అనంతపురం

దిగజారిన స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందూపురం టౌన్, జూన్ 24 : ఓవైపు పట్టణాల్లో పారిశుద్ధ్య నిర్వహణకు సింగపూర్ తరహా చర్యలు చేపడుతున్నామంటూ ప్రభుత్వం జోరుగా ప్రకటనలు చేయడంతోపాటు ఎటు చూసినా ప్రచార బోర్డులు ఏర్పాటు చేసింది. అయితే క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్య నిర్వహణ అధ్వాన్నంగా మారిందని, చివరకు స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకుల్లోనూ తేటతెల్లమైంది. పారిశుద్ధ్య నిర్వహణకు తీసుకొచ్చిన జీఓ 279 పట్టణాల్లో గందరగోళంగా మార్చింది. పారిశుద్ధ్య నిర్వహణను ప్రైవేటుకు అప్పగించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టడం, ఇదే సమయంలో కార్మికులు ఆందోళనల పథంలో నడవడం, పారిశుద్ధ్య నిర్వహణకు స్వచ్చాంధ్ర కార్పోరేషన్ నుండి వచ్చిన ఆధునిక వాహనాలు క్షేత్రస్థాయిలో ఉపయోగపడే పరిస్థితి లేకపోవడంతో పారిశుద్ధ్య వ్యవస్థ నానాటికి దిగజారుతోంది. కోట్లాది రూపాయలు వెచ్చించి ప్రభుత్వం పంపిన స్వీపింగ్ మిషన్లు, చిన్న ప్రొక్లెనర్లు ఇతరత్రా పరికరాలు ఉపయోగం లేకుండా మున్సిపల్ కార్యాలయాల వద్ద దిష్టిబొమ్మలుగా మిలిగిలాయి. మరోవైపు ప్రభుత్వం పారిశుద్ధ్య పర్యవేక్షణ అమరావతి నుండి చేయడానికి పట్టణాల్లో గుర్తించిన బ్లాక్ స్పాట్‌లను మాత్రమే పారిశుద్ధ్య సిబ్బంది శుభ్రం చేసి మిగిలిన పట్టణాన్ని వదిలేస్తున్నారు. ఇది గుర్తించని ప్రభుత్వం పారిశుద్ధ్యం బాగు బాగు అని ప్రకటించుకొంటున్నా ఢిల్లీ నుండి వచ్చిన పర్యవేక్షణ బృందాలు మాత్రం క్షేత్రస్థాయి పరిస్థితిని తేటతెల్లం చేశాయి. గత ఏడాది స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకుల కన్నా జిల్లాలో అన్ని పట్టణాల్లోనూ దిగజారడం పరిస్థితికి అద్దం పడుతోంది. ఎప్పుడూ పారిశుద్ధ్య నిర్వహణలో ముందుండే తాడిపత్రికి సైతం 201 ర్యాంక్ రావడం గమనార్హం. జిల్లాలో గతేడాది స్వచ్ఛ సర్వేక్షణ్‌లో మంచి పురోగతి కనిపించినా ఈ ఏడాది ప్రకటించిన 2018 ర్యాంకుల్లో అన్ని పట్టణాల ర్యాంక్‌లు దిగజారాయి. జిల్లాలోని పట్టణాలు 200-300 మధ్య ర్యాంక్‌ల్లో నిలిచాయి. గతేడాది కొన్ని పట్టణాలను మాత్రమే సర్వేకు తీసుకుంటే ఈ ఏడాది ఏకంగా 4వేల పట్టణాలను దేశవ్యాప్తంగా సర్వే చేశారు. దీంతో పోటీ పెరిగి ర్యాంకులు దిగజారినట్లు అధికారులు భావిస్తున్నారు. జిల్లాలో తాడిపత్రికి 201, హిందూపురానికి 223, అనంతపురానికి 237, గుంతకల్లుకు 243, ధర్మవరానికి 262 ర్యాంకులు వచ్చాయి. ర్యాంకుల్లో దిగజారడంతో జిల్లాలో మున్సిపల్ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ ర్యాంక్‌లను ఎలా సమర్థించుకోవాలా అని ప్రయత్నాలు చేస్తున్నారు. మరో వైపు వచ్చే ఏడాది మంచి ర్యాంకులు సాధించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెబుతున్నారు.
