అనంతపురం

మల్లాపురానికి జ్వరమొచ్చింది..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంతకల్లు/విడపనకల్లు, జూన్ 19 : మండల పరిధిలోని గాజుల మల్లాపురానికి జర్వమొచ్చింది. వారం రోజుల నుంచి విషజ్వరాలు ప్రబలుతుండటంతో ఇంటికి ఒకటి నుంచి ముగ్గురు వరకూ మంచాన పడుతున్నారు. గ్రామంలో లోపించిన పారిశుద్ధ్యం, తాగునీరు కలుషితం కావడం వల్ల వ్యాధులు ప్రబలుతున్నట్లు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పది రోజులుగా వ్యాధులు ప్రబలుతున్నా వైద్య సిబ్బంది కనె్నత్తయిన చూడలేదని అంటున్నారు. చిన్న, పెద్ద, వృద్ధులకు కీళ్ల వాపులతోపాటు విపరీతమైన జ్వరం వస్తోంది. దీంతోపాటు అధికంగా కాళ్లు, చేతులు విపరీమైన నొప్పులు రావడంతో మంచం పడుతున్నారు. ముఖ్యంగా ఒంటిపై దద్దుర్లు ఏర్పడి మంటలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోగపీడితులు నడవలేని దుస్థితికి చేరుకుంటున్నారని గ్రామానికి చెందిన సీతారాముడు తెలిపారు. ఇంట్లో ఒకరికి వస్తే చాలు, కుటుంబ సభ్యులందరికీ వ్యాధి వ్యాప్తి చెందుతోందని అంటున్నారు. మొదట తన మనువడు బైరప్పకు జ్వరం రావడంతో తనకు సోకిందని, ఫలితంగా దాదాపు వారం రోజులు కర్నాటల బళ్లారిలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నాని సీతారాముడు తెలిపాడు. అదేవిధంగా గ్రామానికి చెందిన 50 ఏళ్ల విమలకు వ్యాధి సోకడంతో బళ్లారిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. దాదాపు 3 నుంచి 4 వేల వరకు వైద్య చికిత్స నిమిత్తం ఖర్చు చేసినా కనీసం నొప్పులు తగ్గలేదని వాపోతున్నారు. ఆర్థిక స్థోమత లేని వారు రోగాలతో ఇంట్లోనే బాధలు అనుభవిస్తున్నట్లు తెలిపారు. గ్రామానికి చెందిన వెంకటేష్‌కు ఈనెల 21, 22 వివాహం జరగాల్సి ఉండగా అనారోగ్యానికి గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వీరితోపాటు గ్రామానికి లలిత, భాగ్యమ్మ, వన్నూర్‌స్వామి, సుంకమ్మ, చెన్నమ్మ అనారోగ్యానికి గురయ్యారు. పదిరోజులుగా జ్వరాలు సోకి ఇబ్బందులు పడుతున్న వైద్యాధికారులు కనె్నత్తి చూడలేదని వాపోయారు. బాధితులు కర్నాటకలోని బళ్లారి, అనంతపురంతోపాటు ఉరవకొండ, గుంతకల్లు తదితర ప్రాంతాలలో వైద్య చికిత్స పొందుతున్నారు. ఇప్పటికైనా జిల్లా వైద్యాధికారులు స్పందించి గ్రామంలో వైద్య చికిత్స అందించాలని కోరుతున్నారు. అలాగే శుద్ధమైన తాగునీటి సరఫరా, మురికి కాలవలను శభ్రం చేయించాలని కోరుతున్నారు.
