అనంతపురం

టెండర్ వర్క్ నిబంధనల మేరకు చేస్తేనే బిల్లులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం టౌన్, ఆగస్టు 13: నగరంలోని 36వ డివిజన్ పరిధిలోని నీరు-ప్రగతి వనంలో టాయిలెట్ల నిర్మాణ పనులు నాసిరకంగా ఉండటంపై కమిషనర్ మూర్తి ఇంజినీర్లు, కాంట్రాక్టర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పర్యవేక్షించాల్సిన అధికారులు చేతులు ముడుచుకుని కూర్చుంటే పనులు నాసిరకంగా కాకుండా నాణ్యతగా ఉంటాయాయని నిలదీశారు. సోమవారం నీరు-ప్రగతి వనంలో నిర్మించిన టాయిలెట్లను కమిషనర్ పరిశీలించారు. టాయిలెట్ బేసిన్ అమరిక సరిగా లేకపోవటం, తూతూమంత్రంగా పెయింటింగ్ పనులు చేసి ఉండటం చూచి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈఈ మల్లికార్జునప్ప, డీఈఈ నరసింహా, ఏఈ అంజనీకుమార్‌ల పనితీరును కమిషనర్ తప్పుబట్టారు. ప్రజా ధనం వెచ్చించి చేస్తున్న పనులను ఇంజినీర్లు పర్యవేక్షించటం లేదన్న అంశాన్ని పనులే కళ్లకు కట్టినట్లు కనిపిస్తున్నాయని వారిని తూర్పారబట్టారు. టాయిలెట్ బేసిన్‌ను మార్చి, గోడలకు డిస్‌టెంపర్ పెయింటింగ్ వేసి అందంగా తీర్చిదిద్దకుంటే బిల్లులో ఒక్క రూపాయి కూడా చెల్లించబోనని ఇంజినీర్లకు, కాంట్రాక్టర్‌కు తేల్చి చెప్పారు. తర్వాత 35వ డివిజన్ పరిధిలో 20 లక్షల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న సిమెంటు రోడ్డు పనిని కమిషనర్ మూర్తి, డీఆర్‌ఓ రఘునాథ్‌తో కలిసి పరిశీలించారు. నగరపాలక సంస్థకు చెందిన ఓపెన్‌సైట్ హద్దుల వెంబడి నాటిస్తున్న పిల్లర్లను పరిశీలించారు.

శ్రీ కంఠం సర్కిల్‌లో ప్రధాన కాలువ పూడికతీత పనులు పరిశీలించిన కమిషనర్
అనంతపురంటౌన్, ఆగస్టు 13: నగరంలోని ప్రధాన కూడలియైన శ్రీ కంఠం సర్కిల్‌లో ప్రధాన కాలువ పూడికతీత పనులను సోమవారం రాజమండ్రి పనివారు ప్రారంభించారు. ఈ పనులను కమిషనర్ మూర్తి పరిశీలించారు. ఆయన వెంట ఏఈ హేమచంద్ర పాల్గొన్నారు. రద్దీ రోడ్డు కావటంతో కాలువలో తీసిన పూడిక మట్టిని, చెత్త చెదారాలను వెనువెంటనే ట్రాక్టర్లలోకి ఎత్తి తరలించే పనులు చేపట్టారు.