అనంతపురం

మీకోసంలో వచ్చే సమస్యలను పరిష్కరించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం సిటీ, అక్టోబర్ 22: మీకోసంలో వచ్చే ప్రజా ఫిర్యాదుల త్వరితగతిన పరిష్కరించాలంటూ సంబంధిత శాఖాధికారులను కలెక్టర్ జీ.వీరపాండ్యన్ అధికారులను ఆదేశించారు. సోమవారం మీకోసం సందర్భంగా కలెక్టరేట్‌లోని రెవిన్యూ భవన్‌లో వివిధ గ్రామాల నుండి వచ్చిన ప్రజల నుండి అధికారులు 241 వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వీరపాండ్యన్ మాట్లాడుతూ ప్రజావాణిలో ప్రజల నుండి వచ్చే వినతులలోని పలు సమస్యలను సంతృప్తికరంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. లేనిపక్షంలో లిఖితపూర్వకంగా సరైన కారణాలతో వినతులను తిరస్కరించాలన్నారు. ప్రజలు న్యాయం జరుగుతుందని ఎంతో నమ్మకంతో జిల్లా కేంద్రానికి అర్జీలను తీసుకొని వస్తారని, వారి నమ్మకాన్ని నిలబెట్టాలన్నారు. అధిక సంఖ్యలో వినతులు పింఛన్ల పంపిణీ, రేషన్ కార్డులు, ఇంటి నివేశిత పట్టాలు, వివిధ కార్పొరేషన్లలో రుణాలు తదితర విషయాలపై ప్రజల నుండి స్వీకరించారు.