అనంతపురం

సత్వర న్యాయం కోసమే న్యాయసేవా శిబిరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుత్తి, జూన్ 23 : జిల్లాలోని ప్రజలందరికీ ఎక్కడిక్కడ సత్వర న్యాయ సేవలు అందించేందుకు న్యాయ సేవల శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా జడ్జి శశిధర్‌రెడ్డి, కలెక్టర్ వీరపాండ్యన్ తెలిపారు. శనివారం మండల పరిధిలోని బాట సుంకులమ్మ ఆలయం వద్ద శ్రీచక్ర కల్యాణ మండపంలో గుత్తి ఏడీజే కమలాదేవి అధ్యక్షతన న్యాయసేవ శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మండల పరిధిలోని వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వినతులను పరిశీలించిన అధికారులు కొన్నిటిని అక్కడిక్కడే పరిష్కరించి బాధితులకు న్యాయసేవలు అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా కోర్టుల్లో కేసులు పెండింగ్‌లో ఉంటున్నాయన్నారు. ప్రతి చిన్న సమస్యకు కక్షిదారులు, బాధితులు కోర్టులు, పోలీస్‌స్టేషన్లను ఆశ్రయించడం వల్ల పరిష్కారంలో కాలయాపన జరుగుతోందన్నారు. ఫలితంగా బాధితులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. న్యాయసేవల శిబిరాలలో అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు అందుబాటులో ఉంటారన్నారు. ఆయా శాఖల పరిధిలో దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిశీలించి అవసరమైతే అక్కడికక్కడే పరిష్కరిస్తున్నట్లు వివరించారు. సాంకేతిక కారణాల వల్ల పరిష్కారానికి నోచుకోని కేసులను తిరిగి న్యాయ విజ్ఞాన సదస్సుల్లో ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామన్నారు. ప్రజలు ఎలాంటి సమస్యలనైనా న్యాయ సేవ శిబిరం దృష్టికి తీసుకురావచ్చన్నారు. ఈ సందర్భంగా అధికారులు విద్యుత్ శాఖకు సంబందించిన రెండు కేసులను పరిష్కరించి బాధితులకు రూ.10 లక్షల పరిహారం అందించారు. భూతగదాలను పరిష్కరించారు. చంద్రన్న పెళ్లికానుకకు సంబంధించిన సమస్యను పరిష్కరించి లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. తర్వాత ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చిరుధాన్యాల ఎగ్జిబిషన్‌ను తిలకించారు.