అనంతపురం

ఉచిత విద్యుత్‌ను అందించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం సిటీ, జూన్ 19: జిల్లాలోని రజకులు ఉన్న గ్రామాల్లో ప్రభుత్వమే దోభిఘూట్‌లు నిర్మించి, ఉచితంగా విద్యుత్ సౌకర్యాన్ని కల్పించాలని రజక వృత్తిదారుల సమాఖ్య జిల్లా అధ్యక్షుడు సి.లింగమయ్య డిమాండ్ చేశారు. ఈమేరకు మంగళవారం బీసీ కార్పొరేషన్ ముందు రజకులతో కలసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా లింగమయ్య మాట్లాడుతూ జిల్లాలో చాలా గ్రామాల్లో దోబిఘాట్‌లు, నీటి సౌకర్యం లేక రజకులు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారన్నారు. వీరిని అదుకోవాల్సిన ప్రజా ప్రతినిధులు, అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. ఓట్ల కోసం ఎన్నికలప్పుడు రాజకీయ నాయకులు రజకుల వద్దకు వస్తారని అధికారంలోకి వచ్చిన తరువాత రజకుల వైపు కనె్నత్తి చూడరని ఆరోపించారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లో రజకులకు దోభీ ఘాట్‌లను ప్రభుత్వం కట్టించి, ఉచితంగా విద్యుత్‌ను అందించాలని, లేనిపక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

మానవతా మూర్తి ఫెర్రర్
* ఎమ్మెల్యే ప్రభాకర చౌదరి * ఆర్డీటీ వ్యవస్థాపకునికి ఘన నివాళులు
అనంతపురం కల్చరల్, జూన్ 19: ఆర్డీటీ వ్యవస్థాపకులు వినె్సంట్ ఫెర్రర్ మానవత్వం మూర్త్భీవించిన మహోన్నతులని ఎమ్మెల్యే ప్రభాకర చౌదరి పేర్కొన్నారు. ఫెర్రర్ వర్థంతి సందర్భంగా కలెక్టరేట్ ఎదురుగా గల ఫెర్రర్ విగ్రహానికి ఎమ్మెల్యేతోపాటు నగర మేయర్, పలువురు కార్పొరేటర్లు, వివిధ సంఘాల నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లాలో అణగారిన బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతిగా లక్షల కుటుంబాల్లో వెలుగులు నింపిన మహనీయులు ఫెర్రర్ అని కొనియాడారు. ప్రభుత్వాలకు సమాంతరంగా అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఆర్డీటీ ద్వారా నిర్వహించారన్నారు. ఆర్డీటీ ద్వారా అనేకమంది ఉద్యోగ, ఉపాధి సౌకర్యాలు పొందుతున్నారన్నారు. రాష్ట్రంలో 7 జిల్లాల్లో ఆర్డీటీ సేవలు విస్తరించాయని, తండ్రి చూపిన బాటలో ఆయన కుమారుడు మాంచో ఫెర్రర్ సేవలు నిర్వహిస్తున్నారన్నారు. ఆయన సేవలు భావితరాలకు గుర్తుండేలా ఆయన ఆశయ సాధన కోసం కృషి చేస్తామన్నారు.
జిల్లా కేంద్ర గ్రంథాలయంలో...
ఫెర్రర్ వర్థంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు గౌస్‌మొద్దీన్, కార్యదర్శి లలిత మాట్లాడుతూ జిల్లాలో ఆర్డీటీ సంస్థను స్థాపించిన ఫెర్రర్ పేదల జీవితాల్లో వెలుగులు నింపి, వారి హృదయాల్లో స్థానం సంపాదించారన్నారు. ఆర్డీటీ సహకారంతోనే డిజిటల్ గ్రంథాలయం నిర్మింపబడినట్లు తెలిపారు. జిల్లా అభివృద్ధిలో ఆర్డీటీ కృషి ప్రశంసనీయమన్నారు.