అనంతపురం

దుండగుడి పైశాచికం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందూపురం, ఏప్రిల్ 19 : అనంతపురంలో తల్లిని హతమార్చి... హిందూపురంలో కూతురిని చంపేందుకు యత్నించాడు. అయితే చిత్రహింసలకు గురైన యువతి కొన ఊపిరితో బయటపడింది. పట్టణంలోని పశు సంవర్ధక శాఖ ఆసుపత్రి సమీపంలో ఉన్న ఓ లాడ్జిలో యువతిని అత్యంత కిరాతకంగా లైగింకంగా హింసించి హత్యాయత్నం చేసిన సంఘటన సంచలనం రేకెత్తించిన విషయం విధితమే. అయితే యువతి తల్లిని ఆ కిరాతకుడే అతి దారుణంగా అనంతపురంలో హత్య చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. యల్లనూరుకు చెందిన రామకృష్ణ అలియాస్ బాబు అలియాస్ కిట్టు అలియాస్ అబ్దుల్లా అనంతపురంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న ఓ యువతిని శనివారం అర్ధరాత్రి స్థానిక లాడ్జికు తీసుకొచ్చాడు. పొంతనలేని సమాచారాన్ని అందించి లాడ్జిలో గదిని అద్దెకు తీసుకున్నాడు. ఈ విషయంలో లాడ్జి నిర్వాహకులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. మరుసటి రోజు ఉదయం అల్పాహారంగా దోసెలు తీసుకురావాలని యువతి సిబ్బందికి చెప్పింది. అప్పటి నుంచి దాదాపు 16 గంటల పాటు ఆ గది వైపు లాడ్జి సిబ్బంది కనె్నత్తి చూడలేదు. అనుమానం వచ్చిన సిబ్బంది గది కిటికీలను తెరచి చూడగా యువతి అపస్మారక స్థితిలో పడి ఉండటం, వెంటనే గదిని తెరచి 108 అంబులెన్స్‌లో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేయగా దుండగుడు ఇచ్చిన చిరునామా సక్రమంగా లేకపోవడం పలు అనుమానాలకు దారి తీసింది. ఈ నేపథ్యంలో అనంతపురం అశోక్‌నగర్‌లోని ఓఇంట్లో బాధిత యువతి తల్లి మహబ్బీ (42) అత్యంత కిరాతకంగా హత్యకు గురైన విషయం మంగళవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేయగా హిందూపురంలోని లాడ్జిలో హత్యాయత్నానికి గురైన యువతి తల్లిగా నిర్ధారించారు. ఆ దుండగుడు ముందుగా గురువారం రాత్రి మహబ్బీని హతమార్చినట్లు సమాచారం. అనంతరం తల్లిని హత్య చేసిన విషయం బయటకు పొక్కనీయకుండా తనతో సన్నిహితంగా మెలుగుతున్న హతురాలి కుమార్తెను వెంట బెట్టుకుని బెంగళూరుకు వెళ్లి అక్కడి నుంచి శనివారం అర్ధరాత్రి హిందూపురంలోని లాడ్జికి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. ఇక్కడ యువతిని లైంగికంగా వేధించి చిత్రహింసలకు గురి చేసి హత్యాయత్నానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. యువతిని తల్లిని కూడా రామకృష్ణే హత్య చేశాడని నిర్ధారించి ప్రత్యేక పోలీసు బలగాలను రంగంలోకి దింపి దుండగుడిని అదుపులోకి తీసుకున్నారు. ఏదేమైనా తల్లిని హత్య చేసి కుమార్తెపై హత్యాయత్నానికి పాల్పడటం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఇకపోతే తల్లి హత్యకు గురైన విషయం ఇప్పటికీ స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న యువతికి స్పష్టంగా తెలియకపోవడం, తల్లి కడచూపునకు నోచుకోకపోవడం విషాదం.