అనంతపురం

ఆర్థికేతర సమస్యలను త్వరితగతిన పరిష్కరించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం సిటీ, ఆగస్టు 13: మీకోసంలో వచ్చే ప్రజా సమస్యలలో ఆర్థికేతర సమస్యల పరిష్కారం విషయంలో అధికార యంత్రాంగం బాధ్యతగా పనిచేసి త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ జి.వీరపాండ్యన్ అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లోని రెవిన్యూ భవన్‌లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో 322 వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో ప్రజల నుండి వచ్చే వినతులలోని పలు సమస్యలను సంతృప్తికరంగా పరిష్కరించాలని ఆదేశించారు. లేనిపక్షంలో లిఖిత పూర్వకంగా సరైన కారణాలతో వినతులను తిరస్కరించాలన్నారు. ప్రజలకు న్యాయం జరుగుతుందని ఎంతో నమ్మకంతో జిల్లా కేంద్రానికి అర్జీలను తీసుకొని వస్తున్నారని, వారి నమ్మకాన్ని నిలబెట్టాలని, ఆర్థికేతర సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలన్నారు.

గ్రామదర్శిని కార్యక్రమాన్ని విస్తృతంగా ముందుకు తీసుకెళ్లాలి
అనంతపురం సిటీ, ఆగస్టు 13: ప్రతి గురు, శుక్రవారాల్లో గ్రామదర్శిని కార్యక్రమాన్ని చేపట్టాలని, ఈ కార్యక్రమాన్ని గ్రామాల్లో విస్తృతంగా ముందుకు తీసుకెళ్లాలని కలెక్టర్ జి.వీరపాండ్యన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజావాణి అనంతరం గ్రామదర్శిని అమలుపై సంబందిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ నోడల్ అధికారి ఆధ్వర్యంలో ప్రజల సమక్షంలో గ్రామదర్శిని కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. ప్రతి నివాసిత గ్రామంలో ఈ కార్యక్రమం జరిగే విధంగా షెడ్యూల్ రూపొందించుకోవాలని ఆదేశించారు. రెండు నెలల లోపు అన్ని గ్రామాల్లో నిర్వహించాలన్నారు. అధికారులంతా ఈ కార్యక్రమానికి హాజరుకావాలన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యల పరిష్కారంతోపాటు ఆయా గ్రామాల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలును పరిశీలించాలన్నారు. రియల్ టైమ్ గవర్నెన్స్ ద్వారా ప్రతి గ్రామం, మండలం, నియోజకవర్గం, జిల్లాస్థాయి సంతృప్తి నివేదికలు లభ్యమవుతున్నాయన్నారు. రేషన్ షాపు ద్వారా సరుకుల పంపిణీ, పింఛన్ల పంపిణీ, గ్రామస్థాయిలో వీఆర్‌ఓ, పంచాయతీ సెక్రటరీ, అంగన్‌వాడీ వర్కర్లు, ఆశా వర్కర్లు, సాధికారమిత్ర, హార్టికల్చర్ ఆఫీసరు తదితరులు ఏకంగా పనిచేయాలన్నారు. వారి పనితీరుమీద ప్రజలు ఏ రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు అనే విషయాలన్ని ఈ నివేదికలో పొందుపరచి వుంటుందన్నారు. ఈ నివేదికను గ్రామ సభలో ప్రజలకు చదివి వినిపించాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలుపై సంతృప్తి శాతం పూర్తిస్థాయిలో పెరిగే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామదర్శిని యాప్‌ను వెంటనే డౌన్‌లోడ్ చేసుకోవాలన్నారు. గ్రామదర్శిని కార్యక్రమాన్ని అందులో అప్‌లోడ్ చేయాలన్నారు.

యుద్ధ ప్రాతిపదికన డిపాజిట్ సొమ్ము చెల్లించాలి
అనంతపురం సిటీ, ఆగస్టు 13: అగ్రిగోల్డ్ బాధితులకు యుద్ధ ప్రాతిపదికన డిపాజిట్ సొమ్మును చెల్లించి సత్వరమే న్యాయం చేయాలని అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక టవర్‌క్లాక్ వద్ద సామూహిక కేశఖండన చేయించుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు నారాయణప్ప, సీపీఐ నగర కార్యదర్శి ఎన్.శ్రీరాములు మాట్లాడుతూ మూడున్నర సంవత్సరాలుగా అగ్రిగోల్డ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అగ్రిగోల్డ్ ఆస్తులను స్వాధీనం చేసుకుని బాధితులకు న్యాయం చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా అనేక పోరాటాలు నిర్వహించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతి క్యాబినెట్ సమావేశంలో ఈ అంశంపై చర్చించి త్వరలోనే బాధితులకు న్యాయం చేస్తామని ప్రకటిస్తుందన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అగ్రిగోల్డ్ ఆస్తులను కీలక ప్రభుత్వ శాఖల అవసరాల నిమిత్తం ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్నారు. బాధితులు అగ్రిగోల్డ్ సంస్థలో డిపాజిట్ చేసిన చివరి రూపాయి అందే వరకు అసోసియేషన్ పోరాటం చేస్తుందని పేర్కొన్నారు.

బి.యాలేరులో అక్షర జ్యోతి
ఆత్మకూరు, ఆగస్టు 13: మండలంలోని బి.యాలేరు గ్రామంలో సోమవారం ప్రాథమిక పాఠశాలలో అక్షర జ్యోతి కార్యక్రమం నిర్వహించారు. అనంత త్రిశక్తి సేవా పీఠం ఆధ్వర్యంలో వేద పండితులచే చిన్నారులకు అక్షరాభ్యాసం నిర్వహించారు. పరిటాల రవీంద్ర మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బడిపిల్లలకు రూ.50 వేల విలువ గలిగిన నోటు పుస్తకాలు, ఆట వస్తువులు పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి కింద నలుగురికి చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ ఇన్‌చార్జి బాలాజీ, ఎంపీటీసీ చిన్నా (శంకరనారాయణరెడ్డి) మండల కన్వీనర్ సూరి, అనిల్‌చౌదరి, జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు నారాయణస్వామి, పాఠశాల అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.