అనంతపురం

జి.ఓ 279 రద్దుకై మంత్రి కాలువ ఇంటి ముట్టడికి కార్మికుల యత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురంటౌన్, అక్టోబర్ 15: గడచిన 12 రోజులుగా నిరవధిక సమ్మె కొనసాగిస్తున్న పారిశుద్ధ్య కాంట్రాక్ట్ కార్మికులు సోమవారం నగరంలోని మంత్రి కాలువ శ్రీనివాసులు ఇంటి ముట్టడికి యత్నించారు. వారి ప్రయత్నాలను నిరోధించే క్రమంలో పోలీసులు, కార్మికుల నడుమ తోపులాట చేసుకుంది. మహిళా కార్మికులు పోలీసుల చర్యలను అడ్డుకునే క్రమంలో వారిని రౌండప్ చేశారు. దీనితో మహిళా కార్మికులు, పోలీసుల నడుమ వాదులాట జరిగింది. ఈ ఘటనల క్రమంలో మంత్రి ఇంటి వద్ద కొంత ఉద్రిక్తత నెలకొంది. జి.ఓ.279 రద్దు చేయాలని, కార్మికుల పొట్టగొడితే ప్రభుత్వం మట్టికొట్టుకుపోతుందని, కనీస వేతనాలు అమలుచేయాలని, కార్మికులను రెగ్యులరైజ్ చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కార్మిక సంఘ జేఏసీ ఆధ్వర్యంలో మంత్రి కాలువ శ్రీనివాసులు ఇంటి ముందు బైఠాయించిన వామపక్ష, వైకాపా నేతలను వెళ్ళిపోవాలని సూచించారు. అయితే వారు పోలీసుల మాట పెడచెవిన పెట్టటంతో బైఠాయించిన నేతలను లాగిపారేశారు. మొరాయించిన వారిని ఎత్తుకెళ్ళి వాహనాలలోకి ఎత్తివేశారు. అరెస్టు చేసిన వారిని పోలీసు స్టేషన్లకు తరలించారు. దీనితో మహిళా కార్మికులే పోలీసులతో వాదులాటకు దిగారు. మహిళా పోలీసులతో వారిని అరెస్టు చేసి వాహనాలతో పోలీసు స్టేషన్లకు తరలించారు. కార్మిక సంఘ నేతలు మాట్లాడుతూ 12 రోజులుగా కార్మికులు నిరవధిక సమ్మె చేస్తుంటే అటు ప్రభుత్వంలోకాని ఇటు ఎమ్మెల్యేలు, అధికారులలోకాని చలనం లేదన్నారు. సమ్మెను విరమింప చేయటానికి నేతలు చొరవ చూపకపోవటం దురదృష్టకరమన్నారు. మంత్రి కాలువ శ్రీనివాసులుకు కార్మికుల సమస్యను తీసుకెళ్ళటానికి శాంతియుతంగా ర్యాలీగా వచ్చామన్నారు. అయితే సమస్యలు పరిష్కరించటానికి చొరవ చూపకపోగా కార్మికుల సమ్మెను అణచివేసేలా ప్రభుత్వం పోలీసులను పురమాయించటం హేయమైన చర్యయని అన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కరించే వరకూ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.