నేడు ఎస్‌ఐల పాసింగ్ పరేడ్
- పోలీసు శిక్షణా కళాశాలలో ఏర్పాట్లు పూర్తి
- ముఖ్య అతిథిగా హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప
- పరేడ్‌లో పాల్గొననున్న 662 మంది శిక్షణా ఎస్సెలు
అనంతపురం అర్బన్, జూన్ 19: 12 నెలలు అత్యంత కఠినమైన ఎస్‌ఐల శిక్షణను దిగ్విజయంగా పూర్తి చేసుకొన్న 662 మంది శిక్షణా ఎస్‌ఐలు బుధవారం పోలీస్ శిక్షణా కళాశాలలో నిర్వహించనున్న పాసింగ్ అవుట్ పరేడ్‌కు సిద్ధమయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చిన్నరాజప్ప హాజరవుతుండగా, పోలీస్ డైరెక్టర్ జనరల్ మాలకొండయ్య, శిక్షణా కళాశాల ఐజీ సంజయ్ పాల్గొనబోతున్నారు. వందేళ్ల చరిత్ర కలిగిన నగరంలోని పోలీస్ శిక్షణా కళాశాల అద్భుత ఆవిష్కరణకు సజీవంగా నిలవబోతుంది. రాష్ట్ర విభజనకు ముందు హైదరాబాద్‌లోని అప్పాలో ఎస్‌ఐల శిక్షణ కొనసాగుతుండేది. విభజన అనంతరం అనంతపురం పోలీస్ శిక్షణా కళాశాలకు తాత్కాలికంగా అప్పా హోదా కల్పించారు. 2017 పోలీస్ శాఖ నిర్వహించిన ఎస్‌ఐల నియామకంలో ఎంపికైన వారికి 12 నెలల శిక్షణ పూర్తయ్యింది. మంగళవారం ఇదే కళాశాలలో 662 మంది శిక్షణా ఎస్‌ఐలు తమ శిక్షణను పూర్తి చేసుకొని పాసింగ్ అవుట్ పరేడ్‌లో పాల్గొనబోతున్నారు. ఎస్‌ఐల పాసింగ్ అవుట్ పరేడ్ ఉదయం 7-30కు ఆరంభం కానున్న నేపథ్యంలో మంగళవారం రాత్రికి హోం మంత్రితోపాటు డీజీపీ, పీటీసీ ఐజీ అనంతపురం నగరానికి చేరుకోనున్నారు. ఈ వివరాలను జిల్లా పోలీస్ యంత్రాంగం గోప్యంగా ఉంచింది. బుధవారం ఉదయం 7-30 నుంచి 9-45 వరకు ఎస్‌ఐల పాసింగ్ అవుట్ పరేడ్ జరుగుతుంది. శిక్షణా ఎస్‌ఐల నుంచి హోం మంత్రి గౌరవ వందనం అందుకోనున్నారు. అనంతరం వివిధ విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభకనబరిచిన ఎస్‌ఐలకు హోం మంత్రి చేతుల మీదుగా ట్రోఫీలు అందజేస్తారు. అనంతరం శిక్షణా పూర్తి చేసుకొన్న ఎస్‌ఐలనుద్ధేశించి హోం మంత్రి చిన్నరాజప్ప మాట్లాడతారు. 2017లో పోలీస్ శాఖ నిర్వహించిన ఎస్‌ఐల నియామకంలో గుంటూరు, ఏలూరు, కర్నూలు, విశాఖపట్నం రేంజ్‌ల పరిధిలో 662 మంది ఎస్‌ఐలుగా శిక్షణకు ఎంపికయ్యారు. ఇందులో పౌర విభాగం (సివిల్)లో 342 మంది, సాయుధ విభాగం (ఏఆర్)లో 108 మంది, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక విభాగం (ఏపీఏఎస్పీ)లో 194 మంది, మరో రిజర్వు విభాగం (ఎస్‌ఎఆర్‌ఎల్)లో 8 మందికి సంబంధించి సివిల్ విభాగంలోని వారికి 12 నెలలు, ఏఆర్ విభాగంలోని వారికి తొమ్మిది నెలలు శిక్షణను శిక్షణా కళాశాలలో పూర్తి చేసుకొన్నారు. ఉదయం 5-30తో ఆరంభమయ్యే వీరి శిక్షణ, సాయంత్రం 7-30 వరకు కొనసాగుతుంది. శిక్షణా అధికారులు చట్టాలపై అవగాహనతోపాటు ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఫోరెన్సిక్ సైన్స్, కంప్యూటర్స్ బేసిక్స్, పోలీస్ అప్లికేషన్స్, టెక్నాలజీ ఇన్ పోలీసింగ్, క్రైం ఇనె్వస్టిగేషన్, ఉమెన్, చిన్నారులు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ రక్షణపై సవివరంగా వీరికి అవగాహన కల్పించారు. అదేవిధంగా సెమిస్టర్, పోలీస్ స్టేషన్ నిర్వహణ, నేర స్వభావం, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, ప్రత్యేక, స్థానిక చట్టాలు, సైబర్ నేరాలు, దర్యాప్తులు, ఆర్థిక నేరాల నియంత్రణ, డ్రైవింగ్, స్విమ్మింగ్‌తో ప్రతి అంశంపైన శిక్షణలో ఉన్న వారికి పూర్తిస్థాయిలో అవగాహన కల్పించారు. ఈ పరేడ్ పూర్తవ్వగానే వీరికి జిల్లాలు కేటాయిస్తారు.
