అనంతపురం

ఉష్టవ్రాహనంపై దర్శనమిచ్చిన నెట్టికంటి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంతకల్లు, ఆగస్టు 14 : శ్రావణమాసం తొలి మంగళవారాన్ని పురస్కరించుకుని కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి ఉష్ట్ర వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఇందులో భాగంగా తెల్లవారుజామున స్వామివారికి సుప్రభాత సేవ, మహాభిషేకం, విశేష పుష్పలంకారాల అనంతరం విశేష పూజలు, భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం మహా నివేదన, మద్యాహ్నం మహామంగళ హారతి ఇచ్చారు. సాయంకాలం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దఎత్తున భక్తులు హాజరై మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిలో రామనామ, గోవింద నామస్మరణాలతో రాజగోపురం వద్ద ఏర్పాటు చేసిన ఒంటె వాహనంపై కొలువుదీర్చి ప్రాకారోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ దేముళ్లు, ఏఈఓ మధు, ఆలయ సూపరింటెండెంట్లు వెంకటేశ్వరులు, ఆలయ సిబ్బంది, ఆలయ ట్రస్టు బోర్డు చైర్మన్ సుగుణమ్మ, ట్రస్టు బోర్డు సభ్యులు పాల్గొన్నారు.
నెట్టికంటి హుండీ లెక్కింపు
కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి హుండీ ద్వారా రూ.36,96,810 లభించినట్లు ఆలయ ఇఓ దేముళ్లు తెలిపారు. మే 22 నుంచి ఆగస్టు 13వ తేదీ వరకూ హుండీ ద్వారా వచ్చిన ఆదాయాన్ని మంగళవారం ఆలయంలో భక్తుల సమక్షంలో లెక్కించారు. అదేవిధంగా 1.400 కిలోల వెండి, 5.700గ్రాముల బంగారు, అన్నదాన హుండీ ద్వారా రూ.2904 వచ్చినట్లు తెలిపారు.
స్వామి రథానికి వెండి విరాళం
నెట్టికంటి ఆంజనేయస్వామి వెండి రథనిర్మాణానికి గుంతకల్లుకు చెందిన పార్వతమ్మ, వెల్దుర్తి విశ్వనాథ్‌రెడ్డి మంగళవారం కిలో వెండి విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
నేమకల్లులో...
బొమ్మనహాల్ : శ్రావణమాసం మొదటి మంగళవారాన్ని పురస్కరించుకుని మండలంలోని నేమకల్లులో వెలసిన ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా స్వామివారికి వేదమంత్రాలతో పన్నీటి స్నానాలు ఆచరించి కుంకుమార్చనలు, తమలపాకుపూజ అనంతరం వెండి కవచం, సువర్ణ కిరీటంధారణ చేశారు. భక్తులు భారీగా తరలివచ్చినట్లు ఆలయ ఈఓ శ్రీనివాసులు తెలిపారు. భక్తులు ఉచిత ప్రసాదం, అన్నదానం, స్వామివారి చిత్రపటం, కుంకుమార్చనలు అందజేశామన్నారు. ఈకార్యక్రమంలో భక్తులు సజావుగా దర్శించుకోవడానికి కణేకల్లు, బొమ్మనహాల్ ఎస్‌ఐల ఆధ్వర్యంలో ప్రత్యేక విధులు నిర్వహించినట్లు ఆలయ ఇన్‌చార్జి అధికారి వెంకటరమణ, ఆనంద్ తెలిపారు.