అనంతపురం

‘ఫార్మసీ’ బాధలు ఇంతింత కాదయా..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, అక్టోబర్ 22 : జిల్లాకు పెద్ద దిక్కుగా ఉన్న అనంతపురంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి ఓపీ విభాగంలో రోగులకు ఏదో రూపంలో పాట్లు తప్పడం లేదు. ముఖ్యంగా ఫార్మసీ విభాగం పట్ల జిల్లా అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు చూపుతున్న నిర్లక్ష్యం, ఉదాసీనతతో ఓపీ రోగులు మందులు పొందేందుకు నిత్యం నానా తంటాలు పడుతున్నారు. అసలే సీజనల్ వ్యాధులు చుట్టుముడుతుండటంతో జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు వ్యాధిగ్రస్తులతో నిండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో సర్వజన ఆస్పత్రి సైతం రోగులతో జాతరను తలపిస్తోంది. ఇదే తరుణంలో ఓపీ రోగులకు వైద్యులు రాసే మందుల కోసం వందలాది మంది క్యూ కడుతున్నారు. వీరిలో వృద్ధులు, పిల్లలు, మహిళలు అధిక సంఖ్యలో ఉంటున్నారు. ఫార్మసీ విభాగం ఓపీ విభాగాల వద్ద ఏర్పాటు చేయడంతో అధిక రద్దీతో తోపులాటలు, గొడవలు షరామామూలయ్యాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఓపీ విభాగానికి నిత్యం 2,200 మందిపైగా వివిధ వ్యాధులు, రుగ్మతలతో రోగులు వస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం 12.30 గంటలకు 2,748 మంది రోగులు నమోదయ్యారు. వీరిలో జ్వర పీడితులు, దగ్గు, జలుబుతోపాటు కీళ్ల నొప్పులు, ఎముకల సంబంధ బాధలున్న, రక్తపోటు, మధుమేహం, చర్మవ్యాధిగ్రస్తులు, కంటి జబ్బులున్న వారు అధికంగా వస్తున్నారు. వీరందరిలోనూ జనరల్ మెడిసిన్ అవసరమైన రోగులు సుమారు 600 మంది పైబడే నిత్యం ఉండటం పరిపాటి. వీరందరూ ఆయా విభాగాల్లో వైద్యులు రాసిన ఔషధాలు (మందులు) కోసం ఫార్మసీ విభాగానికి వస్తారు. ఓపీ పనివేళల్లో ఉదయం 8 నుంచి ప్రారంభమయ్యే ఫార్మసీ విభాగం మధ్యాహ్నం 2 గంటల వరకు పనిచేస్తుంది. ఉదయం 10 గంటలు దాటిందంటే చాలు రోగులు క్యూ కట్టడం మొదలవుతుంది. దీంతో రద్దీ అధికం కావడంతో వేగంగా మందులు పంపిణీ చేయడానికి ఫార్మసిస్టులు (గ్రేడ్-2) తిప్పలు పడుతున్నారు. సిబ్బంది కొరత కారణంగా రద్దీకి అనుగుణంగా మందుల్ని ఇవ్వడానికి శత విధాలా ప్రయత్నం చేయడం నిత్యం వారికో యుద్ధంలాంటిదనే చెప్పాలి. ఈ పరిస్థితుల్లో చాంతాడంత క్యూలో కనీసం అర్ధగంట నుంచి గంటపాటు రోగులు నిల్చోవాల్సి వస్తోంది. దీంతో గొడవలు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం ఫార్మసీ విభాగంలో నాలుగు కౌంటర్లు ఉన్నాయి. అన్ని కౌంటర్ల వద్దకు వేర్వేరుగా రోగులు క్యూలో నిలబడేందుకు స్థలం లేకపోవడంతో ఇరుకు ప్రదేశంలో కిక్కిరిసిపోతున్నారు. మందులు తీసుకున్న వారు సైతం వెనక్కు రావడానికి కూడా అదే దారి కావడంతో పరస్పరం తోసుకుంటూ వెళ్లక తప్పడం లేదు. చాలా ఏళ్లుగా ఈ అవస్థ ఉన్నా, అధికారులు పరిష్కారం చూపడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫార్మసీ విభాగంలో ప్రస్తుతం 13 మంది పార్మసిస్టులు పనిచేస్తున్నారు. జీవో 124 ప్రకారం మరో ఆరుగురిని నియమించాల్సి ఉన్నా, ఆచరణకు నోచుకోవడం లేదు. ఔట్‌సోర్సింగ్, లేదా తాత్కాలికంగా సిబ్బందిని తీసుకోవాలన్నా, వారి వేతనాలకు ఎవరూ భరోసా ఇవ్వరు. దీనికితోడు ప్రతి క్వార్టర్లీ ఓపీ విభాగానికి రూ.కోటి విలువైన 634 రకాల మందులు వస్తున్నాయి. రోగుల పదింతలు పెరిగినా క్వార్టర్లీ (మూడు నెలలు) బడ్జెట్ పెరగకపోవడంతో కొన్ని రకాల మందులు చాలడం లేదని తెలుస్తోంది. ముఖ్యంగా జనరల్ మెడిసిన్‌కు మందుల కొరత ఉన్నట్లు తెలుస్తోంది. రోగులు మందులు తీసుకుని వెళ్లేందుకు సౌకర్యం కల్పించడంతోపాటు మంజూరైన పార్మసిస్టులను నియమించడం, బడ్జెట్‌ను పెంచి మందులు అందుబాటులో ఉంచడం చేసే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఈ విషయమై సూపరింటెండెంట్ డాక్టర్ జగన్నాథ్ వివరణ ఇస్తూ ఫార్మసిస్టుల పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వానికి రాశామని, కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్లామని తెలిపారు. అనుమతులు లేకుండా ఎవరినీ నియమించుకోవడం వీలుకాదన్నారు. అలాగే మందుల కోసం ఫార్మసీ విభాగం నుంచి బయటకు వెళ్లేందుకు మార్గం ఏర్పాటు చేసేందుకు ఇంజినీరింగ్ అధికారులతో మాట్లాడామని, త్వరలో ఈ సమస్య పరిష్కరిస్తామని చెప్పారు.