అనంతపురం

అజెండాలో అను‘బంధం’ లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురంటౌన్, ఆగస్టు 14: స్టాండింగ్ కమిటీ సమావేశానికి సంబంధించి సోమవారం అందచేసిన అజెండాలో అనుబంధం లేదు. ఎంత ముఖ్యమైనా సరే వాయిదా వేసి తర్వాతి సమావేశంలో చర్చించాలని కమిటీ సభ్యులు రాధమ్మ, హేమలత, లోక్‌నాథ్‌లు వాకౌట్ చేశారు. మంగళవారం స్థానిక కౌన్సిల్ హాలులో జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశం జరిగింది. సమావేశానికి మేయర్ స్వరూప అధ్యక్షత వహించారు. కమిషనర్ పీవీవీఎస్ మూర్తి, ఏసీపీ ఇషాక్, ఇంజనీరింగ్ అధికారులు, వివిధ విభాగాల సూపరింటెండెంట్లు హాజరయ్యారు. తొలుత హాజరైన సభ్యుల నుంచి రిజిస్టరులో సంతకాలు తీసుకున్నారు. తర్వాత సమావేశానికి హాజరైన వారికి అజెండా కాపీలు పంపిణీ చేశారు. సోమవారం కమిటీ సభ్యుల ఇళ్లకు రెండు అంశాలతో కూడిన అజెండాను అందచేశారు. దీనితో అజెండా చదవటం ప్రారంభించగానే కమిటీ సభ్యులు రాధమ్మ, హేమలత, లోక్‌నాథ్‌లు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. తమకు అందచేసిన అజెండా కాపీలలో అనుబంధం లేదని అన్నారు. కమిటీ సభ్యుల దృష్టికి తీసుకురాకుండానే అనుబంధాలు చేర్చటం, వాటిని సమావేశంలో పంపిణీ చేయటం అవమానించటమేనన్నారు. ఈ అంశాలను వాయిదా వేసి తర్వాతి సమావేశంలో చర్చించాలని డిమాండ్ చేశారు. దీనిపై కమిషనర్ ఆదేశాల మేరకు ఏసీపీ ఇషాక్ వివరణనిస్తూ ఎన్‌టిఆర్ మార్గ్‌కు సంబంధించి స్థలాలు కోల్పోయిన వారికి పరిహారం అందించాలని అన్నారు. దీనిపై ఎమ్మెల్యే సూచన మేరకు అత్యవసరంగా అజెండాలో చేర్చటం జరిగిందన్నారు. ఈ సమాధానంతో సంతృప్తి చెందని ముఖ్య నేత వర్గీయులు వాకౌట్ చేశారు. ఒక గ్రూపు సభ్యులు వాకౌట్ చేయటాన్ని సంబంధిత అధికారి ముఖ్య నేత దృష్టికి ఫోనులో తీసుకెళ్ళారు. వెంటనే వారికి ఫోనులో సమాచారం వెళ్ళటంతో వారు అయిష్టంగానే తిరిగి కొంతసేపటికి సమావేశానికి హాజరయ్యారు. సమావేశం ముగిసిన వెంటనే వారు సమావేశం నుంచి వెళ్ళిపోయారు. ఒకేసారి ముగ్గురు కమిటీ సభ్యులు వాకౌట్ చేయటంతో కోరం లేని పరిస్థితి ఏర్పడింది. వారు రిజిస్టరులో సంతకాలు చేసినందున కోరం ఉన్నట్టా, లేనట్టా అన్న మీమాంస ఎదురైంది. అయితే కొంతసేపటికి వాకౌట్ చేసిన సభ్యులు సమావేశానికి హాజరు కావటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.