అనంతపురం

బండిమోట్ ఆక్రమణల తొలగింపులో హైడ్రామా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందూపురం టౌన్, జూన్ 24 : పట్టణంలో మార్కెట్ నిర్మాణానికి ప్రధాన అడ్డంకిగా మారిన బండిమోట్ ఆక్రమణల తొలగింపు ఎట్టకేలకూ ఆదివారం ప్రారంభమైంది. ఇందులో భాగంగా ఉదయమే మున్సిపల్ సిబ్బంది పోలీసు బందోబస్తు మధ్య తొలగింపునకు శ్రీకారం చుట్టారు. అయితే బండిమోట్ స్థలంతోపాటు గ్రామకంఠం స్థలంలో ఉన్న దుకాణాలు తొలగిస్తున్నారంటూ, సర్వే సరిగ్గా జరగలేదంటూ అక్కడి వ్యాపారులు అడ్డుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా సర్వే హద్దులు నిర్ణయించడానికే హైడ్రామా కొనసాగింది. వ్యాపారుల ఆందోళనకు తోడు ఓ ఇద్దరు పోలీసు అధికారులు అత్యుత్సాహం చూపడం, సర్వే నిర్వహణలో జోక్యం చేసుకోవడంతో ఆక్రమణల తొలగింపు కొలిక్కి రాలేదు. దీనికి తోడు వ్యాపారులకు మద్దతుగా వైకాపా సమన్వయ కర్త నవీన్‌నిశ్చల్ తన అనుచరులతో బండిమోట్‌కు చేరుకుని ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిరు వ్యాపారులపై ప్రతాపం చూపడం తగదన్నారు. ఇదే మార్కెట్ స్థలంలో టీడీపీకి చెందిన నాయకుడి స్థలం ఎలా వదిలేశారని, ఒక్కొక్కరికి ఒక్కో రకమైన సర్వే ఉంటుందా, ఆయనేదమైనా ప్రైవేటు స్థలమా అంటూ ప్రశ్నించారు. అధికారులకు దమ్ముంటే పక్షపాత వైఖరి విడనాడి అన్ని ఆక్రమణలను తొలగించాలని, ఆతర్వాతే బండిమోట్ ఆక్రమణలను వ్యాపారులే తొలగించుకుంటారని సూచించారు. అయితే అధికారులు తమ పని తాము చేసుకుంటూ వెళ్లారు. సర్వే నిర్వహణలో పోలీసు జోక్యంతో వివాదం కొనసాగుతుండటంతో తహశీల్దార్ విశ్వనాథ్ స్వయంగా సర్వే చేయించి హద్దు చూపించారు. తప్పనిసరిగా ఎవరిమాట వినకుండా హద్దు వరకు ఆక్రమణలను తొలగించాలని మున్సిపల్ సిబ్బందికి సూచించారు. మున్సిపల్ కమిషనర్ భాగ్యలక్ష్మి ఉదయం నుంచి రాత్రి వరకు అక్కడే ఉండి ఆక్రమణల తొలగింపును పర్యవేక్షించారు. ప్రస్తుతం బండిమోట్ ప్రాంతంలో మాత్రమే ఆక్రమణలు తొలగిస్తున్నామని, గ్రామకంఠంలోని దుకాణాలను తొలగించడం లేదని తహశీల్దార్ స్పష్టం చేశారు. మధ్యాహ్నం తర్వాత ఆక్రమణల తొలగింపు ప్రారంభమయింది. పూర్తిగా ఆక్రమణలు తొలగించి మార్కెట్ నిర్మాణానికి సుగమమం చేయడానికి అధికారులు చర్యలు చేపట్టారు. దీంతో తొలగింపు కొనసాగుతోంది.
ప్రభుత్వ మెడలు వంచుతాం..
* ఎమ్మెల్యే విశే్వశ్వరరెడ్డి
పరిగి, జూన్ 24 : ప్రభుత్వ మెడలు వంచైనా పెనుకొండ నియోజకవర్గంలోని అన్ని చెరువులకు సాగునీరు అందిస్తామని ఉరవకొండ ఎమ్మెల్యే విశే్వశ్వర్‌రెడ్డి, నియోజకవర్గ వైకాపా సమన్వయ కర్త శంకరనారాయణ అన్నారు. వైకాపా మండలంలో చేపట్టిన రెండు రోజుల పాదయాత్ర ముగింపు సందర్భంగా పైడేటీ నుంచి పరిగి వరకు నాయకులు, కార్యకర్తలు పాదయాత్ర నిర్వహిస్తూ ప్రజా ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హంద్రీనీవా పూర్తి చేసి అన్ని చెరువులకు నీరు అందిస్తామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు రైతుల కష్టాలు, ప్రజల బాధలను ఏమాత్రం పట్టించుకోకుండా కాంట్రాక్టర్లతో బేరసారాలు చేసుకుంటున్నారని ఆరోపించారు. పనులను పూర్తి చేయడంలో ఏమాత్రం చిత్తశుద్ధి ప్రదర్శించడం లేదన్నారు. టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకే పాదయాత్ర నిర్వహించినట్లు తెలిపారు. 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా అధికారంలోకి రావడం తథ్యమన్నారు. వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే అన్ని వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించడంతోపాటు నవరత్నాల్లో పేర్కొన్న పథకాలను అమలు చేయనున్నట్లు తెలిపారు. అదేవిధంగా మోదా పంచాయతీ వైకాపా సేవాదళ్ నాయకులు మారుతీరెడ్డి ఆధ్వర్యంలో మోదా నుండి పరిగి వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు.