అనంతపురం

సామూహిక వివాహాలకు పూరె్తైన ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామగిరి, ఏప్రిల్ 19: పరిటాల రవీంద్ర మెమోరియల్ ట్రస్టు ఆధ్వర్యంలో మంత్రి పరిటాల సునీత, తనయుడు పరిటాల శ్రీరామ్‌లు 21న ని ర్వహించే ఉచిత సామూహిక ఏర్పాట్లు తిరుమల దేవర ఆలయ ప్రాంగణం లో పూర్తి చేశారు. ముఖ్యంగా వివాహాలకు సంబంధించి ఒడి బియ్యం, తలంబ్రాల బియ్యం, వధూ వరులకు సంబంధించిన దుస్తులు తదితర సామాగ్రి మొత్తం తిరుమల దేవర గుడి దగ్గరకు చేర్చారు. ఇటీవల వెంకటాపురంలో పరిటాల సునీత ఇంటి వద్ద పచ్చని పందిర్లు వేసి సాంప్రదాయబద్ధంగా పరిటాల కుటుంబంలోని మహిళలు కలశం పట్టి ఒడి బియ్యాన్ని, తలంబ్రాల బియ్యాన్ని ఊరేగింపుగా తీసుకొచ్చారు. పరిటాల రవీంద్ర ఘాట్ వద్దకు వెళ్లి అక్కడ ఆశీస్సులు పొందారు. అనంతరం గ్రామంలోని యల్లమ్మ దేవాలయంలో కూడా పూజలు చేశారు. గ్రామ చివర వరకు ఊరేగింపుగా తీసుకొచ్చి అనంతరం వాటిని ట్రాక్టర్లలో వేసుకుని తిరుమల దేవర గుడికి చేర్చారు. ఈ వాహనాన్ని పరిటాల సునీత చిన్న కుమారుడు సిద్ధార్థ నడుపుతూ వాటిని తీసుకురావడం విశేషం. గురువారం ముఖ్యమంత్రి వచ్చినపుడు ఎలా వ్యవహరించాలి, ఎలాంటి బందోబస్తు తీసుకోవాలన్న అంశాలపై కూడా చర్చించారు. ఉదయం ఎస్‌పి రాజశేఖరబాబు ముఖ్యమంత్రి బందోబస్తు పర్యవేక్షణ అధికారి వచ్చి హెలీప్యాడ్, ముఖ్యమంత్రి వచ్చే రవాణామార్గం, పెళ్లిళ్ల వద్ద పెళ్లి జంటలను ఆశీర్వదించే ఏర్పాట్లు, పరిటాల రవీంద్ర విగ్రహావిష్కరణ, బహిరంగ సభ స్థలాలన్నింటిని పరిశీలించారు. ఏర్పాట్లపై వారు సంతృప్తి వ్యక్తం చేశారు. పెళ్లిళ్లకు అందరూ తరలివచ్చి విజయవంతం చేయాలని మంత్రి పరిటాల సునీత కోరారు. స్థానిక కార్యకర్తలు, పరిటాల అభిమానులతో సమావేశం ఏర్పాటు చేసి ప్రధానంగా భోజనశాల వద్ద జాగ్రత్తలు తీసుకోవాలని, 2 లక్షల మంది జనాభా వస్తారని అంచనా వేసుకున్నామని, అంతకంటే ఎక్కువ వచ్చినా ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ఏర్పాట్లు చూసుకోవాలన్నారు. వచ్చిన ప్రతి ఒక్కరికి భోజనం అందించాలన్నారు. వందకు పైగా కౌంటర్లు ఏర్పాటు చేసి భోజనాలు వడ్డించాలన్నారు. ప్రధానంగా ఎక్కడివారికి తాగునీరు సమస్య రాకుండా చూసుకోవాలన్నారు. 4 లక్షల వాటర్ ప్యాకెట్లు తెప్పించడం జరుగుతోందన్నారు. ప్రతి ఒక్కరూ పనిచేసే చోట బాధ్యతాయుతంగా వ్యవహరించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి సునీత, ఆమె తనయుడు పరిటాల శ్రీరామ్‌లు కోరారు.