అనంతపురం

ఆయకట్టు భూములకు నీరివ్వాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం కల్చరల్, సెప్టెంబర్ 24: శింగనమల ఆయకట్టు భూములకు నీరివ్వాలని విప్ యామినీ బాల, ఎమ్మెల్సీ శమంతకమణి డిమాండ్ చేశారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఆయకట్టు భూముల రైతులు దగాకు గురవుతున్నారని వారు మండిపడ్డారు. నియోజకవర్గ పరిధిలోని హెచ్చెల్సీ ఆయకట్టు భూములకు 120 రోజులు నీరివ్వాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్‌లో సోమవారం ధర్నా నిర్వహించారు. రైతులతో కలసి విప్, ఎమ్మెల్సీ మూడు గంటలపాటు రెవెన్యూ భవన్ ముందు బైఠాయించి, నీటిపారుదల శాఖ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఖచ్చితమైన హామీ ఇచ్చే వరకు ఇక్కడి నుండి కదిలేది లేదన్నారు. మీకోసం కార్యక్రమానికి హాజరైన చీఫ్ విప్ పల్లె రఘునాథరెడ్డి జేసీ డిల్లీరావుతో కలసి వచ్చి వారితో మాట్లాడారు. అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అయినప్పటికీ వారు వినకపోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. అధికార పార్టీకి చెందిన వారే ఆందోళనకు దిగడంతో ఉత్కంఠ నెలకొంది. ఈ సందర్భంగా యామినీ బాల మాట్లాడుతూ నియోజకవర్గంలోని ఆయకట్టు రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. గత్యంతరం లేని పరిస్థితిలో ఆందోళన చేయాల్సి వచ్చిందన్నారు. 120 రోజులు నీరు సరఫరా చేసేందుకు ఖచ్చితమైన హామీ ఇచ్చేంత వరకు ఆందోళన విరమించేది లేదంటూ అక్కడే బైఠాయించారు. నాలుగేళ్లుగా తమకు దామాషా ప్రకారం రావాల్సిన నీరు రావడం లేదన్నారు. కరవు జిల్లాను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో కృషి చేస్తున్నా, అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. నీటిపారుదల శాఖ అధికారులతో మాట్లాడిన అనంతరం డిల్లీరావు 90 రోజులు వరకు నీరు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. దీనితో వారు ఆందోళన విరమించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వీ.రాంభూపాల్, రైతు సంఘం నాయకులు చంద్రశేఖరరెడ్డి, పార్టీ నాయకులు ఆంజనేయులు, కదిరప్పలు హాజరై మద్దతు తెలిపారు.