అనంతపురం

నేడు పంద్రాగస్టు వేడుకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం కల్చరల్, ఆగస్టు 14: భారతమాత విదేశీ సంకెళ్ల నుండి విముక్తమై స్వేచ్ఛా, స్వాతంత్య్రాలను పొందిన పంద్రాగస్టు వేడుకలకు నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ ముస్తాబయ్యింది. 72వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం ఉదయం 9 గంటలకు స్థానిక పోలీసు పరేడ్ మైదానంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రివర్యులు, రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుచే జాతీయ పతాకావిష్కరణ గావించి, గౌరవ వందనాన్ని స్వీకరిస్తారని కలెక్టర్ జి.వీరపాండ్యన్ ఒక ప్రకటనలో తెలిపారు. 72వ స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమాల్లో స్థానిక పోలీసు పరేడ్ మైదానంలో ఉదయం 9 గంటల నుండి 9:20 గంటల వరకు జల వనరుల శాఖ మంత్రివర్యులు జాతీయ పతాకావిష్కరణ, గౌరవ వందనం స్వీకారం, 9:20 నుండి 9:40 గంటల వరకు మంత్రివర్యుల ప్రసంగం, అనంతరం స్వాతంత్య్ర సమరయోధుల పరిచయ కార్యక్రమం, అనంతరం వివిధ ప్రభుత్వ శాఖల శకటాల ప్రదర్శన, 9:50 గంటల నుండి 10:30 గంటల వరకు విద్యార్థినీ, విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు, 10:30 గంటలకు ప్రశాంసాపత్రాల ప్రదానం, 11 గంటలకు లబ్దిదారులకు పరికరాల పంపిణీ, సాయంత్రం 6 గంటలకు లలిత కళా పరిషత్‌లో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహణ జరుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమాలకు ప్రజలందరూ పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పరేడ్ మైదానంలోని ఏర్పాట్లను కలెక్టర్ వీరపాండ్యన్, ఆర్డీవో మలోలా, డీఎస్పీ సంబంధిత అధికారులతో కలసి పరిశీలించారు.

ఎస్పీకి ఇండియన్ పోలీస్ మెడల్ అవార్డు

అనంతపురం, ఆగస్టు 14 : జిల్లా ఎస్పీ జీవీజీ.అశోక్‌కుమార్‌కు ప్రతిష్ఠాత్మకమైన ఇండియన్ పోలీస్ మెడల్ అవార్డు దక్కింది. విధి నిర్వహణలో ఎస్పీ చేసిన ప్రతిభావంతమైన సేవలను గుర్తించి భారత ప్రభుత్వం ఈ అవార్డును ప్రకటించింది. 72వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఉత్తమ సేవలు, ప్రతిభావంతమైన విధుల నిర్వర్తించిన ప్రభుత్వ అధికారులను ప్రతి ఏటా ఈ అవార్డులను భారత ప్రభుత్వం ప్రకటించి అందిస్తోంది. ఇందులో భాగంగా ఎస్పీ జీవీజీ.అశోక్‌కుమార్‌ను ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖలో ఇండియన్ పోలీస్ మెడల్ ఎంపిక చేసింది. పోలీసు శాఖలో ఎస్పీ ప్రస్థానాన్ని పరిశీలిస్తే.. 1996లో డీఎస్పీగా ఎంపికైన జీవీజీ.అశోక్‌కుమార్‌కు శిక్షణానంతరం అనంతపురంలో ఓఎస్డీగా తొలి పోస్టింగ్ ఇచ్చారు. 2002లో ఇక్కడే అదే పోస్టులో ఉన్న ఆయనకు పదోన్నతి లభించింది. ఈ సందర్భంగా అనంతపురం అదనపు ఎస్పీగా పని చేశారు. అనంతరం గుంటూరు ఓఎస్డీగా బదిలీపై వెళ్లారు. అనంతరం 2004లో అదనపు ఎస్పీగా ఇంటెలిజెన్స్ విభాగంలో విధులు నిర్వర్తించారు. అక్కడ విధుల్లో ఉండగానే 2006లో ఎస్పీగా పదోన్నతి లభించడంతో ఈ హోదా ఇంటెలిజెన్స్ విభాగంలో కొనసాగారు. తర్వాత ఏడాది పాటు యునైటెడ్ నేషన్స్ పీస్ ప్రొటెక్షన్ (శాంతి పరిరక్షణ) దళంలో సుడాన్ దేశంలో ఏడాది పాటు పనిచేశారు. అక్కడి నుంచి వచ్చాక అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్‌లో ట్రాఫిక్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ)గా 2010 నుంచి 2012 వరకు విధులు నిర్వర్తించారు. ఆ సమయంలోనే 2011లో ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్) కన్ఫర్మ్ అయింది. 2012 తర్వాత చీఫ్ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ (సీవీఎస్‌ఓ)గా తిరుమల తిరుపతి దేవస్థానంలో పని చేశారు. అనంతరం 2013-14లో కడప ఎస్పీగానూ, 2014 నుంచి 2017 వరకు విజయవాడ డీసీపీ అడ్మిన్‌గానూ కొనసాగారు. తర్వాత గత ఏడాది (2017) జూలై 3న అనంతపురం జిల్లా ఎస్పీగా బదిలీపై వచ్చి విధుల్లో కొనసాగుతున్నారు. కాగా 2017లో జీవీజీ.అశోక్‌కుమార్‌కు కఠిన సేవా పతకం, 2010లో యునైటెడ్ నేషన్స్ పతకం లభించాయి.

