అనంతపురం

అభివృద్ధే తెలుగుదేశం లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాప్తాడు, నవంబర్ 12 : బడుగు, బలహీన వర్గాలను ఆర్థికంగా అభివృద్ధి చేయడమే తెలుగుదేశం పార్టీ ముఖ్య లక్ష్యమని రాష్ట్ర స్ర్తి శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు. సోమవారం పేదరికంపై గెలుపు, ఆదరణ పథకం కింద పనిముట్లను పంపిణీ చేసే కార్యక్రమాన్ని స్థానిక ఆటో నగర్‌లో ఎంపీడీఓ శ్రీనివాసులు అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి పరిటాల సునీత హాజరయ్యారు. ముందుగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్, బాబు జగజ్జీవన్‌రాం, జ్యోతిరావు పూలే చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ధన రూపంలో కాకుండా వస్తు రూపంలో రుణాలను మంజూరు చేస్తున్నామని లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కుటుంబానికి రూ.10 వేలు ఆదాయం వచ్చేలా చేయడమే ప్రభుత్వ ఉద్దేశం అన్నారు. రాష్ట్రం లోటు బడ్జెట్‌లో వున్నా పేదలకు ఉపాధి కల్పించేందుకు సబ్సిడీ రుణాలు మంజూరు చేస్తున్నామని, రాష్ట్ర వ్యాప్తంగా ఆదరణ -2 పథకంలో భాగంగా వివిధ కార్పొరేషన్‌ల ద్వారా 8 లక్షల యూనిట్లు గ్రౌండ్ చేయడం జరుగుతుందన్నారు. అనంతపురం జిల్లాలో 10539 మంది లబ్దిదారులకు రూ.146 కోట్లు సబ్సిడీ మంజూరు చేశామని, అదేవిధంగా నియోజకవర్గంలోని 3199 మంది లబ్దిదారులకు రూ.14 కోట్ల సబ్సిడీలు అందించామని తెలిపారు. అనంతరం లబ్దిదారులచే ఈ పథకం అమలుపై వారి అభిప్రాయాలను పంచుకున్నారు. అనంతరం లబ్దిదారులకు కుట్టుమిషన్‌లు, వాషింగ్ మిషన్‌లను చేతి పనిముట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ ఛైర్మన్ గౌస్‌మోదీన్, మాంసవృత్తుల అధ్యక్షులు ప్రకాశ్‌నాయుడు, జెడ్పీటీసీ వేణుగోపాల్, ఏపీఎంఐ పీడీ వెంకటేశ్వర్లు, మాజీ సర్పంచ్ వెంకటరాముడు, తహసిల్దార్ వరప్రసాద్‌రావు, వాల్మీకి ఫెడరేషన్ డైరెక్టర్ మద్దిలేటి, ఎస్‌బీఐ చీఫ్ మేనేజర్ శాంతిరాజ్, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.
మోడల్ పోలీస్ స్టేషన్‌ను పరిశీలించిన మంత్రి
రాప్తాడులో నూతనంగా నిర్మించిన మోడల్ పోలీస్ స్టేషన్‌ను సీఐ పుల్లయ్య, ఎస్‌ఐ ధరణిబాబు ఆధ్వర్యంలో మంత్రి పరిటాల సునీత పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ, సీఐలను స్టేషన్‌లో గల సదుపాయాల గురించి ఆమె అడిగి తెలుసుకున్నారు. రూ.4.50 కోట్లతో ఈ స్టేషన్‌ను నిర్మించామని, త్వరలోనే ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని ఆమె తెలిపారు.

విప్ అత్తార్‌కు ఘన స్వాగతం
కదిరి, నవంబర్ 12: ప్రభుత్వ విప్‌గా నియమితులైన కదిరి ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాషాకు సోమవారం టీడీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. విప్‌గా నియమించిన తరువాత తొలిసారిగా కదిరిలోకి అడుగుపెట్టిన అత్తార్‌కు పులివెందుల రోడ్డులో ఉన్న గుర్రాలవంక వద్దకు వెళ్ళి పూలమాలలు వేసి ఘనంగా స్వాగతం పలికారు. అక్కడి నుంచి వేమారెడ్డి కూడలి వరకు ఆ పార్టీ నాయకులు అత్తార్‌తో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించారు. ప్రధాన కూడళ్ళలో బాణసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా అత్తార్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తనపై నమ్మకం ఉంచి విప్‌గా నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాకుండా మైనార్టీలకు మంత్రిగా ఫరూక్‌ను మంత్రి వర్గంలోకి తీసుకోవడం, షరీప్‌ను మండలి చైర్మెన్‌గా నియమించి మైనార్టీలకు సముచిత స్థానం కల్పించినందుకు మైనార్టీల తరపున ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

రాష్టస్థ్రాయి హాకీ పోటీలు ప్రారంభం

ధర్మవరం, నవంబర్ 12: పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో సోమవారం రాష్టస్థ్రాయి జూనియర్ హాకీ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను మున్సిపల్ ఛైర్మన్ బీరే గోపాలకృష్ణ, ఏపీ హాకీ డైరెక్టర్ నిరంజన్‌రెడ్డి, డీఎస్పీ వెంకటరమణ ప్రారంభించారు. ఈ పోటీల్లో రాష్ట్రంలోని 13 జిల్లాల నుండి క్రీడా జట్లు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా ధర్మాంబ హాకీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశంలో అతిథులు డీఎస్పీ, మున్సిపల్ ఛైర్మన్, నిరంజన్‌రెడ్డి, మార్కెట్ యార్డు ఛైర్మన్ కమతం కాటమయ్య మాట్లాడుతూ గత 9 సంవత్సరాలుగా ధర్మవరంలో హాకీ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్టస్థ్రాయి పోటీలు నిర్వహించడం గర్వించదగ్గ విషయమన్నారు. జాతీయ క్రీడ అయిన హాకీకి గుర్తింపు తెచ్చే విధంగా టోర్నమెంట్లు నిర్వహించడం అభినందనీయమన్నారు. అనంతరం మ్యాచ్‌లు జరిగాయి. వైజాగ్, కర్నూలు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో 120 సోర్కుతో వైజాగ్ జట్టు విజయం సాధించింది. అలాగే తూర్పుగోదావరి జిల్లా, శ్రీకాకుళం జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో 41 తేడాతో తూర్పుగోదావరి జిల్లా విజయం సాధించింది. చిత్తూరు, విజయనగరం జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో 31 తేడాతో చిత్తూరు జట్టు విజయం సాధించింది. చివరిగా నెల్లూరు, కృష్ణా జిల్లా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇరు జట్లు సమానంగా గోల్స్ చేసినా అంపైర్ల నిర్ణయం ప్రకారం కృష్ణా జిల్లాను విజేతగా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ధర్మాంబ అసోసియేషన్ సభ్యులతోపాటు జిల్లా హాకీ అసోసియేషన్ అధ్యక్షులు విజయ్‌బాబు, కార్యదర్శి సూర్యప్రకాష్, సహాయ కార్యదర్శి వడ్డే బాలాజి పాల్గొన్నారు.