అనంతపురం

జిల్లా వ్యాప్తంగాభానుడి ప్రతాపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, ఏప్రిల్ 22:జిల్లాలో భానుడి భగభగలు కొనసాగుతూనే ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా ఉద యం నుంచే ప్రజలు ఇళ్లలోంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు. గురువారం అనంతపురం జిల్లాలో సగటు ఉష్ణోగ్రత 40.8 డిగ్రీల సెల్సియస్‌గా నమోదు కాగా జిల్లా కేంద్రమైన అనంతపురంలో 42.5 డిగ్రీల సెల్సియస్‌గా నమోదు అయ్యింది. జిల్లాలోని తాడిపత్రి మండలంలో అత్యధికంగా 44.5 డిగ్రీల సెల్సియస్‌గా నమోదు కాగా జిల్లాలోని సుమారుగా 80 ఆటోమేటిక్ వెదర్‌స్టేషన్‌లలో 40 డిగ్రీల సెల్సియస్ పైబడి ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.

స్వచ్ఛ విద్యాలయ అవార్డు
..జిల్లా ప్రజలకు అంకితం
అనంతపురం, ఏప్రిల్ 22:పదవ సివిల్ సర్వీసెస్ డే సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ నుంచి అందుకున్న స్వచ్ఛ విద్యాలయ అవార్డును జిల్లా ప్రజలకు అంకితమిస్తున్నానని కలెక్టర్ కోన శశిధర్ తెలిపారు. స్వచ్ఛ విద్యాలయ జాతీయస్థాయి ప్రథమ బహుమతిని ప్రధానమంత్రి చేతుల మీదుగా న్యూఢిల్లీలో గురువారం అందుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని కలెక్టరేట్‌లోని రెవెన్యూభవన్‌లో శుక్రవారం కలెక్టరు కోన శశిధర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణంలో దేశంలోనే ప్రథమస్థానంలో జిల్లా నిలవడంతో ఈ అవార్డు దక్కిందన్నారు. దేశవ్యాప్తంగా స్వచ్ఛ విద్యాలయ అవార్డుకు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని అనంతనాగ్, దాద్రానగర్ హవేళి, అనంతపురం జిల్లా మాత్రమే ఎంపిక అయ్యాయన్నారు. ఆగస్టు 10 నాటికి ప్రతి పాఠశాలలో ఒక మరుగుదొడ్డి ఉండాలని ప్రధానమంత్రి ఆదేశించారన్నారు. ఆడపిల్లలకు న్యాయం చేసే ఒక మంచి అవకాశంగా భావించి పాఠశాల అధికారులే కాక పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యుఎస్, హౌసింగ్, మునిసిపాలిటీ, గ్రామీణ వౌళిక వసతుల శాఖ వంటి శాఖలను సైతం ఇన్‌వాల్వ్ చేశామన్నారు. మొత్తం 3884 మరుగుదొడ్లు నిర్మించామన్నారు. మన రాష్ట్రంలోని చిత్తూరు, గుంటూరు, అనంతపురం, శ్రీకాకుళం, కృష్ణ లాంటి ఏడు జిల్లాలు పోటీ పడగా నాలుగు కేటగిరీలు స్వచ్ఛ భారత్, స్వచ్ఛ విద్యాలయ, ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన, భూసార కార్డు పథకం కింద అవార్డులను ప్రధానమంత్రి అందజేశారన్నారు. మన జిల్లాకు స్వచ్ఛ విద్యాలయ పథకం కింద ప్రథమ బహుమతి వచ్చిందన్నారు. జిల్లాలోని పాఠశాలల్లో 1501 మరుగుదొడ్లను ప్రత్యేకించి ఆడపిల్లల కోసం తెలిపారు. పాఠశాలల్లో మరుగుదొడ్లను నిర్మించడం ద్వారా డ్రాపౌట్లను నిర్మూలించవచ్చన్నారు. అసలు అవార్డు కోసం పనిచేయలేదని అవార్డు వస్తుందని కానీ ఊహించలేదన్నారు. ఈ అవార్డు జిల్లాకు రావడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. పాఠశాలల్లో శానిటరీ వర్కర్లు ద్వారా మెయిన్‌టెనెన్స్ చేస్తున్నాలన్నారు. 2100 పాఠశాలల్లో శానిటరీ వర్కర్లు, 281 పాఠశాలల్లో నర్సరీలు, 860 పాఠశాలల్లో మన సేవకుల ద్వారా నర్సరీలను పెంచుతున్నామన్నారు. మన జిల్లా గురించి దేశ రాజధానిలోఢిల్లీలోగొప్పలు చెబుతుంటే ఆనందంగా ఉందన్నారు. విద్యకు సంబంధించి పైలెట్ ప్రాజెక్టులు ఉంటే మన జిల్లాకు కేటాయించాలని కోరామన్నారు. జిల్లాలోని పాఠశాల శుభ్రం చేసేందుకు బడి ప్రారంభానికి వారం ముందే స్పెషల్ డ్రైవ్‌ను చేపడుతున్నామన్నారు. ఈ అవార్డు పొండానికి కృషి చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎస్‌ఎ పివోదశరథరామయ్య, డిఈఓ అం జయ్య, ఆర్‌డబ్ల్యుయస్ ఎస్‌ఈ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