యాదవులు అన్నిరంగాల్లో
అభివృద్ధి చెందాలి
* టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్‌యాదవ్
అనంతపురం సిటీ, జూన్ 24: రాష్ట్ర ంలోని యాదవు కులస్థులందరూ సా మాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో అ భివృద్ధి చెందాలని టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్‌యాదవ్ పిలుపునిచ్చారు. ఆ దివారం అఖిల భారతీయ యాదవ మహాసభ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ భవన్‌లో యాదవ సంఘం జి. నాగరాజు అధ్యక్షతన టీటీడీ ఛైర్మెన్ బుట్టా సుధాకర్ యాదవ్‌కు, టీటీడీ మెంబర్ బికె.పార్థసారథికి, కర్ణాటకలో ఎమ్మెల్యేగా గెలిచిన పూర్ణిమా శ్రీనివాస్‌యాదవ్‌కు, గొర్రెలు, మేకలు పెంపకం రాష్ట్ర చైర్మన్ నాగేశ్వరరావుకు ఆత్మీయ సన్మానం చేశారు. ఈ సందర్భంగా బుట్టా సుధాకర్‌యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో అధిక సంఖ్యలో యాదవులు, కురుబలు ఉన్నారని తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి యాదవులు సేవలందించే వారని, 47 సంవత్సరాలు తరువాత యాదవులను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గుర్తించి టీటీడీ ఛైర్మెన్‌గా నియమించడం చాలా సంతోషకరమన్నారు. రాష్ట్రంలోని యాదవులు, కురుబలకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు. యాదవులు ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాల్లో అభివృద్ధి చెందాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని యాదవుల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని తెలియజేసారు. రాబోవు రోజుల్లో యాదవ కులస్తులు మరిన్ని పదవులు చేపట్టేలా కులాన్ని ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. అంతకుముందు ఎమ్మెల్యే పార్థసారథి, గుండుమల తిప్పేస్వామి, గొర్రెల, మేకల పెంపకం రాష్ట్ర ఛైర్మెన్ నాగేశ్వరరావులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం యాదవులను, కురుబలను గుర్తించి అనేక సంక్షమే పథకాలను అమలుచేస్తోందని తెలిపారు. సంక్షేమ పథకాలను మన కులస్తులు సద్వినియోగం చేసుకుని ఆర్థిక, రాజకీయంగా అభివృద్ధి చెందాలని పిలుపునిచ్చారు. జిల్లాలోని యాదవులు చైతన్యవంతులై ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చెందాలని పిలుపునిచ్చారు. అనంతరం టీటీడీ ఛైర్మెన్ బుట్టా సుధాకర్ యాదవ్, మెంబర్ ఎమ్మెల్యే పార్థసారథి, కర్ణాటక ఎమ్మెల్యే పూర్ణిమా శ్రీనివాస్‌యాదవ్‌లను గజమాలతో ఘనంగా సన్మానించారు.