మోడల్ పోలీస్ స్టేషన్‌ను ప్రారంభించనున్న హోం మంత్రి
బుధవారం నగరంలోని పోలీస్ శిక్షణా కళాశాలలో శిక్షణ ఎస్‌ఐల పాసింగ్ అవుట్ పరేడ్‌కు హాజరవుతున్న హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప పాసింగ్ పరేడ్ అనంతరం డీజీపీ మాలకొండయ్యతో కలిసి కోర్టు రోడ్డులో నూతనంగా నిర్మించిన రెండవ పట్టణ మోడల్ పోలీస్ స్టేషన్‌ను ప్రారంభిస్తారు.

నవీన్‌కు జగన్ భరోసా..
* అందరినీ కలుపుకుపోవాలని మార్గదర్శకం
హిందూపురం, జూన్ 19 : ‘నీకు ఎలాంటి ఇబ్బంది లేదు. పార్టీ కోసం పనిచేస్తున్నావు.. ఇలాగే తొమ్మిది నెలలపాటు అందరినీ కలుపుకుని కష్టపడి ముందుకెళ్లు’ అంటూ వైకాపా అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్త నవీన్‌నిశ్చల్‌కు భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రజా సంకల్ప పాదయాత్రలో భాగంగా మంగళవారం పీ.గన్నవరంలో తాజా రాజకీయ పరిణామాలపై వైఎస్ జగన్‌తోపాటు జిల్లా ఇన్‌చార్జి మిథున్‌రెడ్డిను నవీన్‌నిశ్చల్ కలిసి చర్చించారు. ఇందులో భాగంగా వచ్చే తొమ్మిది నెలలు రాజకీయంగా తమపార్టీకి ఎంతో కీలకమని సూచించినట్లు తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో టికెట్ కేటాయింపుపై నవీన్‌తోపాటు ఉన్న స్థానిక వైకాపా నాయకులు కొటిపి హనుమంతరెడ్డి జగన్‌తో సూచనప్రాయంగా అడిగినట్లు సమాచారం. నీకోసమే కొందరిని పార్టీలోకి చేర్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు, తటస్తంగా ఉన్న నాయకులను కూడా చురుగ్గా వ్యవహరించేలా చర్యలు తీసుకున్నట్లు జగన్మోహన్‌రెడ్డి అభయం ఇచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇందుకు నవీన్ స్పందిస్తూ తప్పకుండా అందరినీ కలుపుకుని పార్టీ పటిష్టానికి తన వంతు మరింత కృషి చేస్తానని బదులిచ్చినట్లు తెలుస్తోంది. అలాగే నాలుగేళ్లగా పార్టీ పురోభివృద్ధి కోసం చేపట్టిన కార్యక్రమాలు, తీసుకున్న చర్యలను జగన్‌కు వివరించినట్లు సమాచారం. ఏదేమైనా వైకాపా అధినేత నవీన్‌నిశ్చల్‌కు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తున్నట్లు స్పష్టమైన సంకేతాలు ఇవ్వడంతో ఆయన వర్గీయుల్లో మరింత ఉత్సాహం నెలకొంది.