అనంతపురం

కన్నుల పండువగా..కుళ్ళాయి స్వామి గ్రామోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నార్పల, సెప్టెంబర్ 21 : మొహర్రం సందర్భంగా గూగూడు కుళ్ళాయి స్వామి ఉత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. కుళ్ళాయి స్వామి, ఆంజనేయ స్వామి తిరునాళ్లు నిర్వహిస్తున్నారు. శుక్రవారం గ్రామోత్సవం ఘనంగా జరిగింది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వేలాది మంది భక్తులు కుళ్లాయి స్వామి పీర్ల దర్శనం కోసం బారులుతీరారు. మకాన్ కుడివైపు వున్న పురాతన ఆంజనేయ స్వామి దేవాలయంలో హిందూ, ముస్లింలు హనుమాన్ చాలిసా పూజలు చేశారు. ఆలయం ఎదుట, పురవీధుల్లో సన్నాయి నాదస్వరాలు, తప్పెట్లమోతతో మసిఫక్కీరు, పులి వేషదారుల అడుగుల సవ్వడితో హోరెత్తింది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, తమిళనాడు, గోవా ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి ఉత్సవమూర్తులకు బంగారు ఆభరణాలు, వెండి గొడుగులు, రంగురంగు పూల గజమాలలు తీసుకొచ్చి మొక్కుబడి తీర్చుకున్నారు. సాయంత్రం నార్పల-గూగూడు రోడ్డుపై రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించి పోయింది. పది రోజులుగా మకాన్ మందిరాల్లో బకవైపు ఖరాన్ పఠనాలతో ఫాతెహా(పూజలు), మరోవైపు వేద పండితుల మంత్రోచ్ఛారణల పురాణ పఠనాలతో కన్నుల పండువగా ఉత్సవాలు జరుగుతున్నాయి. పీర్ల అగ్నిగుండం ప్రవేశం తిలకించడానికి వచ్చిన భక్తులు ఆరుబయట బీడు భూముల్లో విడిది చేశారు. ఆర్‌టీసీ సంస్థ ధర్మవరం, తాడిపత్రి, అనంతపురం, కదిరి డిపోల నుంచి 250 ప్రత్యేక సర్వీసులను ఏర్పాటు చేసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ప్రొద్దుటూరుకు చెందిన భక్తులు అన్నదానం చేశారు. శనివారం వేకువజామున స్వామివారు అగ్నిగుండం ప్రవేశం, పురవీధుల్లో పీర్ల ఊరేగింపుకి దేవాదాయ శాఖ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంది.