అనంతపురం

ఉంతకల్లు రిజర్వాయర్‌కు నిధులు మంజూరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బొమ్మనహాల్, ఆగస్టు 14 : మండల పరిధిలోని ఉంతకల్లు గ్రామం వద్ద రూ.5 కోట్లతో నిర్మించనున్న రిజర్వాయర్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం అంగీకారం తెలిపినట్లు మంత్రి కాలవ శ్రీనివాసులు తెలిపారు. ఈమేరకు అమరావతి వెలగపూడి వద్ద ఉన్న కార్యాలయంలో చంద్రబాబు అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి ఫోన్‌లో మాట్లాడుతూ ఈ జలాశయం నిర్మాణం వల్ల తుంగభద్ర జలాశయం నుంచి బొమ్మనహాల్‌కు వచ్చే హెచ్‌ఎల్‌సీ నీటిని నిల్వ ఉంచి రైతులకు 2వ పంటను అందించేందుకు అవకాశాలు మెరుగుపడతాయన్నారు. అలాగే మండలంలోని సుమారు 10వేల ఎకరాలకు అదనంగా సాగు, తాగునీరు అందించాలన్న ప్రతిపాదనకు ముఖ్యమంత్రి చంద్రబాబు అంగీకరించి చిన్ననీటిపారుదల శాఖ అధికారులకు రూ.5కోట్లతో ప్రణాళికను సిద్ధం చేయాలని ఆదేశించినట్లు తెలిపారు.
14 మంది ఎస్‌ఐలు, సీఐలకు పదోన్నతులు

అనంతపురం, ఆగస్టు 14 : పోలీసు శాఖలో పదోన్నతుల కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్న సీఐలు, ఎస్‌ఐలకు ఎట్టకేలకు పదోన్నతులు లభించాయి. రాయలసీమ రీజియన్ పరిధిలో 2005, 2008, 2010 బ్యాచ్‌లకు చెందిన మొత్తం 43 మందికి పదోన్నతుల లభించాయి. వీరిలో అనంతపురం జిల్లా పోలీసు శాఖతో పాటు పోలీస్ ట్రైనింగ్ కాలేజ్, ఏపీ ట్రాన్స్‌కోలో పని చేస్తున్న 14 మంది పదోన్నతి పొందారు. మిగతా వారిలో కడప, కర్నూలు, చిత్తూరు, తిరుపతి పోలీస్ జిల్లాలకు చెందిన వారున్నారు. కాగా జిల్లాకు చెందిన వారిలో టీ.మధుసూదనరెడ్డి, కే.శ్రీనివాసులు (పీటీసీ), హమీద్‌ఖాన్, వెంకటేశ్వర్లు, ఎం.రామారావు, కే.శ్రీనివాసులు, జే.జయనానాయక్, కే.కృష్ణయ్య (పీటీసీ), ఐ.రవిశంకర్‌రెడ్డి, జీ.నిరంజన్‌రెడ్డి, ఎస్.శ్రీనివాసులు, బీ.శేఖర్, సీ.వెంకటేశ్‌నాయక్ ఉన్నారు.