అనంతపురం

కబ్జాకు గురైన స్థలాలను స్వాధీనం చేసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం కల్చరల్, ఆగస్టు 13: నాలుగేళ్ల టీడీపీ పాలనలో నగరంలో ఆ పార్టీ నాయకుల అవినీతి, ఆక్రమణలకు అడ్డూ అదుపూ లేకుండా పోయిందని వైకాపా నాయకులు పేర్కొన్నారు. వైకాపా యువజన విభాగం నగర శాఖ ఆధ్వర్యంలో సోమవారం తహశీల్దారు కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా యువజన విభాగం నగర అధ్యక్షులు వాసగిరి నాగ్ రాయల్ మాట్లాడుతూ నగరంలో కబ్జాకు గురైన ప్రభుత్వ, ప్రైవేటు స్థలాలను వెంటనే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలన్నారు. స్థానిక ఎమ్మెల్యే ప్రధాన అనుచరులైన నాయకులు ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి ఇంటిని నిర్మించుకున్నారన్నారు. కబ్జాకు గురైన స్థలాల్ని స్వాధీనం చేసుకోవాలంటూ తహశీల్దారుకు వినతిపత్రం సమర్పించారు.
నేడు నాగదేవతల నగరోత్సవం
అనంతపురం కల్చరల్, ఆగస్టు 13: నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని నేడు నాగదేవతల నగరోత్సవం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు కరణం వెంకటప్రసాద్ సోమవారం ప్రకటన ద్వారా తెలిపారు. టీటీడీ కల్యాణమండపంలో నాగులచవితి వేడుకలు జరుగుతాయని, ఇందులో భాగంగా భజన కార్యక్రమం, భక్తి గీతాల ఆలాపన ఉంటాయన్నారు. సాయంత్రం 4 గం.లకు నగరోత్సవం ప్రారంభమవుతుందన్నారు. నగరంలోని ప్రధాన కూడళ్లగుండా సాగే నగరోత్సవంలో కోలాటం, చెక్క్భజన, పండరి భజన, గొరవయ్యల నృత్యాలు, కీలుగుర్రాలు, ఉరుములు, బంజారాలు, డప్పు కళాకారులు తమ కళారూపాలను ప్రదర్శించనున్నట్లు తెలిపారు. అనంతరం టీటీడీ కల్యాణ మండపంలో శాస్ర్తియ నృత్య ప్రదర్శనలు, క్యాలెండరు, పుస్తకావిష్కరణ ఉంటాయన్నారు. ఈ కార్యక్రమాల్లో నగర భక్తులు పాల్గొనాలని ఆయన కోరారు.

వయో పరిమితి లేకుండా సబ్సిడీ రుణాలు ఇవ్వాలి
* ఏపీ ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు రామాంజినేయులు
అనంతపురం కల్చరల్, ఆగస్టు 13: రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు ఇస్తున్న సబ్సిడీ రుణాల మంజూరులో వయో పరిమితిని తొలగించాలని ఏపీ ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు రామాంజినేయులు డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ధర్నాలో ఆయన హాజరై ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న స్వయం ఉపాధి పథకం సబ్సిడీ రుణాల యూనిట్లను పెంచాలన్నారు. సామాజిక భద్రతా పింఛన్‌ను రూ.3000లకు పెంచాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న సమ్సిడీ రుణాలలో బ్యాక్ ఇన్ సబ్సిడీ విధానాన్ని జీవో నెం.32ను వెంటనే రద్దు చేయాలన్నారు. భవన నిర్మాణ కార్మికులకు ఏదైనా ప్రమాదం సంభవిస్తే రూ.2 లక్షల తక్షణసాయం అందించాలని, ఎటువంటి నిబంధనలు లేకుండా కార్పొరేట్ ఆసుపత్రిలో ఉచితంగా వైద్యమందించాలని, కార్మిక గుర్తింపు కార్డులు మంజూర చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.