అనంతపురం

బీజేపీ బలోపేతానికి కన్నా కృషి చేస్తున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం సిటీ, ఆగస్టు 13: భారతీయ జనాతా పార్టీని రాష్ట్రంలో బలోపేతం చేయడానికి భాజాపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కృషి చేస్తున్నారని భాజాపా జిల్లా అధ్యక్షుడు జె.అంకాల్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం భాజాపా జిల్లా కార్యాలయంలో బీజేపీ అనంతపురం అర్బన్ బాధ్యులు జీఎన్‌ఎస్ లలిత్‌కుమార్ అధ్యక్షతన భాజాపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కోసి కార్యాలయంలోని బాధ్యులందరికి పంచిపెట్టారు. అనంతరం కార్యాలయం బయట బాణాసంచాను కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా అంకాల్‌రెడ్డి మాట్లాడుతూ కన్నా లక్ష్మినారాయణ భాజాపా రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తరువాత మొదటి పుట్టిన రోజు జరుపుకుంటున్నారని, అందులో భాగంగానే నేడు జిల్లా కార్యాలయంలో పుట్టిన రోజు జరుపుతున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను రాష్ట్రంలో పర్యటించి ప్రజలకు విస్తృత అవగాహన కల్పిస్తూ పార్టీ బలోపేతానికి కన్నా కృషి చేస్తున్నారని తెలిపారు. అలాగే ప్రధాని మోదీ, అమిత్‌షా, కన్నా స్ఫూర్తితో జిల్లాలో పార్టీ బలోపేతానికి తాము కృషి చేస్తామని తెలిపారు.