రాష్ట్రానికి ద్రోహం చేసిన బీజేపీ
* ఎంపీ నిమ్మల కిష్టప్ప
తనకల్లు, జూన్ 24: బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి నమ్మక ద్రోహం చేసిందని హిందూపురం పార్లమెంట్ సభ్యులు నిమ్మల కిష్టప్ప పేర్కొన్నారు. ఆదివారం మండల పరిధిలోని కొర్తికోటలో మదరసా భవన నిర్మాణానికి ఎంపీ నిమ్మల కిష్టప్ప, టీడీపీ కదిరి నియోజకవర్గ ఇన్‌చార్జి కందికుంట వెంకటప్రసాద్‌లు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ గత నాలుగేళ్ల బీజేపీ పాలనలో రాష్ట్రానికి ఒక్క అభివృద్ధి పథకానికి కూడా సహకరించడం లేదన్నారు. కలిసి బీజేపీతో పనిచేసి మోసపోయామని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చి ఏపీకి మాత్రం ప్రత్యేక హోదా ఇవ్వడంలో విఫలమయ్యారన్నారు. ఇందుకు కారణాలు అడిగినా నోరు మెదపడం లేదని తెలిపారు. అంతేకాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమస్యలపై 29సార్లు ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రికి సమస్యలు విన్నవించినప్పటికీ ఏ మాత్రం పట్టించుకోలేదని ఎద్దేవ చేశారు. బీజేపీ నాయకుడు విష్ణువర్థన్‌రెడ్డి 80 శాతం నిధులు ఏపీకి ఇచ్చారని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఆ బీజేపీ నాయకుడు టీవీల్లో, పత్రికల్లో కన్పించేందుకు మాత్రమే లేనిపోని మాటలు చెబుతుంటారని చెప్పారు. చంద్రబాబునాయుడు మనోధైర్యంతో కేంద్రం సహకరించకపోయినా రాష్ట్రం లోటు బడ్జెట్‌లో ఉన్నప్పటికీ పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత చంద్రబాబుకే దక్కిందన్నారు. రూ.200లు పెన్షన్‌ను రూ. 1000లకు పెంచి వృద్ధులను ఆదుకున్నారని తెలిపారు. అదేవిధంగా రాష్ట్రంలో అన్ని వర్గాల వారు అభివృద్ధి చెందేందుకు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. రాష్ట్రంలో వ్యవసాయం ముందు నిలబెట్టడానికి నదులు అనుసంధానం చేసి రైతులకు సాగు, తాగునీరు అందించిన ఘనత చంద్రబాబుకే దక్కిందన్నారు. అనంతపురం జిల్లాలో కరువుకాటకాలు లేకుండా కృష్ణా నది జలాలను ఇక్కడికి మళ్లించడం జరిగిందన్నారు. అంతేకాకుండా జిల్లాలో కియా కార్ల కంపెనీ పరిశ్రమ తీసుకురావడానికి చంద్రబాబు ఎంతో కృషి చేశారని, కియా కంపెనీకి కావాల్సిన నీటిని కూడా తెప్పించి కంపెనీ యజమానులకు చంద్రబాబు మేధస్సును మెచ్చుకునే విధంగా తెలియజేయడం జరిగిందన్నారు. అంతేకాకుండా రైతులకు విత్తన వేరుశెనగ రాయితీ, రుణాల మాఫీ, పంట రుణాలు ఇవ్వడం జరిగిందన్నారు. రాష్ట్భ్రావృద్ధి కోసం ముఖ్యమంత్రి అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు. కోట్ల రూపాయల నిధులతో ప్రతి గ్రామంలోనూ సిమెంట్, తారురోడ్లు వేయించడం జరిగిందన్నారు. రాష్ట్భ్రావృద్ధి కోసం కృషి చేస్తున్న చంద్రబాబుకు వచ్చే ఎన్నికల్లో మరోసారి ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. అనంతరం కదిరి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి కందికుంట మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలంటే 2019 ఎన్నికల్లో మళ్లీ చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాల్సిన అవసరం ఎంతైనావుందన్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి తెలుగుదేశం ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు గురించి ప్రజలకు వివరించాలని, టీడీపీలో కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందన్నారు. రాష్ట్భ్రావృద్ధికి సహకరించని బీజేపీ నాయకులను రాష్ట్రంలో తిరగనివ్వకుండా ప్రజలు తరిమికొట్టాలన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి బుద్ధి చెప్పాలని, లేదంటే దేశం అతలాకుతలం అయిపోతుందన్నారు.