అనంతపురం

కిలో చికెన్ రూ.200!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, జూన్ 24: ఓవైపు కూరగాయలు, వంట నూనెల ధరలు పెరుగుతుంటే.. మరోవైపు చికెన్ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. మాంసాహారుల్లో అత్యధికంగా వినియోగించే కోడి మాంసం (చికెన్) ధర ఆకాశాన్నంటుతుండటంతో బెంబేలెత్తుతున్నారు. 20 రోజులుగా చికెన్ ధర పెరుగుతూ వస్తోంది. ఆదివారం డ్రెస్డ్ చికెన్ విత్ స్కిన్ కిలో రూ.200గా ఉంది. స్కిన్ లెస్ రూ.240 నుంచి రూ.250 వరకు విక్రయిస్తున్నారు. జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో అధిక శాతం చికెన్ వినియోగదారులు ఉండటంతో మండల కేంద్రాల కన్నా రూ.10, రూ.20 ఎక్కువ ధర ఉంటోంది. కొన్నిచోట్ల స్థానికంగా చిన్నచిన్న చికెన్ సెంటర్ల యజమానులు రవాణా ఖర్చులు, లాభాలు కలుపుకుని రూ.220 కూడా అమ్ముతున్నారు. అలాగే కోడిగుడ్లు కూడా డజన్ రూ.70కు చేరాయి. కొన్ని చోట్ల రూ.80కి కూడా అమ్ముతున్నారు. ఈ పరిస్థితుల్లో రిటైల్ వ్యాపారులు సైతం తక్కువగానే కోడిగుడ్లు తెచ్చుకుని తమ కిరాణా దుకాణాల్లో అమ్ముకుంటున్నారు. దీంతో చికెన్ వైపే వినియోగదారులు అధికంగా మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం నైరుతీ రుతుపవనాల ప్రభావంతో అడపాదడపా వర్షాలు కురుస్తూ వాతావరణం చల్లబడుతున్నా, కోళ్ల ఫారాల్లో ఉత్పత్తి ఇంకా పెరగలేదు. ఒక్కో చిక్ (కోడిపిల్ల) ఎదగానికి కనీసం 30 రోజులు పడుతుందని, కిలో నుంచి ఒకటిన్నర కిలో, ఆపైన బరువు పెరుగుతాయని, దీంతో చికెన్ డిమాండ్ ఇపుడిపుడే తగ్గే అవకాశం లేదని వ్యాపారులు అంటున్నారు. ఈ పరిస్థితుల్లో మరో 20 రోజుల పైబడి అధిక ధరలు కొనసాగవచ్చంటున్నారు. కోళ్ల ఫారాల వద్ద హోల్ సేల్ ధర ఒక్కో బర్డ్ (లైవ్) రూ.120 నుంచి రూ.130 వరకు ఉంటే, తమ వద్దకు వచ్చే సరికి లైవ్ బర్డ్‌ను రూ.156 వెచ్చించాల్సి వస్తోంది పీటీసీ వద్ద ఉన్న షాపింగ్ కాంప్లెక్స్‌లోని ఓ చికెన్ సెంటర్ యజమాని అన్నారు. ఇప్పటి వరకు ఇంత ధర ఎన్నడూ చూడలేదన్నారు. అయితే చికెన్ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నందున నామమాత్రపు లాభంతో కొనసాగిస్తున్నామన్నారు. అద్దెలు, వర్కర్ల జీతాలు, వృథా అయ్యే బర్డ్స్ వంటి వాటిని వేసవి సమయంలో భరించాల్సి ఉంటుందన్నారు. తక్కువ ధర ఉంటే ఎక్కువ విక్రయం ఉంటుందని తెలిపారు. ముఖ్యంగా జిల్లా కేంద్రంతో పాటు జిల్లా వ్యాప్తంగా పట్టణాలు, మండల కేంద్రాలకు సుగుణ, వెంకోబ్ వంటి ప్రముఖ కంపెనీలతో పాటు జిల్లాలోని కొన్ని కోళ్ల ఫారాలు, కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా బ్రాయిలర్ కోళ్లను దిగుమతి చేసుకుంటున్నారు. ఒక్క అనంతపురం నగరంలోనే నలుగురైదుగురు హోల్‌సేల్ వ్యాపారులు కోళ్లను ఫారాల నుంచి తీసుకొచ్చి రిటైలర్లకు విక్రయిస్తున్నారు. కొందరు హోల్‌సేల్ డీలర్లు కుందుర్పి, నాగేపల్లి గేట్, మడకశిరతో పాటు కర్ణాటకలోని చిక్‌బళ్లాపూర్, చిక్‌మంగళూర్, తదితర ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రానికి తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. ఒక్కో వాహనంలో సామర్థ్యాన్ని బట్టి ఒక టన్ను ఆపైన లైవ్ బర్డ్స్‌ను తెస్తున్నట్లు తెలుస్తోంది. రవాణా ఖర్చులతో పాటు వాహనాలు అద్దెలు, కూలీలకు, రోజువారీ మార్కెట్‌ను బట్టి లాభ శాతం వేసుకుని రిటైలర్లకు విక్రయిస్తున్నారు. కాగా ఇప్పటికే పెరిగిన ధరతో చికెన్ కొనుగోలు తగ్గించిన వినియోగదారులు, మరికొన్ని రోజుల పాటు ధరల తగ్గే వరకు జిహ్మ చాపల్యం చంపుకోవాల్సిందే మరి.