అనంతపురం

అర్హులందరికీ చంద్రన్న సంక్రాంతి కానుక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెనే్నకొత్తపల్లి, డిసెంబర్ 26: చంద్రన్న సంక్రాంతి కానుక ప్రతి ఒక్క రేషన్ కార్డుదారులకు అందజేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత అన్నారు. శనివారం మండల కేంద్రంలో వున్న పౌర సరఫరాల శాఖ గిడ్డంగిని సాయం త్రం మంత్రి పరిటాల సునీత తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి స్టాకిస్టు నారాయణస్వామితో సరుకుల వివరాలు, నాణ్యత, పంపిణీ ప్రక్రియ గురించి ఆరా తీశారు. ప్రతి ఒక్క డీలరుకు సరుకు సక్రమంగా పంపిణీ చేయాలని మంత్రి స్టాకిస్టును ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి విలేఖరులతో మాట్లాడుతూ చంద్రన్న సంక్రాంతి కానుక గత సంవత్సరం కూడా ప్రజలకు అందజేయడం జరిగిందన్నారు. ఈ ఏడాది కూడా ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో సంక్రాంతి పండుగను జరుపుకునేలా ముఖ్యమంత్రి చర్యలు చేపట్టారన్నారు. అందులో భాగంగానే రేషన్ కార్డులు కూడా పంపిణీ ప్రక్రియ త్వరలోనే చేపడతామన్నారు. దీపం పథకం కింద 8 లక్షల మందికి గ్యాస్ కనెక్షన్లు ఇప్పటికే అందజేయడం జరిగిందన్నారు. మరో 12 లక్షల గ్యాస్ కనెక్షన్లను కూడా అందజేస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.42 కోట్ల కొత్త రేషన్ కార్డులు జనవరి 2వ తేదీన జరగబోయే జన్మభూమి కార్యక్రమాల్లో పంపిణీ చేస్తామని మంత్రి పేర్కొన్నారు. చంద్రన్న సంక్రాంతి కానుక సరుకుల నాణ్యతలో రాజీ పడేది లేదన్నారు. సంక్రాంతి పండుగ లోగా ప్రతి ఒక్క రేషన్ కార్డుదారులకు అందజేయాలని అక్కడున్న డీలర్లకు మంత్రి ఆదేశించారు. ఈ-పాస్ ద్వారా ప్రతి ఒక్కరికి సరుకులు అందించాలని, యంత్రాలు మొరాయించకుండా తక్షణ చర్యలు కూడా చేపట్టినట్లు మంత్రి డీలర్లకు తెలిపారు. మంత్రి వెంట ఎంపిపి అమరేంద్ర, జెడ్‌పిటిసి వెంకటరామిరెడ్డి, కన్వీనర్ శ్రీరాములు, ఎంపిడిఓ రామాంజనేయులు, అంకె ఆంజనేయులు, బాబూలాల్, రామాంజనేయులు, కిష్టప్ప వున్నారు.
వాల్మీకులను ఎస్‌టి జాబితాలో చేర్చేందుకు కృషి
* చీఫ్‌విప్ కాలవ శ్రీనివాసులు
ధర్మవరం, డిసెంబర్ 26: తరతరాల సమస్యలతో తీవ్ర అన్యాయానికి వాల్మీకి సామాజిక వర్గం గురైందని, రాజకీయ స్వార్థానికి, పెద్దల స్వార్థానికి బలైందని, అలాంటి సామాజిక వర్గాన్ని ఎస్‌టిలుగా గుర్తించేందుకు అన్ని అర్హతలు వున్నాయని ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు అన్నారు. శనివారం వాల్మీకులు చేపట్టిన 24గంటల సంకల్ప దీక్ష ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ ఈ సమస్యపై పలువురు ముఖ్యమంత్రులను కలిశామని, అప్పట్లో దివంగత నేత ఎన్‌టిఆర్‌ను సైతం వాల్మీకులు కలిసి సమస్యను విన్నవించారని, ఇందుపై తప్పక న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన తొలి ముఖ్యమంత్రి ఎన్‌టిఆరేనన్నారు. టిడిపి వాల్మీకులకు ప్రాధాన్యతనిచ్చి రాజకీయంగా ముందుకు తీసుకెళ్ళిన తొలి ముఖ్యమంత్రి సైతం ఆయనేనన్నారు. తదుపరి ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలోని బోయలు, వాల్మీకులు ఒకటేనని గుర్తించారన్నారు. రాజకీయాలు, పార్టీలు వేరైనా జాతి సమస్యపై వీటికి అతీతంగా పోరాడి హక్కును సాధించుకోవాలన్నారు. నివేదికతో సంబంధం లేకుండా ఎస్‌టిలుగా చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబును కోరడం జరిగిందన్నారు. ఇందుపై చంద్రబాబు సైతం తాము అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం తరపున న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని, దీంతో దేశంలో వాల్మీకుల స్థితిగతులను, పరిస్థితులను వివరించామన్నారు. ఇటీవల 20మంది ఎమ్మెల్యేలతో సిఎంను కలిసి సమస్య పరిష్కారం చేయాలని కోరామని, వాల్మీకులు విద్యకు, ఉపాధికి దూరంగా వున్నారని, ఎస్‌టిలుగా గుర్తిస్తే వారి పిల్లలకైనా న్యాయం జరిగేలా రిజర్వేషన్లు కల్పించి ఇతరుల వలె అభివృద్ధి చెందే వీలుంటుందని స్పష్టం చేశామన్నారు. త్వరలో తప్పక న్యాయం జరుగుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే గోనుగుంట్ల మాట్లాడుతూ ఒకే రాష్ట్రంలో వాల్మీకులు ఎస్‌టిలుగా, బిసిలుగా వున్నందున అనేక ఇబ్బందులుపడుతున్నారని, ఆర్థికంగా, సామాజికంగా పూర్తిగా వెనుకబడిన వాల్మీకులను మిగిలిన 8 జిల్లాల్లో ఎస్‌టి జాబితాలోకి చేర్చాల్సిన అవసరం వుందన్నారు. టిడిపి రూరల్ మండల అధ్యక్షులు గొట్లూరు శ్రీనివాసులు మాట్లాడుతూ పట్టణంలో వాల్మీకి భవన్ ఏర్పాటుతోపాటు ఇల్లు లేని వాల్మీకులకు నివేశన స్థలాల కోసం రెండు ఎకరాలు కేటాయించాలని ఎమ్మెల్యే గోనుగుంట్లను కోరగా స్పందించిన ఎమ్మెల్యే వాల్మీకులకు ఇంటి స్థలాలతోపాటు వాల్మీకి భవన్‌కు రెండు ఎకరాల భూమి చాలదని, అవసరమైనంత భూమిని కేటాయిస్తామని వాల్మీకుల హర్షధ్వానాల మధ్య హామీ ఇచ్చారు. అనంతరం సంకల్ప దీక్షను విరమింపచేశారు. ఈ కార్యక్రమంలో అనంతపురం మార్కెట్ యార్డు చైర్మన్ ఆదినారాయణ, వాల్మీకి సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షులు అంబికా లక్ష్మినారాయణ, మద్దిలేటి, కాటమయ్య, రామగిరి మాజీ ఎంపిపి రంగయ్య, చందమూరి రమేష్, వైస్‌చైర్మన్ శ్రీనివాసులు, చిప్పల మల్లికార్జున, స్థానిక వాల్మీకి నాయకులు బోయ రవిచంద్ర, చంద్రమోహన్‌బాబు, బొట్టు కిష్ట, పలువురు కౌన్సిలర్లు, వాల్మీకి సోదరులు పాల్గొన్నారు.
రెయిన్‌గన్‌తో తగ్గనున్న రైతుల శ్రమ
* మంత్రి పరిటాల సునీత
కనగానపల్లి, డిసెంబర్ 26 : రైతు లు సాగు చేసే పంటలకు రెయిన్‌గన్ ఎంతో అనువైనదిగా వుంటూ శ్రమను తగ్గిస్తుందని పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత అన్నా రు. మండల పరిధిలోని నరసంపల్లి సమీపంలో మంత్రి పరిటాల సునీత సాగు చేసిన వేరుశెనగ పొలంలో కొత్తగా అ మర్చిన రెయిన్‌గన్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రెయిన్‌గన్‌ను రైతులకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం ఆలోచనలో వుందన్నారు. సబ్సిడీతో రైతులకు అందించే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి వాటిని అమలుపరిచేందుకు కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. ఎపిఎంఐపి పిడి వెంకటేశ్వర్లును రెయిన్‌గన్ వల్ల ఉపయోగాల గురించి మంత్రి అడిగి తెలుసుకున్నారు. పిడి మాట్లాడుతూ రెయిన్‌గన్‌తో ఒకేసారి గంటకు 60 లీటర్ల నీటితో ఎకరా పొలంను తడుపుకోవచ్చునన్నారు. రైతులకు అందుబాటులోకి వస్తే ఎంతో ఉపయోగకరంగా వుంటుందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పోతులయ్య, రామగిరి సర్కిల్ సిఐ రాజా, టిడిపి నాయకులు చంద్ర, రాజాకృష్ణ, సుధాకర్‌నాయుడు, మనోహర్‌నాయుడు పాల్గొన్నారు.