అనంతపురం

దమ్ముంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నంబులపూలకుంట, ఏప్రిల్ 24: తెదేపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చేసిన అభివృద్ధి పనులను చూసి వైకాపా ఎమ్మెల్యేలు తెదేపాలోకి చేరుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్నారని దమ్ముంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలతో పదవికి రాజీనామా చేయించి పోటీలో గెలుపొందాలని సిపిఎం జిల్లా అధ్యక్షులు రాంభూపాల్ పేర్కొన్నారు. ఆదివారం జవుకల గ్రామంలోని నాగిరెడ్డి స్వగృహంలో విలేఖరుల సమావేశంను ఏర్పాటు చేశారు. ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను చూసి ఎమ్మెల్యేలు పార్టీలు మారడం లేదని, కేవలం ఎమ్మెల్యేలకు డబ్బులు ఎర చూపి కొనుగోలు చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా అధ్యక్షులు రాంభూపాల్, జిల్లా నాయకులు కొండారెడ్డి, డివిజన్ నాయకులు నరసింహులు, సుబ్బిరెడ్డి, మండల నాయకులు రామ్మోహన్, నాగరాజు, నాగిరెడ్డి పాల్గొన్నారు.
పేదల అభివృద్ధి కోసం పని చేస్తాం
పేదల పక్షాన పోరాటం చేస్తున్న సిపిఎంలో చేరి పేదల అభివృద్ధి కొరకు పని చేయడమే తమ కర్తవ్యమని జవుకుల గ్రామానికి చెందిన సిపిఎం కార్యకర్తలు జిల్లా అధ్యక్షులు రాంభూపాల్ కు వివరించారు. ఆదివారం మండలంలోని మర్రికొమ్మదినె్న పంచాయతీ జవుకల గ్రామానికి చెందిన నాగిరెడ్డి, అతని అనుచరులతో సిపిఎంలోకి చేరారు. సిపిఎంలోకి చేరిన జవుకల గ్రామస్తులను జిల్లా అధ్యక్షులు రాంభూపాల్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తమ గ్రామంలో ఎంతోమంది పేదలు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇప్పించాలని ప్రజలు సిపిఎం నాయకులకు దృష్టికి తీసుకెళ్ళారు. సాగు చేసుకుంటున్న ప్రతి పేద రైతుకు పట్టాలు ఇప్పించే వరకు రైతుల పక్షాన సిపిఎం పోరాటం చేయడానికి సిద్దంగా వుం దన్నారు. ఎన్నికల సమయంలో రైతులకు కల్లబొల్లి మాటలు చెప్పే పార్టీల వైపు ప్రజలు చూడడం లేదని, ప్రజల పక్షాన పోరాటం చేసే పార్టీల వైపు చూస్తున్నారన్నారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా అధ్యక్షులు రాంభూపాల్, నాయకులు కొండారెడ్డి, డివిజన్ నాయకుల బడాసుబ్బిరెడ్డి, మండల నాయకులు రామ్మోహన్, నాగరాజు, నాగిరెడ్డి, మహేశ్వరరెడ్డి, నారాయణరెడ్డి, శ్రీరాములు పాల్గొన్నారు.