టీడీపీ అధికారంలోకి వచ్చిందన్న సంగంతి మరిచి మాట్లవద్దని హితవు పలికారు. చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ స్వతంత్రంగా పోటీ చేసి ఒక్కసారి గెలువలేదన్నారు. రాష్ట్రంలో టీడీపీ చేస్తున్న అవినీతి, అరాచక పాలనతో ప్రజలు విసిగిపోతున్నారని, గృహాలు, పెన్షన్ల మంజూరు, బీసీ, ఎస్సీల సబ్సిడీ రుణాలతోపాటు, ఇసుకలోను అవినీతిమయమైనందునే టీడీపీకి బీజేపీ దూరమైందన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాలు పూర్తి చేసుకొని 5వ సంవత్సరంలోకి అడుగిడుతుందన్నారు. ఎన్‌డీఏ ప్రభుత్వం ప్రధాని మోదీ అధ్వర్యంలో దేశంలో 22 కోట్లమంది లబ్దిదారులు సంక్షేమ పథకాలతో లబ్ధి పొందారన్నారు. ప్రస్తుతం దేశంలో నరేంద్రమోదీ ఒకవైపునా, మిగిలిన ప్రతిపక్షాల నాయకులంతా ఒకవైపున ఉన్నారనే సంగతి మొన్న కర్ణాటకలో బహిర్గతమైందన్నారు. దేశంలోని ప్రతిపక్షాలన్ని ఒకే తాటిపై నిలిచినా బీజేపీని ఎదుర్కోలేవన్నారు. దేశ వ్యాప్తంగా 8.4 లక్షల మంది ప్రజలతో టైమ్స్‌వే నిర్వహించిన సర్వేలో 71.9శాతం మంది ప్రజలు, తెలుగు రాష్ట్రాలలో 55శాతం ప్రజలు బీజేపీకే మద్దతు పలికారని తెలిపారు. మోదీ నీతివంతమైన పాలన 4సార్లు ముఖ్యమంత్రిగా, 4 సంవత్సరాలు ప్రధానిగా నిలిపిందన్నారు. మోదీ 40 ఏళ్ల రాజకీయ జీవితంలో మచ్చలేకుండా నీతి, నిజాయితీతో పాలించిన మోదీకే భారత ప్రజలు మద్దతు తెలుపుతున్నారన్నారు. 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ స్వతంత్రంగా పోటీ చేస్తుందని తెలిపారు. జడ్‌ఆర్‌యూసీసీ మెంబర్ ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో కులాలను రెచ్చగొడుతూ ఒకే సామాజిక వర్గానికి మాత్రమే అధికారం కట్టబెట్టిందన్నారు. టీడీపీ ఎంపీ మురళిమోహన్ కలియుగ దైవం వెంకటేశ్వరస్వామిని కులం పేరుతో వెంకయ్యచౌదరిగా సంబోదించడం దారుణమన్నారు. అనంతరం నరేంద్రమోదీ ప్రభుత్వం 4సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్బంగా బీజేపీ నాయకులు మిఠాయిలు పంచుకున్నారు.
వారం రోజులుగా అందని తాగునీరు..
* ఇబ్బందుల్లో మడకశిర ప్రజలు
మడకశిర, మే 27 : నగర పంచాయతీలో ఉన్న 28 బీఓటీలకు అధికారుల నిర్లక్ష్యం కారణంగా వారం రోజులుగా శ్రీరామరెడ్డి తాగునీటి పథకం ద్వారా నీరు అందకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వివిధ కాలనీలకు తాగునీరు అందించేందుకు పట్టణంలోని 28 ప్రాంతాల్లో బీఓటీలను ఏర్పాటు చేశారు. అయితే వారం రోజులుగా శ్రీరామరెడ్డి తాగునీటి పథకం ద్వారా నీరు అందకపోవడంతో ప్రజలు ప్రైవేటు ప్లాంట్‌లను ఆశ్రయించాల్సి వస్తోంది. ఐదు రోజుల క్రితం కలెక్టర్ వీరపాండ్యన్ తాగునీటి సమస్యను తెలుసుకోవడానికి మండల పరిధిలోని గౌడనహళ్లి, సీ.కొడిగేపల్లిలలో పర్యటించిన విషయం విధితమే. పట్టణంలో ఆర్‌అండ్‌బీ అధికారులు రహదారి ఏర్పాటుతో తొలగించిన తాగునీటి పథకం పైపులైన్‌లను 24 గంటల్లో మరమ్మతు చేసి నీటి సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. అయితే నగర పంచాయతీకి సంబంధించి ఇప్పటి వరకు పైపులైను మరమ్మత్తు చేయలేదని స్థానికులు అంటున్నారు. పైపులైన్ మరమ్మతుల విషయాన్ని సంబంధిత శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లడంలో నగర పంచాయతీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సమస్య మరింత జఠిలం కాక ముందు అధికారులు పైపులైన్ మరమ్మతులు చేయించి నీటి సమస్య తీర్చాలని కోరుతున్నారు.