జల ఫిరంగులను వినియోగించుకోండి
* రక్షక తడులకు పంట సంజీవని పరికరాలు * మైనర్ ఇరిగేషన్ కంపెనీలకు బాధ్యత

అనంతపురం, ఆగస్టు 14 : వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఎండుతున్న ఖరీఫ్ వేరుశెనగ పంటను కాపాడేందుకు జల ఫిరంగులను రైతులు వినియోగించుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ కోరింది. అలాగే రక్షక తడులు ఇచ్చే బాధ్యతను జిల్లాలోని మొత్తం 19 మైనర్ ఇరిగేషన్ పరికరాల తయారీ సంస్థలకు అప్పగించారు. ఇందుకు సంబంధించి మంగళవారం స్థానిక జిల్లా వ్యవసాయ కార్యాలయంలో కంపెనీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ఇన్‌చార్జి జేడీ హబీబ్‌బాషా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో ఎంఐ కంపెనీలకు 63 మండలాల బాధ్యతలను అప్పగించారు. బెట్ట ప్రాంతాల్లో పంట ఎండిపోకుండా అప్రమత్తంగా ఉండాలని కంపెనీల ప్రతినిధులను జేడీ ఆదేశించారు. ఆయా కంపెనీల ప్రతినిధులు జిల్లాలోని వ్యవసాయ శాఖ అధికారులు, ఏఈఓలు, ఎంపీఓలతో సమన్వయం చేసుకుని వారి సహకారంతో బెట్ట ఉన్న పంట పొలాలను గుర్తించి పంట సంజీవని పరికరాలను సంబంధిత రైతుల పొలాలకు చేర్చి రక్షక తడులు ఇచ్చి పంట కాపాడాలన్నారు. అలాగే రైతులు మండల కేంద్రాల్లో ఉనన పంట సంజీవని పరికరాలను సద్వినియోగం చేసుకుని రక్షక తడుల ద్వారా బెట్ట నుంచి పంటలు కాపాడుకోవాలని సూచించారు. ఇతరత్రా సమాచారం కోసం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూంలో సంపద్రించవచ్చని అధికారులు సూచించారు. ఇక పంట సంజీవని పరికరాలైన జల ఫిరంగులు(రెయిన్‌గన్స్), స్ప్రింక్లర్లు, నీటి పైపులు, ఆయిల్ ఇంజన్లకు ఏవైనా సాంకేతిక సమస్యలు ఉన్నట్లయితే వాటికి గుర్తించి తక్షణం స్పందించి మరమ్మతులు చేయాల్సి ఉంటుంది. అనంతరం వాటిని రైతుల పొలాలకు చేర్చి రక్షక తడులు ఇవ్వాలని మైనర్ ఇరిగేషన్ కంపెనీ ప్రతినిధులను వ్యవసాయ శాఖ అధికారులు కోరారు.