24న సత్యసాయి ఆరాధనోత్సవాలు
* ఆర్‌జె.రత్నాకర్
పుట్టపర్తి, ఏప్రిల్ 22: ఈ నెల 24న సత్యసాయి ఆరాధనోత్సవాలు నిర్వహిస్తున్నట్లు సత్యసాయి ట్రస్టు సభ్యులు ఆర్‌జె.రత్నాకర్ తెలిపారు. శుక్రవారం ప్రశాంతినిలయంలోని తన కార్యాలయంలో ఈ మేరకు ఆయన వివరాలు వెల్లడించారు. భగవాన్ సత్యసాయి బాబా ఆరాధనోత్సవాలను 24న ఉదయం 7:30గంటలకు వేదపారాయణంతో ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ప్రపంచ నలుమూలల నుండి ఆరాధనోత్సవాల్లో పాల్గొనే అశేష భక్తజనానికి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లను చేస్తున్నట్లు తెలిపారు. వేసవిని దృష్టిలో వుంచుకుని 8-9గంటల మధ్యలో ఉదయానే్న సత్యసాయి హిల్‌వ్యూ స్టేడియంలో అన్నవస్తద్రాన, నారాయణసేవ చేస్తున్నట్లు తెలిపారు. సాయికుల్వంత్ సభామందిరంలో అదేరోజు పంచామృత సంగీత విభావరి, వివిధ ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సత్యసాయి ఆరాధనోత్సవాల్లో పాల్గొనేందుకు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు విచ్చేస్తున్నట్లు తెలిపారు. సత్యసాయి మహాసమాధిని దర్శించుకుని ఇక్కడ జరిగే కార్యక్రమాల్లో పాల్గొని సత్యసాయి విద్యాజ్యోతి పథకం గురించి మంత్రి వెంకయ్యనాయుడు ప్రసంగిస్తారన్నారు. సత్యసాయి ట్రస్టు ఆరాధనోత్సవాల ఏర్పాట్లలో నిమగ్నమైనట్లు ఆర్‌జె.రత్నాకర్ తెలిపారు.

సిఎం దిష్టి బొమ్మదగ్ధం
గుంతకల్లురూరల్, ఏప్రిల్ 22:కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను అరవలంబిస్తున్న ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని సిఐటియు జిల్లా కార్యదర్శి దాసరి శ్రీనివాసులు పేర్కొన్నారు. పరిగి మండలం ఎస్‌ఏ రావతార్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న 183 మందికార్మికులను విధుల నుండి తొలగించడాన్ని నిరసిస్తూ శుక్రవారం సిఐటియు నాయకులు ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మాట్లాడుతూ పరిగి మండలం ఎస్‌ఎ రావతార్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లిన సిఐటియు నాయకులపై చిలమత్తూరు ఎంపిపి తన అనుచరులతో దాడి చేయించారన్నారు. నాయకులపై దాడి జరుగుతున్నప్పటికి పోలీసులు స్పందించక పోగా తిరిగి సిఐటియు నాయకులను అరెస్టు చేయడం అమానుషమన్నారు. సిపిఎం పట్టణ కార్యదర్శి డి. శ్రీనివాసులు, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు శ్యాముల్, రామాంజినేయులు, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు అబ్దుల్ బాసిద్, మహేష్, గురుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.